EPAPER

Andhra Pradesh: ఏపీలో కూటమి గెలుపు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..?

Andhra Pradesh: ఏపీలో కూటమి గెలుపు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..?

Andhra Pradesh Election Results: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయాన్ని సాధించింది. ఏపీలో మొత్తం 175 స్థానాలు ఉండగా అందులో ఏకంగా 164 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఇందులో టీడీపీకి 135 సీట్లు వచ్చాయి. కాగా, జనసేనకు 21 సీట్లు వచ్చాయి. అటు బీజేపీకి 8 సీట్లు వచ్చాయి.


కాగా, గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైఎస్సార్ సీపీ ఈసారికి మాత్రం పూర్తిగా చతికిలపడిపోయింది. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచింది. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వైఎస్సార్ సీపీ కేబినెట్ లోని మంత్రులంతా ఓటమి చెందారు. పులివెందులలో ఈసారి జగన్ కు గతంలో కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేఆర్ జే భరత్ పై 47 వేలకు పైగా ఓట్లతో బాబు వియజం సాధించారు. ఇటు పవన కల్యాణ్ కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు.


నారా లోకేశ్ కూడా ఈసారి భారీ మెజారిటీతో గెలిచారు. మంగళగిరి స్థానం నుంచి పోటీ చేసిన ఆయన 39 ఏళ్ల తరువాత అక్కడ పసుపు జెండాను ఎగురవేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి లావణ్యపై 91 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అఖండ విజయం సాధించడంతో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. భారీగా చంద్రబాబు ఇంటికి, టీడీపీ ఆఫీస్ కు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇటు పవన్ కల్యాణ్ కూడా పార్టీ ఆఫీసుకు చేరుకుని కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గెలుపుతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. జగన్ తో తనకు వ్యక్తిగత కక్ష లేదన్నార. డబ్బు, పేరు కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, సగటు మనిషి కష్టం చూసి, వారికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చానంటూ ఆయన పేర్కొన్నారు. 2019లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడినప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందన్నారు. తాను గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటానన్నారు. తనకు విజయాన్ని అందించినటువంటి పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే, చంద్రబాబు అమరావతిలో ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారంటూ చర్చ కొనసాగుతుంది. ఈసారి ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినట్టు అవుతుంది.

Also Read: హుందాగా పవన్ స్పీచ్.. అందుకే రాజకీయాల్లోకి వచ్చా

వైఎస్సార్ సీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు ఇవే..

పులివెందుల – జగన్ మోహన్ రెడ్డి
పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మంత్రాలయం – బాలనాగిరెడ్డి
బద్వేలు – దాసరి సుధ
ఆలూరు – బూసినే విరూపాక్షి
అరకు – రేగం మత్స్యలింగం
పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వరరాజు
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
తంబళ్లపల్లి – పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
యర్రగొండపాలెం – తాటిపత్రి చంద్రశేఖర్
దర్శి – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×