EPAPER
Kirrak Couples Episode 1

AP Protests | ఏపీలో నిరసనల హోరు.. షేకవుతున్న జగన్ ప్రభుత్వం..

AP Protests | ఏపీలో ఒకరిని చూసి మరొకరు నిరసన బాట పడుతున్నారు. ఎన్నికల సమయం కావడంతో జగన్ సర్కార్ దిగి వస్తుందని అనుకుంటున్నారు. అందుకే రోడ్డెక్కుతున్నారు. ఇన్నాళ్లూ జగన్ ప్రభుత్వం నమ్ముకున్న వాలంటీర్లు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారంటున్నారు. వారిపై పని ఒత్తిడి పెరగడం ఇందుకు కారణమని చెబుతున్నారు. అటు ఆశా కార్యకర్తలు కూడా విడతల వారీగా నిరసనలు ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

AP Protests | ఏపీలో నిరసనల హోరు.. షేకవుతున్న జగన్ ప్రభుత్వం..

AP Protests | ఏపీలో ఒకరిని చూసి మరొకరు నిరసన బాట పడుతున్నారు. ఎన్నికల సమయం కావడంతో జగన్ సర్కార్ దిగి వస్తుందని అనుకుంటున్నారు. అందుకే రోడ్డెక్కుతున్నారు. ఇన్నాళ్లూ జగన్ ప్రభుత్వం నమ్ముకున్న వాలంటీర్లు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారంటున్నారు. వారిపై పని ఒత్తిడి పెరగడం ఇందుకు కారణమని చెబుతున్నారు. అటు ఆశా కార్యకర్తలు కూడా విడతల వారీగా నిరసనలు ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.


ఆశా వర్కర్లు నిరసనల స్పీడ్ పెంచారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చి ఆందోళనలకు దిగిన వారు.. విడతల వారీగా నిరసనలను ఉధృతం చేయాలని డిసైడ్ అయ్యారు. కనీస వేతనాలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులతో పాటు ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. ఇందుకోసం ఈనెల 14, 15 తేదీల్లో జిల్లాల్లోని అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలకు పిలుపునిచ్చారు. మండలాల్లో ఉండే ఎంఆర్వోలకు వినతిపత్రాలు ఇచ్చారు.

వైసీపీ అధికారంలోకి వస్తే నెలకు 10 వేలు గౌరవ వేతనాలు ఇస్తామని ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ హమీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ ఆ హామీ అమలు కాలేదు. ప్రోత్సాహకాలు, కొంత గౌరవేతనం కలుపుకున్నా చాలా మంది ఆశా వర్కర్లకు పది వేలు కూడా జీతం రావడం లేదు. అందుకే ఆశా కనీసం వేతనం డిమాండ్‌ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆశా వర్కర్లకు పనిభారం పెరిగిపోయిందంటున్నారు. ఎన్‌హెచ్‌ఎం రూల్స్ ప్రకారం వారి విధులను వారితో చేయించడం లేదు. ఆశా వర్కర్లను అన్ని రకాల కార్యక్రమాలకు ప్రభుత్వం వాడుతోంది. అలాగే సర్కార్ అందించే పథకాలు ఆశాలకు ఏవీ వర్తించడం లేదంటున్నారు. పని భారం, చాలీచాలని గౌరవ వేతనాలతో ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది.


శని, ఆదివారం అన్న తేడా లేకుండా ఫ్యామిలీ డాక్టర్‌, జగనన్న ఆరోగ్య సురక్ష, ఫీవర్‌ సర్వేలు అంటూ పని ఒత్తిడి పెంచుతున్నారంటున్నారు. ఇంత చేసినా రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆశా వర్కర్లు కూడా విలేజ్‌ క్లినిక్స్‌లో ఉదయం, సాయంత్రం రెండుసార్లు సంతకాలు చేయాలన్న నిబంధన పెట్టారు. ఒకవైపు గ్రామాల్లో పర్యటించడం, ఇంకోవైపు విలేజ్‌ క్లినిక్స్‌లో సంతకాలు, సర్వే పేరుతో వారితో పని భారం పెంచుతున్నారంటున్నారు. ఇంత కష్టపడినా రిటైర్మెంట్‌ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఏమైనా బెనిఫిట్స్‌ వస్తాయా అంటే అది లేని పరిస్థితి. సర్వీస్ చేసి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సిందే. అందుకే ఆశా వర్కర్లు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేయబోతున్నారు.

జగన్‌ నోటివెంట పదేపదే ప్రశంసలు అందుకుంటున్న వలంటీర్లు కూడా వేతనాల పెంపు కోరుతూ సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 29 నుంచి సమ్మెలోకి వెళ్లి… పెన్షన్ల పంపిణీలో పాలుపంచుకోవద్దనుకుంటున్నట్లు చెబుతున్నారు. వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో వీరంతా ఆందోళనలకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం పని చేయిస్తుందే తప్ప తమ సంక్షేమ పట్టించుకోవడం లేదని చాలామంది వలంటీర్లు వాపోతున్నట్లు చెబుతున్నారు. నవరత్నాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే తమకే సంక్షేమం లేకుండా పోయిందని వాపోతున్నారట.

ఏటా ఉగాది పురస్కారాలు అందిస్తున్న సర్కారు, ఈ దఫా అవి కూడా వాయిదా వేసి సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నారు. గ్రామాల్లోను, వార్డుల్లోను తమ సొంత పనులు చేసుకుంటూ పార్ట్‌టైం జాబ్‌ మాదిరి చేస్తామనుకుంటే, ఈ పని పెరిగి పుల్‌టైం జాబ్‌ అయిందని వలంటీర్లు వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటున్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం 5 వేలు ఇస్తున్నా.. దాన్ని 18 వేలకు పెంచాలంటున్నారు. ఎన్నికలకు ముందుగా డిమాండ్ చేస్తేనే పని అవుతుందని, ఆ తర్వాత పట్టించుకునే పరిస్థితి ఉండదని చాలా మంది అనుకుంటున్నారు.

AP Volunteers protest, Anganwadi workers protest, Jagan Govt, Asha workers protest, Honororium,

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×