EPAPER

AP Cabinet Meeting: దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. శారదా పీఠానికి షాక్ – ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

AP Cabinet Meeting: దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. శారదా పీఠానికి షాక్ – ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

⦿ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
⦿ దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
⦿ నాలుగు నెలలకు ఒకటి ఇవ్వాలని నిర్ణయం
⦿ ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ రద్దు
⦿ సరిగా అమలయ్యేలా చూడాలని సీఎం ఆదేశం
⦿ శారదా పీఠం భూ కేటాయింపులు రద్దు
⦿ గ్రామ సభల ద్వారా పెన్షన్ల సమస్య పరిష్కారం
⦿ ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు ఛాన్స్
⦿ నాతో సమానంగా మంత్రులు స్పీడ్ పెంచాల్సిందే
⦿ నిర్లక్ష్యంగా ఉంటే కష్టమేనని చంద్రబాబు హెచ్చరిక


అమరావతి, స్వేచ్ఛ: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉదయం 11కు మొదలైన సమావేశం మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. ఈ భేటీలో చెత్తపన్ను రద్దు, మహిళలకు ఉచిత సిలిండర్లు పంపిణీ పథకం, దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్య 15 నుంచి 17కు పెంపు, ఆలయ కమిటీల్లో ఇద్దరు బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించాలని పరిస్థితిని బట్టి సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపైన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కారించాలని నిర్ణయించింది. దీంతో పాటు మంగళగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకలుగా మార్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీపం వస్తోంది..
దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం కానుక ప్రకటించింది. పండుగ రోజున 3 ఉచిత సిలిండర్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోనే తిరిగి అకౌంట్‌లోకి డబ్బులు జమ కానుంది. అయితే మూడు సిలిండర్లు ఒకేసారి కాకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31 నుంచే సిలిండర్ల పంపకాలు మొదలుపెట్టాలని సీఎం సూచించారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ. 876 కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్‌కు రూ. 25 సబ్సిడీగా ఇస్తోంది. దీంతో ప్రస్తుతం రూ. 851 గా ధర ఉంది. ఈ పథకంతో ఏడాదికి రూ. 2700 కోట్లు, ఐదేళ్లకు రూ. 13.423 కోట్ల అదనపు భారం పడుతుంది. అయినా సరే ఇచ్చిన హామీని నెరవేర్చడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో సూపర్ సిక్స్‌లో మరో హామీ నెరవేరినట్లు అయ్యింది.


భారమైనా భరిద్దాం..
ముఖ్యంగా ఉచిత ఇసుక పంపిణీ పథకంలో ట్రాక్టర్లు, లారీలతో పాటు ఎడ్ల బండ్లలో కూడా ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో పాటు ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వంపై రూ. 264 కోట్లు భారం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అయినా సరే ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్ధామని సమావేశంలో చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ఇక పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారే తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదంతా సరిగా అమలయ్యేలా చూడాలని మంత్రులు, జిల్లా ఇంఛార్జీ మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ జిల్లాల్లో ఇసుక లేకుంటే మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణను చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించింది.

భూ కేటాయింపులు రద్దు
పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన విశాఖ శారదాపీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల అత్యంత విలువైన భూములను వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైజాగ్‌లోని భీమిలి పట్టణాన్ని ఆనుకుని కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్ర తీరానికి దగ్గరలో కోట్ల రూపాయిలు విలువ చేసే ఎకరం భూమిని కేవలం లక్షకే వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. అప్పట్లోనే ఈ కేటాయింపులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే అక్రమ భూ కేటాయింపులపై సమీక్షలో ఈ విషయం గుర్తించింది. బుధవారం కేబినెట్‌ సమావేశంలో 15 ఎకరాల భూమికి సంబంధించిన జీవోను రద్దు చేసింది.

Also Read: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ? వైసీపీ.. టీడీపీ.. బిగ్ బ్రేకింగ్ సీక్రెట్ ఇదేనా ?

పరుగులు తీయ్!
కీలక నిర్ణయాలకు ఆమోదం లభించాక సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ సాగింది. ఈ సందర్భంగా మంత్రులతో సీఎం సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రులంతా ప్రో యాక్టివ్‌గా పనిచేయాలని సూచించారు. ఇప్పుడున్న స్పీడ్ సరిపోవట్లేదని మరింత పెంచి, సమర్థవంతంగా పనిచేయాలని కాసేపు క్లాస్ తీసుకున్నారు. ఇకపై ప్రతిరోజూ ముఖ్యమేనంటూ మంత్రులతో చంద్రబాబు అన్నారు. అంతేకాదు మంత్రులు కూడా తనతో సమానంగా పని చేసేలా ఉండాలని చెప్పారు. కొందరు మంత్రులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఇలాగే ఉంటే కష్టమేనని సీరియస్‌గానే మంత్రులను చంద్రబాబు హెచ్చరించారు.

Related News

Bomb Threat: తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు

TDP vs YCP: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా.. రిప్లై కూడా అదిరింది!

Tirumala Darshan Update Today: తిరుమలలో ఈ ఒక్క తప్పు చేయవద్దు సుమా.. ప్రస్తుతం దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Diarrhoea Cases Palnadu: డయేరియా మరణాలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన మంత్రులు.. వైద్యశాఖ అప్రమత్తం

Jagan vs Sharmila: తారాస్థాయికి అన్నా, చెల్లి ఆస్తి వివాదం.. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం

Chandrababu on Jagan: ఛీ.. ఛీ ఇలాంటి వారు రాజకీయాల్లోనా.. తల్లి, చెల్లిపై కేసులా.. ఒక్క నిమిషం చాలు నాకు.. జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు

Chandrababu – Modi: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతికి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ మంజూరు

Big Stories

×