EPAPER

AP Assembly Elections Winning Candidates List 2024 : సైకిల్ జోరు.. వైసీపీ బేజారు.. గెలిచిన అభ్యర్థుల లిస్ట్ ఇదే

AP Assembly Elections Winning Candidates List 2024 : సైకిల్ జోరు.. వైసీపీ బేజారు.. గెలిచిన అభ్యర్థుల లిస్ట్ ఇదే

AP Assembly Elections Winning Candidates List 2024 : 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నుంచి లీడింగ్ లో ఉన్న ఆయన.. 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే సరికి 63,056 ఓట్ల మెజార్టీ సాధించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 1 లక్ష 29 వేల 60 ఓట్లు రాగా.. చెల్లుబోయిన గోపాలకృష్ణకు 64,970 ఓట్లు వచ్చాయి. వరుసగా ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. భారీ మెజార్టీతో గెలిచిన గోరంట్లకు టీడీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.


  • గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు వైసీపీ అభ్యర్థిపై 37131 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
  • పి.గన్నవరంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ సమీప వైసీపీ అభ్యర్థిపై 33367 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
  • గోపాలపురంలో టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు వైసీపీ అభ్యర్థి, మంత్రి తానేటి వనితపై 26784 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
  • గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము.. వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై 52 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు
  • గంగాధర నెల్లూరులో టీడీపీ అభ్యర్థి థామస్ వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మిపై 26,011 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు.
  • గాజువాకలో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్‌పై టీడీపీ అభ్యర్థి పళ్ల శ్రీనివాస్ రావు 88,817 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
  • గజపతినగరంలో వైసీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్యపై టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ 25,301 ఓట్ల మెజార్టీతో గెలుపు.
  • ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్థి ఈశ్వర్ రావు గెలుపు. వైసీపీ అభ్యర్థి కిరణ్ కుమార్‌పై 28,247 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
  • డోన్‌లో వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి జయసూర్యప్రకాశ్ రెడ్డి 6,049 ఓట్లతో గెలుపొందారు.
  • ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ విజయం. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై 3,734 ఓట్లతో గెలుపొందారు.
  • దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గెలుపు. వైసీపీ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరిపై 26,266 ఓట్ల మెజార్టీతో విజయం.
  • చోడవరంలో టీడీపీ అభ్యర్థి కె. సూర్య నాగ రాజు గెలుపు. వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీపై 41,165 ఓట్ల మెజార్టీతో విజయం.
  • చిత్తూరులో వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డిపై టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ 14,604 ఓట్ల మెజార్టీతో గెలుపు.
  • చిలకలూరిపేటలో వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడుపై టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు 32,795 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
  • బొబ్బిలిలో వైసీపీ అభ్యర్థి వెంటక చిన అప్పలనాయుడు ఓటమి. టీడీపీ అభ్యర్థి ఆర్వీఎస్ కేకే రంగారావు 42,621 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • బాపట్లలో టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ గెలుపు. వైసీపీ అభ్యర్థి కోనా రఘుపతిపై 27,768 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • బనగానిపల్లెలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి 24,874 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • అనకాపల్లిలో వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్‌పై జనసేన పార్టీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ 60,162 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
  • అమలాపురంలో టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు గెలుపు. వైసీపీ అభ్యర్థి పినెపె విశ్వరూప్‌పై 37,882 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • ఆముదాలవలసలో వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారం ఓటమి. టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ 33,183 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
  • గుంటూరు ఈస్ట్‌లో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్ విజయం. వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమాపై 31,962 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • అనంతపురం అర్బన్‌లో వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డిపై టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ 23,023 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
  • చీపురపల్లిలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఓటమి. టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు 11,971 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • వేమూరులో వైసీపీ అభ్యర్థి అశోక్ బాబు వరికూటిపై టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు 21,516 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజాగోపాల్ గెలుపు. వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభానుపై 15,977 ఓట్ల మెజార్టీతో విజయం.
