EPAPER

Roja Jabardasth show: ఆ రియాలిటీ షో కోసం రోజా తహతహ..మళ్లీ అవకాశం ఇస్తారా?

Roja Jabardasth show: ఆ రియాలిటీ షో కోసం రోజా తహతహ..మళ్లీ అవకాశం ఇస్తారా?

AP ex MLA Roja re entry to Jabardasth(Andhra news today): ఒకప్పుడు తన అందం, అభినయంతో మల్టీ టాలెంటెడ్ నటిా కితాబులు అందుకున్న నటి రోజా. అప్పట్లో పెద్ద స్టార్ హీరోలతో నటించిన రోజా రియాలిటీ షోలోనూ తనదైన మార్కును చూపించారు. ఐదు పదుల వయసులోనూ ఎంతో చలాకీగా నేటి యంగ్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్నారు రోజా. సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ రోజా రాణించారు. మొదట్లో టీడీపీ లో కొంతకాలం ఉన్న రోజా తర్వాత జగన్ రాజకీయ ప్రవేశం తర్వాత వైసీపీలోకి మారిపోయారు. ఎమ్మెల్యేగా నగరి నియోజకవర్గం నుంచి గెలిచారు. ప్రత్యర్థులను తన మాటల తూటాలతో మాట్లాడనీయకుండా చేయడంలో రోజా స్టయిలే వేరు. తమ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీని, అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన నేత పవన్ కళ్యాణ్ ఇలా వారందరినీ టార్గెట్ చేస్తూ వారిపై విమర్శనాస్త్రాలు సంధించేవారు.


టార్గెట్ పవన్, లోకేష్

పవన్ కళ్యాణ్, లోకేష్ ల వ్యక్తిగత జీవితాన్ని సైతం టార్గెట్ చేసి మాట్లాడేవారు రోజా. పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని..ఆయన సమాజానికి ఎలాంటి సందేవం ఇస్తున్నారు ఇలాంటి చర్యల ద్వారా అంటూ పవన్ అభిమానుల ఆగ్రహానికి సైతం గురయ్యారు. లోకేష్ కూడా రాజకీయంగా ఎదుగుదల లేని వారసుడు అంటూ చాలా సార్లు సందర్బం వచ్చినప్పుడల్లా వీరిపై విరుచుకుపడేవారు. అయితే చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు కూడా బాబును ఉద్దేశించి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. పైగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మీదా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి మహిళాగ్రహానికి గురయ్యారు. తన మనసులో ఏం అనిపిస్తే అది బయటకు అనేస్తుంటారు రోజా.


మీడియాకు దూరంగా..

ఎలాగైనా అధికారంలోకి వచ్చేది తామేనని ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పిన రోజా ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాకు దొరకకుండా కొంతకాలం అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.అయితే రోజా మళ్లీ పోయిన తన ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవాలని అనుకుంటున్నారట. అందుకే మళ్లీ తనకి ఎంతగానో పాపులారిటీ తీసుకొచ్చిన జబర్దస్త్ ప్రోగ్రాంకు తిరిగి తనని తీసుకోవాల్సిందిగా నిర్వాహకులను కోరుతోందట. అయితే జబర్దస్త్ ప్రోగ్రామ్ వచ్చేది ఈటీవీలో. అది ఈనాడు యాజమాన్యానికి చెందినది. రామోజీరావు బతికుండగా చంద్రబాబు సీఎంగా రావాలని బలంగా కోరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతల అక్రమాలను ఎండగడుతూ అనేక వార్తా కథనాలను అందించారు.

అవకాశం ఇస్తారా?

అప్పట్లో రోజా కూడా ఈనాడు తప్పుడు వార్తలని రామోజీరావును తప్పుపట్టారు. అందుకని ఇప్పుడు ఈనాడు యాజమాన్యం రోజాని తీసుకుంటుందా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. మొదట్లో రోజా, నాగబాబు ఈ జబర్థస్త్ కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరించారు. ఈ ప్రోగ్రామ్ కి ప్రత్యేక ఆకర్షణగా మారారు. అయితే వ్యక్తిగత కారణాలతో నాగబాబు దూరం అయ్యారు. రాజకీయాలలో బిజీగా ఉండటంతో రోజా కూడా జబర్ధస్త్ కార్యక్రమానికి దూరం అవుతూ వచ్చారు. ఇప్పుడు రోజాకు మళ్లీ తాను ప్రజలలోకి పాపులారిటీ సంపాదించుకోవాలంటే ఇలాంటి రియాలిటీ షోకి వెళ్లడమే కరెక్ట్ అనుకుంటున్నారట.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×