EPAPER

Ap Cm Chandrababu : ఏపీలో గంజాయి పండించినా, సేవించినా… ఇదే నా ఫైనల్ వార్నింగ్, సీఎం చంద్రబాబు హెచ్చరిక

Ap Cm Chandrababu : ఏపీలో గంజాయి పండించినా, సేవించినా… ఇదే నా ఫైనల్ వార్నింగ్, సీఎం చంద్రబాబు హెచ్చరిక

Cm Chandrababu On Cannabis : ఏపీ సీఎం చంద్రబాబు గంజాయి బ్యాచ్ ని తీవ్రంగా హెచ్చరించారు. ఇకపై రాష్ట్రంలో గంజాయి ఆపేయండి, ఇక రాష్ట్రంలో మీ ఆటలు సాగవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.


గంజాయి షీట్స్ తెరుస్తాం…

రౌడీషీట్స్ తరహాలో గంజాయి షీట్స్ తెరవాలని మంత్రులు ప్రతిపాదనలు ఇచ్చారని చెప్పారు. జన సమూహాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, పోలీస్ స్టేషన్ లోనూ గంజాయి బ్యాచ్ ఫోటోలు ప్రదర్శిస్తామన్నారు. ఏపీలో గంజాయి ఎవడూ పండించటానికి, రవాణా చేయటానికి,  సేవించటానికి వీలు లేదని ఖరాకండీగా చెప్పేశారు. ఇదే మీకు ఫైనల్ వార్నింగ్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.


లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే…

రాష్ట్రంలో కొంతకాలంగా లిక్కర్ మత్తు, డ్రగ్స్ మత్తులో జోగుతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో లా అండ్ ఆర్డర్ ను ఇష్టానుసారాంగ దెబ్బతీస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శాంతి భద్రతలను నిర్వీర్యం చేసే వాళ్లను తాను హెచ్చరిస్తున్నానన్నారు. ఇక రాబోయే రోజుల్లో మీ జివితాలను మీరు దెబ్బతీసుకోవాలనుకుంటేనే తప్పుడు పనులు చేయండన్నారు. లేకపోతే మెయిన్ స్ట్రీమ్ కు రావాలన్నారు. ఒకవేళ జనజీవన స్రవంతిలో కలవకపోతే మాత్రం ఎవ్వడినీ వదిలిపెట్టనన్నారు.

అందుకే సాంకేతికత ఉపయోగిస్తున్నాం…

ఎక్కడ చూసినా సీసీ కమెరాలు పెడుతున్నామని, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. నేరాల కట్టడికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ఎవరైనా ఇలాంటి వారు ఉంటే వాళ్లందరినీ ఎలా నియంత్రణ చేయాలో ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఇదే విశయంపైనా క్యాబినెట్ లోనూ మంత్రులందరితోనూ చర్చించామన్నారు. ఒకవేళ గంజాయి రవాణాదారులు, వినియోగదారులను దారిలోకి తెచ్చేందుకు వాళ్లను సంఘ బహిష్కరణ చేసేందుకు వెనుకాడబోమన్నారు. అలాంటి వాళ్లపై రౌడీ షీట్లు తెరిచి వాళ్లను ఎక్కడి వెళ్లకుండా బ్యాన్ చేస్తామన్నారు. ఎన్ని చేసినా పరిస్థితులు కంట్రోల్ కాకపోతే ఇందుకు అవసరమైన చట్టాలను సైతం తీసుకొస్తామన్నారు.

అందరూ పాలసీకి కట్టుబడి ఉండాలి…

ఏపీలో గంజాయి కాల్చేందుకు, అంటించేందుకు వీల్లేదన్నారు. లిక్కర్ కూడా ఎవరు పడితే వాళ్లు అక్రమంగా రవాణా చేసినా, వ్యాపారం చేసినా వాళ్లను వదిలిపెట్టమన్నారు. మద్యం పాలసీని చాలా పారదర్శకంగా తీసుకొచ్చామని, దాన్ని అందరూ అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవన్నారు. తమ పార్టీ వాళ్లైనా, మిత్రపక్షం వాళ్లైనా చట్టాన్ని ఉల్లంఘించకూడదన్నారు. ఇక ప్రతిపక్షాలు అంటూ వైసీపీపై ధ్వజమెత్తారు. ఏం పని మొదలెట్టినా వాళ్లు బురదచల్లే కార్యక్రమాలే చేస్తుంటారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం కఠినం…

రాష్ట్రంలో లిక్కర్ అక్రమ రవాణా , అధిక రేట్లకు అమ్మడంతో పాటు గంజాయి సాగు, అమ్మకం, రవాణాపైనా చాలా పకడ్భందీగా, ముందస్తు ప్రణాళికతో ఉన్నట్లు చెప్పారు. ఇంత పక్కా ప్లాన్ తో ఉన్న సీఎం చంద్రబాబు ఆయా రక్కసిలను రూపుమాపేందుకు ముందుకెళ్తున్నారు.

కేంద్రం పంజా…

ఇటు కేంద్రం సైతం సంఘ విద్రోహులకు ఆర్థిక వనరులైన గంజా సాగుపై ఇప్పటికే పంజా విసురుతోంది. దీంతో ఓ వైపు కేంద్ర ప్రభుత్వం మరోవైపు ఏపీ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దేశంలో లా అండ్ ఆర్డర్ ఎంత పటిష్టంగా అమలు అవుతుందో, ఏపీలోనూ అంతే స్థాయిలో అమలు చేయాలన్నది సీఎంగా చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

Also Read : లిక్కర్ కలిపిన బంధం.. కలిసిపోయిన జనసేన, వైసీపీ

Related News

Sad Incident: ఘోరం.. ప్రమాద స్థలాన్ని చూపించబోయి తనే యాక్సిడెంట్‌లో దుర్మరణం

Borugadda Anil : జైల్లో బోరుమన్న బోరుగడ్డ అనిల్, ఇకపై ఎలాంటి తప్పు చేయను

Free Sand Scheme AP: ఇలా చేస్తే మీకు ఇసుక ఫ్రీ.. ఫ్రీ.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

Nandyal Crime News: కోరిక తీర్చలేదని.. కోడలిని చంపిన మామ.. మరీ ఇంత దారుణమా..

Amaravati city: అమరావతికి వరల్డ్ బ్యాంకు భారీ రుణ సాయం.. ఎన్ని కోట్లంటే?

Kodi Kathi Case: కోడి కత్తి కేసు.. విచారణకు నిందితుడు శ్రీనివాస్.. జగన్ అంతర్యమేంటి?

Big Stories

×