EPAPER

AP Budget 2024: ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ.2 లక్షల 86 వేల కోట్లు.. ద్రవ్యలోటు రూ.55 వేల కోట్లు..

AP Budget 2024: ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ.2 లక్షల 86 వేల కోట్లు.. ద్రవ్యలోటు రూ.55 వేల కోట్లు..

AP Assembly Budget Session 2024(AP news live): ఏపీ అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఏపీ అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. మహాత్మగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత్ర గ్రంధంగా భావించారని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నామని తెలిపారు.


రూ.2 లక్షల 86 వేల 389 కోట్లతో వార్షిక బడ్జెట్‌
రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 30 వేల 110 కోట్లు
మూలధన వ్యయం రూ.30 వేల 530 కోట్లు 
రెవెన్యూ లోటు రూ.24 వేల 758 కోట్లు. 
ద్రవ్యలోటు రూ.55 వేల 817 కోట్లు 

GSDPలో రెవెన్యూలోటు 1. 56 శాతం
GSDPలో ద్రవ్యలోటు 3.51 శాతం


ఈ అంశాల ఆధారం బడ్జెట్ రూపకల్పన..
7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చేశామని బుగ్గన తెలిపారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామన్నారు.

గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చేసిన ఖర్ఛులను ఆర్థిక మంత్రి వివరించారు. ఈ పథకాల అమలుతో సాధించిన ప్రగతిని వెల్లడించారు. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని చెప్పారు.

సుపరిపాలన
“పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. 2. 6 లక్షల మంది వాలంటీర్లను నియమించాం. రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78 కి పెంచాం. జిల్లాల సంఖ్య 13 నుంచి 26 కు పెంచాం. భద్రత , మౌళిక సదుపాయాలను కల్పించాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమల్లోకి తీసుకొచ్చాం” అని బుగ్గన సభలో వివరించారు.

విద్యకు వెలుగు..
“ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమల్లోకి తీసుకొచ్చాం. రూ.3,367 కోట్లతో జగనన్న విద్యాకానుక అమలు చేస్తున్నాం. 47 లక్ష మంది విద్యార్థులకు విద్యాకానుక ఇచ్చాం.జగన్నన గోరుముద్ద పథకం కోసం రూ.1910 కోట్లు ఖర్చు చేశాం. 9,52,925 ట్యాబ్స్‌ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశాం. విద్యార్థుల శిక్షణ కోసం 201 పాఠశాలల్లో వర్చువల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేశాం. అమ్మఒడి ద్వారా 43.61లక్షల మహిళలకు లబ్ధి చేకూర్చాం.
అమ్మఒడి పథకానికి రూ.26,067కోట్లు ఖర్చు చేశాం.

రూ.11,901 కోట్లతో జగనన్న విద్యాదీవెన పథకానికి ఖర్చు చేశాం. విదేశీ విద్యాదీవెన కింద 1,858 మందికి లబ్ధి చేకూర్చాం. రూ.4,267 కోట్లు జగనన్న వసతీ దీవెన ఖర్చు చేశాం. 20.37 శాతం నుంచి 6.62 శాతానికి డ్రాప్‌ అవుట్‌ తగ్గించాం. ” అని బుగ్గన వివరించారు.

వైద్య భరోసా..
వైద్య రంగం అభివృద్ధికి చేపట్టిన చర్యలను బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి తన బడ్జెట్ స్పీచ్ లో వివరించారు. “బోధనా ఆసుపత్రుల కోసం 16,852 కోట్లు ఖర్చు చేశాం. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధం పెట్టాం. ఫ్యామిలీ డాక్టర్‌ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టాం. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం. ఆరోగ్యశ్రీ ద్వారా 3,257 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నాం.

కిడ్నీ రోగులకు కార్పొరేట్‌ ప్రమాణాలతో ఉచిత వైద్యం అందిస్తున్నాం. పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు ఏర్పాటు చేశాం. కోటీ 67 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్భంది నియమించాం.” అని బుగ్గన తెలిపారు.

