EPAPER

Jagan : సీఎం జగన్ పోలవరం పర్యటన.. పనుల పురోగతిపై సమీక్ష..

Jagan : సీఎం జగన్ పోలవరం పర్యటన.. పనుల పురోగతిపై సమీక్ష..


AP CM Jagan today news(Andhra news updates) : పోలవరంలో సీఎం జగన్ పర్యటించారు. నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంపై చేశారు. పునరావాసం కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్‌ ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించాలని స్పష్టం చేశారు. 12,658 కుటుంబాలను తరలించామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు.

పోలవరాన్ని టూరిస్ట్‌ స్పాట్‌గా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పోలవరం వద్ద బ్రిడ్జిని నిర్మించాలని ఆదేశించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ నాటికి ఈ ‌ పనుల పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.


పోలవరం ప్రాజెక్టులో చిన్న సమస్యలను విపత్తుగా చూపించే మీడియా ఏపీలో ఉందని జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనుల పురోగతిని అధికారులు వివరించారు.

పోలవరంఎగువ కాఫర్‌ డ్యాం వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్‌ తిలకించారు. ప్రాజెక్ట్‌ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు.

Related News

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Big Stories

×