EPAPER

Ramoji Rao: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రేపు, ఎల్లుండి రామోజీరావుకు..

Ramoji Rao: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రేపు, ఎల్లుండి రామోజీరావుకు..

Ramoji Rao: రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది. రామోజీరావు మృతికి నివాళిగా రెండురోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అధికారిక కార్యక్రమాలను నిర్వహించబోదు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు.


రామోజీరావు శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించగా.. సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

చంద్రబాబు దంపతులు, లోకేశ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


అనంతరం వారు మాట్లాడుతూ.. రామోజీరావు మరణ వార్త తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసిందని పేర్కొన్నారు. ఎంతోమంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు ఆయన అని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలని వారు పేర్కొన్నారు.

Also Read: ఏపీ ప్రత్యేక హోదాపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణ వార్త విని గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెదపారుపూడిలో ఆయన చిత్రపటానికి గ్రామస్తులు నివాళులర్పించారు. ఆ గ్రామానికి రామోజీరావు చేసిన సేవలను కొనియాడారు.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×