EPAPER
Kirrak Couples Episode 1

Home Minister Anitha : జగన్ ను ఆడేసుకున్న హోంమంత్రి అనిత… నాలాగా నువ్వు చెప్పగలవా ?

Home Minister Anitha : జగన్ ను ఆడేసుకున్న హోంమంత్రి అనిత… నాలాగా నువ్వు చెప్పగలవా ?

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చెలరేగిపోయారు. డిక్లరేషన్ లేకుండా తిరుమల ఎలా వెళ్తావు అంటూ నిలదీశారు. తిరుమల లడ్డూ ఎన్నడూ తినని జగన్‌ దాని నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.


ఎస్ నేను హిందువును. నేను ధైర్యంగా చెప్తున్నా. నాలాగా నువ్వు చెప్పగలవా అంటూ ఛాలెంజ్ చేశారు. ఒక దళితురాలినైన నన్నే నువ్వు ఒకనాడు తిరుమల వెళ్లనివ్వలేదని ఆమె గుర్తు చేస్తుకున్నారు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా వెంకటేశ్వరస్వామికి నన్ను దూరం చేయగలిగావా అంటూ అనిత విరుచుకుపడ్డారు.

సంతకం అడిగితే పారిపోయాడు…


డిక్లరేషన్ మీద సంతకం పెట్టవయ్యా జగన్ అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నారని, అలాంటి నీకు దీనిపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఇక జగన్ దళితులను ఈ వివాదంలోకి లాగడంపైనా అనిత మండిపడ్డారు. దళితులు అంటే అంత చిన్నచూపు ఏంటని, దళితులు గుళ్లకు వెళ్లట్లేదా అని నిలదీశారు. నీకో విషయం తెలుసో లేదో కానీ టీటీడీలో డిప్యూటీ ఈఓ ర్యాంకులో చాలా మంది దళితులున్నారని, కావాలంటే ఓసారి చెక్ చేసుకోవాలన్నారు.

మానవత్వం అంటే సిగ్గు అనిపిస్తోంది…

మీ నోటి వెంట మానవత్వం అనే పదం పలికితే ఆ పదమే సిగ్గుపడుతుందయ్యా జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యంగస్త్రాలు సంధించారు. ఈ మాటలు చెప్పే ముందు దిల్లీలో వైఎస్ సునీత, గల్లీలో వైఎస్ షర్మిలలు ఎంతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలియదా అన్నారు. అలాంటి నువ్వు మానవత్వం గురించి మాట్లాడాతవా అంటూ ఫైర్ అయ్యారు.

Also Read : పవన్ పై వ్యతిరేకత.. తమిళనాడులో రోజా బిజి బిజీ, ప్లాన్ ‘అదిరింది’

దేశ బహిష్కరణ చేయాల్సిందే…

గత ఐదేళ్లు చక్కగా సంపాదించి విదేశాల్లో దాచుకున్నావని, ఐదేళ్లు సీఎంగా ఏపీని పాలించిన వ్యక్తిగా ఇదేం దేశం అంటున్నావంటే నిన్ను దేశ బహిష్కరణ కాకుంటే ఇంకేం చేయాలని ప్రశ్నించారు.
మాట మాట్లాడితే ఇదేం దేశం, ఇదేం మతం అని జగన్ అంటున్నారని, అందుకే ఆయన్ను దేశ బహిష్కరణ చేయాలన్నారు. అఫ్ కోర్స్ ఎలాగూ దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నందునే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అనిత అనుమానపడ్డారు.

అంతటి వాళ్లే సంతకాలు పెట్టారు…

ఇక తిరుమలలో దర్శనానికి ముందు డిక్లరేషన్ తప్పనిసరని, అయితే అబ్ధుల్ కలాం, సోనియా గాంధీ, షారుక్ ఖాన్ లాంటి వాళ్లే స్వామివారికి డిక్లరేషన్ సమర్పించి దర్శనానికి వెళ్లారని ఆమె గుర్తు చేశారు.
నీకు దర్శనం ఇష్టం లేకనే తమపై బురద చల్లేందుకు యత్నిస్తున్నావని, ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారన్నారు.

ఎనీ టైం డిక్లరేషన్ మీద సంతకం పెట్టొచ్చని, దర్శనం చేసుకోవచ్చని కావాలంటే కావాలంటే మీ వాళ్లందరికీ ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేయిస్తామన్నారు. మతం ఏదైనా దాన్ని గౌరవించే బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉంటుందని, దాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

Related News

BJP Vs YCP: బీజేపీతో తాడో పేడో.. జగన్ సాహసం చేస్తున్నారా?

YS Jagan: వైఎస్ జగన్‌‌కు కామ్రెడ్లే దిక్కవుతారా?

YS Sharmila: కూటమి సర్కార్‌ని ప్రశ్నిస్తూ.. జగనన్నపై షర్మిల బాణాలు

Roja: పవన్‌కు ఏం తెలీదు.. బాబుకు బుద్ది లేదు.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన రోజా, మదురైలో పూజలు

AP Govt: సలహా ఇవ్వండి.. సర్టిఫికెట్ తీసుకోండి.. ఏపీ సీఎం ఐడియా అదిరింది కదూ..

Jagan: జగన్ అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి.. 12వ సారి..

Big Stories

×