EPAPER

Tirumala latest news: బోనులో చిక్కిన నాలుగో చిరుత.. ఇక అలిపిరి నడకమార్గం సేఫేనా..?

Tirumala latest news: బోనులో చిక్కిన నాలుగో చిరుత.. ఇక అలిపిరి నడకమార్గం సేఫేనా..?
Another cheetah caught in tirumala

Another cheetah caught in tirumala(Latest telugu news in AP) :

తిరుమలలో మరో చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుతను ట్రాప్‌ చేశారు. దీంతో ఇప్పటి వరకు 4 చిరుతలు చిక్కాయి. తొలుత జూన్ 24న ఓ చిరుతను బంధించారు. ఆ తర్వాత ఆగస్టు 14, 17, 28 తేదీల్లో మిగిలిన మూడు చిరుతలను పట్టుకున్నారు.


నాలుగో చిరుతను బంధించేందుకు వారం రోజులుగా అటవీశాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిరుత అనేకసార్లు బోను వరకు వచ్చి వెనక్కివెళ్లిపోయింది. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. ఆదివారం రాత్రి మరోసారి బోను వద్ద చిరుత వచ్చింది. లోపలకి వెళ్లి చిక్కుకుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

నాలుగో చిరుత కూడా చిక్కడంతో ఆపరేషన్‌ చిరుత విజయవంతమైందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 2 నెలల కిందట కౌశిక్ అనే బాలుడిపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుత బోనులో చిక్కింది. ఇకపై అలిపిరి నడకమార్గంలో భక్తులు చిరుత భయం లేకుండా వెళ్లొచ్చని అధికారులు చెబుతున్నారు. నాలుగు చిరుతలను బంధించడంతో ఇక నడకమార్గం సురక్షితమేనా? భక్తులు ఏలాంటి భయాలు లేకుండా వెళ్లొచ్చా..?


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×