  • నూజివీడులో వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 12,221 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • తెనాలిలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 48,112 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
  • మచిలీపట్నంలో వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిపై టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర 48,700 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • పాయకారావుపేటలో వంగలపూడి అనిత వైసీపీ అభ్యర్థి కంబల జోగులుపై 43,061 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
  • బద్వేల్‌లో గెలిచిన వైసీపీ. బీజేపీ అభ్యర్థి బొజ్జ రోశన్నపై 20 వేల ఓట్ల మెజార్టీతో దాసరి సుధమ్మ విజయం.
  • సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఓటమి. టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 25,950 ఓట్ల మెజార్టీతో విజయం.
  • సంతనూతలపాడులో వైసీపీ అభ్యర్థి మేరుగు నాగార్జునపై టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయ్ కుమార్ 30,385 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
  • సింగనమలలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై టీడీపీ అభ్యర్థి శ్రావణి 8,159 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • కొత్తపేటలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గారెడ్డిపై 57,580 ఓట్ల మెజార్టీతో విజయం.
  • మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వై.బాలనాగిరెడ్డి టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డిపై 12,843 ఓట్ల మెజార్టీతో గెలుపు.
  • పాడేరులో వైసీపీ అభ్యర్థి మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గిడ్డి ఈశ్వరిపై విజయం సాధించారు.
  • గూడూరులో టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ వైసీపీ అభ్యర్థి మెరిగ మురళీధర్ పై 19,015 ఓట్ల మెజార్టీతో విజయకేతనం
  • మడకశిరలో వైసీపీ అభ్యర్థి ఇరలక్కప్పపై 25 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు విజయం
  • వైఎస్ జగన్ గెలుపుతో వైసీపీ ఖాతా తెరిచింది. పులివెందులలో బీటెక్ రవిపై 61,176 ఓట్ల మెజార్టీతో వైఎస్ జగన్ విజయం. 2019 ఎన్నికలతో పోలిస్తే తగ్గిన 28 వేల ఓట్ల మెజార్టీ.
  • సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్ పై 15,994 ఓట్ల మెజార్టీతో భారీ విజయం
  • హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విజయం. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై 31,602 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • సాలూరు(ఎస్టీ)లో వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొరపై గుమ్మిడి సంధ్యారాణి 13,071 ఓట్ల మెజార్టీతో విజయం
  • కల్యాణదుర్గంలో టీడీపీ భ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యపై 37,011 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • నరసాపురంలో వైసీపీ అభ్యర్థి నాగరాజ వరప్రసాదరాజుపై 49,096 ఓట్ల మెజార్టీతో గెలిచిన జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్
  • గోపాలపురంలో వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు 26,527 ఓట్ల మెజార్టీతో విజయం
  • రాప్తాడులో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై 22,196 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత విజయం
  • మైలవరంలో టీడీపీ హవా. వైసీపీ అభ్యర్థి ఎస్ తిరుపతిరావుపై టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ 42,829 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • ఏలూరులో వైసీపీ అభ్యర్థి ఆళ్లనానిపై టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ 62,388 ఓట్ల మెజార్టీతో విజయం
  • పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్ విజయం. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు
  • భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పై టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు 66,974 ఓట్లతో భారీ విజయం
  • మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘురాం రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20,937 ఓట్లతో విజయం
  • చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజుపై సోంగా రోషన్ కుమార్ 27,766 ఓట్ల మెజార్టీతో విజయం.
  • రాజానగరంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పై 34,049 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
  • ఆచంటలో వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పై టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ 26,554 ఓట్ల మెజార్టీతో విజయం
  • ఉండిలో వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మీ నరసింహరాజుపై 56,777 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రఘురామకృష్ణరాజు
  • మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై విజయం సాధించిన నారా లోకేష్
  • కొవ్వూరులో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం
  • అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణరెడ్డిపై 20,850 ఓట్ల మెజార్టీతో గెలుపు.
  • పాలకొల్లులో వైసీపీ అభ్యర్థి గూడల శ్రీహరి గోపాలరావు పై 63,463 వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు ఘన విజయం.
  • తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఘోర పరాజయం. 48 వేల మెజార్టీతో అరుమిల్లి రాధాకృష్ణ విజయం
  • 58 వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ పై ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనవిజయం
  • రాజమండ్రి అర్బన్ లోనూ టీడీపీ గెలుపు జెండా.

 


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×