Big Stories

AP : మరోసారి చలో విజయవాడ కార్యక్రమం .. ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగుల హెచ్చరిక..

AP : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతం కానున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మరోసారి చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టడానికి వెనుకాడబోమన్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటించారు.

- Advertisement -

రెండు నెలలకుపైగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. నిర్దిష్ట సమయంలో సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా స్పందన లేదన్నారు. ఈ నెల 19 నుంచి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందిస్తామని తెలిపారు .

- Advertisement -

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామన్నారు. ఈ నెల 17న అనంతపురంలో, ఈ నెల 27న ఏలూరులో, జూన్‌ 8న గుంటూరులో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఒకరోజు నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచినా ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదన్నారు.

ఉద్యోగుల ఉద్యమం వచ్చే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏపీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. మరి ఉద్యోగుల సమస్యను వైసీపీ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందే చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News