EPAPER

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Tirupati laddu: ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల తిరుపతి అపవిత్రమైందని అన్నారు. జంతువుల కొవ్వుతో తయారైన నూనెలతో లడ్డూ ప్రసాదాలను తయారు చేశారని అన్నారు. అయితే, ఆయన ఆ వ్యాఖ్యలు చేయగానే.. వైసీపీ నేతలంతా ఉలిక్కిపడ్డారు. టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. సీఎం వ్యాఖ్యలను వెంటనే ఖండించారు. సవాళ్లు కూడా విసిరారు. ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు చట్టపరంగా ముందుకెళ్తామని కూడా హెచ్చరించారు. కట్ చేస్తే.. సాయంత్రానికి సీన్ మారిపోయింది. మొత్తం ఆధారాలతో సహా గుట్టురట్టయ్యింది.


మరీ ఇంత దారుణమా?

చంద్రబాబు ఆరోపణల తర్వాత వైసీపీ నేతలు.. అబ్బే అలాంటిది ఏమీ లేదే అనే బుకాయించే ప్రయత్నం చేశారు. నేషనల్ డైరీ బోర్డ్ రిపోర్ట్ బయటకు రాగానే నాలుక కరుచుకున్నారు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో బీఫ్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ (జంతువుల ఎముకల నుంచి తయారు చేస్తారు), ఫిష్ ఆయిల్ ఉన్నాయని ఆ రిపోర్ట్ వెల్లడించింది. ఇదే ఇప్పుడు వైసీపీని చిక్కుల్లో పడేసింది. సోషల్ మీడియాలో కూడా ఆ రిపోర్ట్ వైరల్‌గా మారింది. జాతీయ మీడియా సైతం వైసీపీ అరాచకాన్ని కడిగి పడేస్తోంది. ఇప్పుడు అంతటా ఇదే చర్చ. మరీ ఇంత దిగజారుతారా అంటూ జనం తిట్టిపోస్తున్నారు. ఆ పాపం వల్ల మీరు అధికారం కోల్పోయారని విమర్శిస్తున్నారు. ఈ వివాదం వల్ల వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. భవిష్యత్తులో ఒక్క స్థానం కూడా గెలవని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే వైసీపీ అస్సామే అని అంటున్నారు. ఎందుకంటే.. ఏపీ ప్రజలకు తిరుమల తిరుపతి దేవస్థానమంటే ఒక ఎమోషన్. అలాంటి దేవస్థానంలో ఇలా పెద్ద అపచారానికి పాల్పడటాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు.


పవిత్రమైన లడ్డూకు నాసిరకం నెయ్యి.. ఎంత దారుణం

టీటీడీ ఉపయోగిస్తున్న నెయ్యిపై సందేహాలు రావడంతో అధికారులు జులై నెలలో National Dairy Development Board’s (NDDB) Coopకు చెందిన ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించారు. అక్కడ లడ్డూ క్వాలిటీని పరిశీలించారు. ఇటీవలే ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి అందింది. అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాతే చంద్రబాబు నాయుడు.. వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అయితే, నివేదికలోని పూర్తి వివరాలు మాత్రం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ లోపే వైసీపీ నేతలు సవాళ్లకు సిద్ధమయ్యారు. తాజా రిపోర్టుతో ఏం చెయ్యాలా అనుకుంటూ సందిగ్ధంలో పడిపోయారు.

లడ్డూలో వాడిన నూనెలో ఏం ఉన్నాయి?

శ్రీవారి ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే వాడతారు. అయితే ఆ ఆవు నెయ్యి చాలా ఖరీదైనది. కిలో నెయ్యి సుమారు రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. అయితే, టెండర్లలో.. నాణ్యత విషయాన్ని పక్కన పెట్టి.. తక్కువ ధరకే నెయ్యిని అందిస్తామని ముందుకొచ్చిన సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి వాళ్లు ఇచ్చే నెయ్యినే.. పూర్తిస్థాయిలో పరిశీలించకుండా లడ్డూ ప్రసాదాల తయారీలో వాడేస్తున్నారు. తాజా రిపోర్టుల ప్రకారం.. ఆ నెయ్యిలో బీఫ్ టాలో పామాయిల్, పంది కొవ్వు, చేప నూనెలు కలిశాయి. నెయ్యి నాణ్యతను ప్రమాణమైన ఎస్ వాల్యూ 104.32 ఉండాలి. కానీ, ఆ నెయ్యిలో ఎస్ వాల్యూ కేవలం 95.68 మాత్రమే ఉంది. జంతువుల కొవ్వు కలవడం వల్లే వాల్యూ తక్కువగా చూపింది.

Also Read: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

పవిత్రమైన నెయ్యిని కాదని.. ఢిల్లీ సంస్థతో ఒప్పందం

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉపయోగించే నెయ్యిని ఇదివరకు.. కర్ణాటకాకు చెందిన నందిని కో ఆపరేటివ్ డెయిరీ సంస్థ సరఫరా చేసేది. దాదాపు 50 ఏళ్ల నుంచి ఆ సంస్థ ద్వారానే స్వచ్ఛమైన నెయ్యి తిరుమలకు అందేది. అయితే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త టెండర్లను పిలిచారు. ఎవరైతే తక్కువ మొత్తానికి కోట్ చేశారో.. వారికే ఆ బాధ్యతలు కట్టబెట్టారు. అల్ఫా అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీనిపై కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) అధ్యకుడు భీమా నాయక్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘పాల ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల నెయ్యి సప్లయ్ రేటును పెంచాల్సి వచ్చింది. మాతో ఒప్పందం రద్దు చేసుకోవడంపై ప్రశ్నించగా.. మా కంటే తక్కువ రేటుగా నెయ్యిని అందిస్తున్న సంస్థను ఎంపిక చేసుకున్నామని సమాధానం ఇచ్చారు. ఇక్కడ మేటర్ రేటు కాదు.. క్వాలిటీ. ఒక సంస్థ అతి తక్కువ ధరకే నెయ్యి అందిస్తుందంటే.. ఆ సంస్థ క్వాలిటీని పట్టించుకోదని అర్థం’’ అని పేర్కొన్నారు.

Related News

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×