EPAPER

NTR Successors victory: ఏపీ ఎన్నికల్లో ఎన్టీఆర్ వారసుల హవా, అందరూ గెలుపు..

NTR Successors victory: ఏపీ ఎన్నికల్లో ఎన్టీఆర్ వారసుల హవా, అందరూ గెలుపు..

AP Election results 2024, NTR Successors victory: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు వారసులకు ఈసారి ఎన్నికలు కలిసి వచ్చాయి. 2024 ఎన్నికలు ఆయన వారసులకు స్వర్ణయుగం. ఎప్పుడూలేని విధంగా తొలిసారి అందరు గెలిచి ఇటు శాసనసభతోపాటు పార్లమెంటులోనూ అడుగుపెట్టబోతున్నారు.


ఎన్టీఆర్ వారసులు ఈ స్థాయిలో గెలవడం ఇదే తొలిసారి. కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం నందమూరి బాలకృష్ణ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. గతంలో మంగళగిరి నుంచి ఓడిపోయిన నారా లోకేష్, ఈసారి అక్కడి నుంచి బరిలోకి దిగి గెలిచారు.

ఇక లోక్‌సభకు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, విశాఖ నుంచి బరిలోకి దిగారు. ఆయన నాలుగున్నర లక్షల మెజార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగారు. ఆమె దాదాపు రెండు లక్షల పైచిలుకు మెజార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి ఎప్పుడూ లేని విధంగా 2024 ఎన్నికలు ఎన్టీఆర్ వారసులకు కలిసి వచ్చిందనే చెప్పవచ్చు.


ALSO READ: ఉత్తరాంధ్రలో టీడీపీ జోరు, వైసీపీకి రెండే రెండు

2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ మాత్రమే గెలిచారు. టీడీపీ తరపున రాయలసీమ నుంచి గెలిచారు. నారా లోకేష్, భరత్, పురందేశ్వరిలు పరాజయం పాలయ్యారు. ఈసారి గెలుపు కోసం అందరూ పక్కాగా స్కెచ్ వేసి మరీ గెలుపొందారు. అందరూ ఏపీ నుంచే గెలవడం మరో విశేషం. ఎన్నికల్లో పోటీ చేసిన‌వాళ్లు అందరూ గెలవడంతో నందమూరి ఫ్యామిలీ సభ్యులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎన్నాళ్ల నాటి కల ఇప్పటికి నెరవేరిందని అంటున్నారు.

 

Tags

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×