సాగుకు దన్ను..
“వైఎస్ఆర్ చేయూత పథకానికి రూ.14,129 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న పాలవెల్లువ కింద రూ.2, 697 కోట్లు ఖర్చు చేశాం. రైతుభరోసా-పీఎం కిసాన్‌ పథకం ద్వారా 53.53 లక్షలు రైతులకు ఆ రూ.33,300 కోట్లు ఆర్థికసాయం. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు రూ.13, 500 ఆర్థికసాయం చేస్తున్నాం. చేయూత పథకం ద్వారా రూ.14,129 కోట్లు లబ్ధిదారులకు అందించాం.


ఉచిత పంటల బీమా కింద రూ.3, 411 కోట్లు అందించాం. సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ. 1,835 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకే నేరుగా సేవలు అందిస్తున్నాయి. వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. వ్యవసాయ రంగం విద్యుత్‌ కోసం రూ.37,374 కోట్ల సబ్సిడీ ఇచ్చాం. రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1,277 కోట్లు అందించాం.” ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.

“ఉద్యానవన రంగంలో వివిధ పథకాల ద్వారా రూ.4,363 కోట్లు అందించాం. 2,356 మంది ఉద్యానవన సహాయకులు నియమించాం. మత్య్సకార భరోసా పథకం ద్వారా 2 లక్షల 43 వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాం. చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం 4 వేల నుంచి 10 వేలకు పెంచాం. మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మిస్తున్నాం.ఆక్వాకల్చర్‌ కిందకి 12 వేల హెక్టార్ల విస్తీర్ణం తీసుకొచ్చాం. 16 లక్షల 5వేల మందికి జీవనోపాధి కల్పించాం. ” అని బుగ్గన వివరించారు.

పేదల ప్రభుత్వం..
“5 ఏళ్లలో 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేశాం. వివిధ పథకాల లబ్ధిదారులకు 2.53 లక్షల కోట్ల నగదు బదిలీ చేశాం. తలసరి ఆదాయంలో ఏపీకి తొమ్మిదో స్థానంలో ఉంది. పింఛన్ ను రూ. 3 వేలకు పెంచాం. 66.35 లక్షల మందికి పెన్షన్‌ పంపిణీ చేస్తున్నాం. పింఛన్ల కోసం ఐదేళ్లలో 84,731 కోట్లు ఖర్చు చేశాం. 9,260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్‌ పంపిస్తున్నాం.
కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద రూ.350 కోట్లు పంపిణీ చేశాం.

ఈబీసీ నేస్తం కింద రూ.1,257 కోట్లు,కాపునేస్తం కింద రూ.39,247 కోట్లు, నేతన్ననేస్తం కింద రూ.983 కోట్లు, జగనన్న తోడు కింద రూ.3,374 కోట్లు, జగనన్న చేదోడు కింద రూ.1268 కోట్లు, వాహనమిత్ర ద్వారా రూ.1305 కోట్లు అందించాం. 56 కొత్త బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం రూ.71,170 కోట్లు ఖర్చుచేశాం.” అని బుగ్గన చెప్పారు.

పారిశ్రామిక ప్రగతి..
“ఏపీ పారిశ్రామిక పాలసీ 2019-27ను తీసుకొచ్చాం.రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో పోర్టుల నిర్మాణం చేపట్టాం. పోర్టుల నిర్మాణం ద్వారా 75 వేల మందికి ఉపాధి కలుగుతుంది. రూ.3,800 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. 55 వేల కిలోమీటర్ల ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసి ఫైబర్‌ గ్రిడ్‌తో ప్రతీ గ్రామాన్ని అనుసంధానించాం.
అవుకు రెండో టన్నెల్‌ పూర్తి చేశాం. అవుకులో 1,079కోట్లతో మూడో టన్నెల్‌ నిర్మాణం చేస్తాం. 9 త్రాగునీటి పథకాలకు రూ.10,137 కోట్లు మంజూరు చేశాం.
సుజలధార ప్రాజెక్టు ద్వారా ఉద్ధానం ప్రాంత ప్రజలకు ఎంతో మేలు. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం

Tags

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×