EPAPER

karikal valaven resign: ఏపీలో రాజీనామాల పర్వం, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల రిజైన్

karikal valaven resign: ఏపీలో రాజీనామాల పర్వం, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల రిజైన్

karikal valaven resign: ఆంధ్రప్రదేశ్‌ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన అధికారులను ఏమాత్రం సహించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఈ విషయంలో ఒక్కసారి ఛాన్స్ ఇస్తే, మళ్లీ ఇదే కంటిన్యూ అవుతుందని ఓపెన్‌గా చెప్పేశారు. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో గుబులు మొదలైంది.


ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించు కోవాలనే దానిపై ఆలోచనలోపడ్డారు. ఇప్పటికిప్పుడు రాజీనామా చేసినా ప్రభుత్వం అంగీకరించడం లేదు. లెక్కలు తేలిన తర్వాతే పంపించాలని నిర్ణయించింది. ముఖ్యంగా తిరుమల నుంచే ప్రక్షాళన చేపట్టారు సీఎం చంద్రబాబునాయుడు. టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై వేటు వేసింది. కొత్తగా శ్యామలారావును నియమించింది.

దేవాదాయ శాఖలో అనేక అవతకవతలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ దేవాదాయ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కరికాల వలవన్ తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత సర్వీసులో కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో నెలన్నర పదవీకాలం ఉండగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.


ALSO READ: వివాదంలో జగన్, ఫర్నీచర్‌పై శిక్షించాలన్న శివరామ్

గతంలో జగన్ ప్రభుత్వానికి ఆయన పూర్తిగా సహకరించారనే ఆరోపణలు కరికాల వలవన్‌పై ఉన్నాయి. అంతేకాదు దేవాదాయ శాఖలో అవినీతితోపాటు నిధులు దారి మళ్లినట్టు వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో కరికాల రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరి కొత్త ప్రభుత్వం ఆయన రాజీనామా ఓకే చేస్తుందా? లెక్కలు తేలిన తర్వాతే రాజీనామాను అంగీకరిస్తామని చెబుతుందా? అనేది చూడాలి. మొత్తానికి పదవీ విరమణ తర్వాత కొనసాగుతున్న అధికారులకు టెన్షన్ మొదలైంది. ఈ జాబితాలో ఇంకెంతమంది అధికారులు బయటకు వస్తారో చూడాలి.

Tags

Related News

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu: ఆ విషయంలో వెనక్కి తగ్గం.. సీఎం చంద్రబాబు క్లారిటీ

Perni Nani: నా వెంట్రుక కూడ పీకలేరు.. కోసి కారం పెట్టండి.. మాజీ మంత్రి నాని సెన్సేషనల్ కామెంట్స్

AP Politics: లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్.. పేర్లన్నీ రాస్తున్నా.. ఎవ్వరినీ వదలనంటూ కామెంట్

Swiggy Services Ban: ఏపీలో స్విగ్గీ సేవలు బ్యాన్, హోటల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం, కారణం తెలుసా?

SIT inquiry: తిరుమల లడ్డూ వివాదం.. ఈ వారం రంగంలోకి సిట్, తొలుత..

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

Big Stories

×