EPAPER
Kirrak Couples Episode 1

AP Anganwadi Protest: సాయంత్రంలోగా విధుల్లోకి అంగన్వాడీలు? రాకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది?

AP Anganwadi Protest: సాయంత్రంలోగా విధుల్లోకి అంగన్వాడీలు? రాకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది?
breaking news in andhra pradesh

AP Anganwadi Protest(Breaking news in Andhra Pradesh):

ఏపీలో అంగన్వాడీలపై తీవ్ర చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంగన్వాడీలను కూడా అత్యవసర సేవల పరిధిలోకి తీసుకొచ్చి.. వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు జనవరి 8 డెడ్ లైన్ విధించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తాము ఎలాంటి బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు. మరి సాయంత్రంలోగా అంగన్వాడీలు విధుల్లో చేరకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది ? అంటే.. 9వ తేదీ నుంచి సీడీపీఓల ద్వారా అంగన్వాడీలకు వారి పేరుమీద నోటీసులు జారీ చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తదుపరి చర్యలపై న్యాయసలహాలు కూడా తీసుకున్నట్లు సమాచారం.


ఈ విషయాలు తెలిసిన అంగన్వాడీలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అక్కలు, చెల్లెళ్లంటూ.. ఎన్నికల ముందు వాగ్ధానాలు చేసి.. ఇప్పుడు వాటిని అమలు చేయాలని అడుగుతుంటే ఎస్మా ప్రయోగించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల సేవలు ఎంత అత్యవసరమో.. తమకు తమ బతుకు అంతే అత్యవసరమన్నారు.

మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ.. రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెలపై స్పందించారు. అంగన్వాడీ, మున్సిపల్ కార్మికులు, ఉపాధ్యాయులు.. ఇలా ఏ రంగానికి చెందిన ఉద్యోగులు సమ్మె చేసినా ఒక్కటేనన్నారు. అంగన్వాడీలు 11 రకాల సమస్యలను తీర్చాలని కోరగా.. వాటిలో 10 నెరవేరుస్తామని చెప్పామని, జీతాలు పెంచాలన్న ఒక్క సమస్యను ఇప్పుడు పరిష్కరించలేమన్నారు. ఎన్నికల ముందు జీతాలను పెంచడం సరికాదని అధిష్టానం భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.


Related News

Jagan clarification: మళ్లీ బెంగుళూరుకి జగన్.. పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

Big Stories

×