EPAPER

AP CM Chandrababu: ఏం లేదని అధైర్య పడలేదు.. రూ.16 లక్షల పెట్టుబడులతో ముందడుగు:చంద్రబాబు నాయుడు

AP CM Chandrababu: ఏం లేదని అధైర్య పడలేదు.. రూ.16 లక్షల పెట్టుబడులతో ముందడుగు:చంద్రబాబు నాయుడు

AP CM Chandrababu Participated In 78th Independence Celebrations: 78వ స్వాతంత్ర్య వేడుకలు విజయవాడలోని పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పోలీసుల అభివాదం అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య శుభసందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్వాతంత్ర్యం రావడానికి ఎంతో మంది మహానుభావులకు జాతిపితా మహాత్మగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారికి, జాతీయ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య వంటి మహనీయులను స్మరించుకుంటూ వారందరికి ఘన నివాళులు అర్పించుకుందామని అన్నారు.


1857లో ప్రథమ స్వాతంత్ర్య పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. 1946లో విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టొబర్ 1న ఆంద్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత 1956 నవంబర్ 1న హైదరాబాద్‌ రాజధానిగా మొదటి భాషా రాజధానిగా ఏర్పడింది. అనంతరం 2014లో ఏపీ రాష్ట్ర విభజన జరిగి తెలుగు రాష్ట్రాలు విభజన జరిగి రాజధానులుగా ఏర్పడ్డాయి. అందులోనూ కొత్త రాష్ట్రంగా ఏపీ రాష్ట్రం ఏర్పడ్డాక ఏం చేయాలో తెలియని పరిస్థితిలోనూ అన్ని రంగాల్లో 16 లక్షల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించి అన్ని రంగాల్లొ ముందుకెళ్లాం.

రాజధానికి ఏం లేదని అధైర్యపడలేదు. అమరావతి వేదికగా రాజధానిగా ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్‌ని ఏపీ కోసం నిర్మించి అందరి దృష్టిని ఏపీ వైపు చూసేలా చేశాం. మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం ఇప్పటికే పూర్తి అయ్యేదని చంద్రబాబు అన్నారు. గత పాలకులు ఉపాధి కల్పనలో అన్నింటిలో విధ్వంస పాలనలో ముందుకు తీసుకెళ్లలేకపోయారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసం చేసి అందరిని అణగదొక్కారు. అంటే గత పాలకుల నిర్వాహకంతో పేదవారి తలసరి ఆదాయం తగ్గిపోయింది.


Also Read:రాష్ట్రంలో నేటి నుంచి ఆరోగ్య సేవలు బంద్

ఈ ఐదేళ్లలో వారు చేసిన మోసాలను ఈ ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టి వారందరికి బుద్ది చెప్పి కూటమికి పట్టం కట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీకి పట్టం కట్టి ముందంజలో ఉండేందుకు నమ్మకంగా ఉన్నారు. కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా మేము ఆ స్వేచ్ఛను మేం అందించేందుకు సిద్దంగా ఉన్నామని మాటిస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు అన్నారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ అడుగుజాడల్లో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ముందుకు సాగుతున్నాం. 16,340 పోస్ట్‌లతో మెగా డీఎస్సీపై మా ప్రభుత్వం చిత్తశుద్దిని చాటుకున్నాం. ప్రతి కుటుంబానికి భూమికి అందించేందుకు మేం కృషి చేస్తున్నాం.

రికార్డుల మార్పుకు భూములను కోల్పోయారు ప్రజలు. ప్రజలకు భధ్రత లేకుండా చేశారు. అందుకే ఈ సమస్యని ల్యాండ్ టైటిలింగ్ ద్వారా క్యాన్సిల్ చేశాం. మీ భూమి మీ హక్కు అనే టైటిల్‌తో వారి సమస్యలను తీర్చేందుకు మేం ఎప్పుడు ముందుంటాం. పింఛన్ల విషయానికి వస్తే వృద్దులకు 400 చేశాం. దివ్యాంగులకు 6 వేలు దీర్ఘకాలిక వ్యాది గ్రస్తులకు 1500 ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం. 1,64 వేల కోట్ల రూపాయలను కేవలం ఫించన్లకే కెటాయించాం. ప్రజల భాగస్వామ్యంతో యువతకు ఉన్నత విద్య కోసం అనేక సంక్షేమాలు సృష్టించేందుకు అన్నివిధాలుగా నైపుణ్యం కోరకు చర్యలు తీసుకుంటున్నాం. టూరిజం శాఖపై బడ్డెట్‌ని కేటాయించాం. గత ప్రభుత్వం చేసిందేమి లేదంటూ.. పూర్వ వైభవాన్ని ఏపీకి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×