EPAPER

Lokesh Red Book: రెడ్ బుక్ అంశం.. నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు..

Lokesh Red Book: రెడ్ బుక్ అంశం.. నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు..

Lokesh Red Book: టీడీపీ యువనేత నారా లోకేష్ కు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. రెడ్‌బుక్ పేరుతో నారా లోకేశ్ అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ లో లోకేష్ కు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఐడీ పోలీసులు నారా లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపారు. లోకేష్ కూడా తనకు నోటీసులు అందినట్టు రిప్లై ఇచ్చారు.


కాగా ఈ పిటిషన్ పై గురువారం నాడు ఏసీబీ కోర్టులో.. సీఐడీ వాదనలు వినిపించింది. గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం.. ఆ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్‌ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో వ్యాఖ్యానించినట్లు సీఐడి కోర్టుకు వివరించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 9కి కోర్టు వాయిదా వేసింది.

ఈ క్రమంలోనే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న ఆయన్ని అరెస్ట్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని.. సీఐడీ.. న్యాయస్థానాన్ని కోరింది. దీంతో ఈ అంశంలో లోకేశ్‌కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. లోకేష్ ని అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని.. ఆ నోటీసుల్లో వెల్లడించింది.


అయితే ఏసీబీ న్యాయస్థానం ఆదేశాల మేరకు లోకేశ్‌కు నోటీసులు అందించేందుకు.. సీఐడీ అధికారులు తాడేపల్లి కృష్ణా కరకట్ట మీద ఉన్న ఆయన నివాసానికి గురువారం సాయంత్రం వెళ్లారు. కానీ ఆ సమయంలో లోకేశ్‌ అందుబాటులో లేకపోవడంతో సీఐడీ అధికారులు నోటీసులు అందించకుండానే వెనుదిరిగారు. కోర్టు అనుమతితో ఈరోజు లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపారు.

Related News

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Big Stories

×