EPAPER

AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. డీఎస్సీ నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్..

AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. డీఎస్సీ నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్..
Andhra politics news

AP Cabinet Meeting(Andhra politics news):

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లో జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 40 అంశాలపై చర్చించింది. ఫిబ్రవరిలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలకు పచ్చజెండా ఊపింది.


ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధుల విడుదల చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరిలోనే వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేస్తారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధుల విడుదలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలను ఆమోదించింది.


ప్రతి గ్రామ పంచాయతీకి సెక్రటరీ ఉండాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. ఎస్‌ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లుకు పెంచాలని నిర్ణయించింది. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్‌ పోస్టు ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ లో చర్చించారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి కొత్త మేనిఫెస్టో అంశంపైనా చర్చ జరిగిందని సమాచారం. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది.

.

.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×