EPAPER

AP Assembly Elections Results 2024 Live Updates : జగన్ ఒక్కడే.. వైసీపీ మంత్రులంతా ఓటమి.. కుప్పంలో చంద్రబాబు ఘనవిజయం

AP Assembly Elections Results 2024 Live Updates : జగన్ ఒక్కడే.. వైసీపీ మంత్రులంతా ఓటమి.. కుప్పంలో చంద్రబాబు ఘనవిజయం

AP Assembly Elections Results 2024 : ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 350 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఈసీ. వీటిలో 75 సెంటర్లను పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు కేటాయించింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వగా కూటమి అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు.


  • మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీచేసి 91500 ఓట్ల మెజార్టీతో ఘన విజయం
  • ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన నారా లోకేష్
  • గిద్దలూరు టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి 1080 ఓట్ల మెజార్టీతో విజయం
  • నగరిలో టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్.. మాజీ మంత్రి ఆర్కే రోజాపై విజయం
  • కుప్పంలో చంద్రబాబు నాయుడు ఘనవిజయం. 47 వేల పైచిలుకు ఓట్లతో గెలుపు
  • అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన 100కి 100 శాతం విజయం. 21కి 21 స్థానాల్లో గెలుపు జెండా.
  • అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ విజయం.
  • పెనమలూరులో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ పై టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ 58,596 ఓట్ల మెజార్టీతో ఘన విజయం
  • పత్తిపాడులో టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు విజయం
  • ఏపీ ఎన్నికల ఫలితాల్లో బొత్స ఫ్యామిలీకి షాక్. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ, గజపతి నగరంలో ఆయన సోదరుడు, నెల్లిమర్లలో మేనల్లుడు, విశాఖ లోక్ సభ స్థానంలో బొత్స ఝాన్సీ ఓటమిపాలు.
  • ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్ కు 34,100 మెజార్టీతో విజయం
  • కడప ఎంపీగా అవినాశ్ విజయం. 69,050 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటిపై రాళ్లదాడి..
  • ఈవీఎంల సీల్ తీయడంపై ఈసీ, సీఈఓ దృష్టికి తీసుకెళ్లిన రిటర్నింగ్ అధికారి
  • 16రౌండ్లు పూర్తయ్యేసరికి ఆధిక్యంలో వైసీపీ. కౌంటింగ్ ఆపివేయాలని టీడీపీ పట్టు. గంటన్నరగా నిలిచిన కౌంటింగ్
  • పుంగనూరులో నిలిచిన కౌంటింగ్. 4 ఈవీఎంల సీల్ తీసి ఉండటంపై టీడీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి అభ్యంతరం. ఈవీఎంల సీల్ ఎలా తీసి ఉంటుందని ప్రశ్నిస్తున్న టీడీపీ ఏజెంట్లు
  • అనంతపురం అర్బన్ లో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ 23,023 ఓట్లతో విజయం
  • కాకినాడలో జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ విజయం
  • వేమూరులో టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు వైసీపీ అభ్యర్థి వరికూటి అశోక్ బాబుపై 21,516 ఓట్లతో గెలుపు
  • కర్నూల్ లో ఇంతియాజ్ పై టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, పలమనేరులో వెంకటె గౌడపై ఎన్. అమర్నాథ్ రెడ్డి విజయం
  • జగ్గయ్యపేటలో సామినేని ఉదయభానుపై టీడీపీ అభ్యర్థి సీరం రాజగోపాల్ 15,977 ఓట్లతో గెలుపు
  • జగ్గయ్యపేట, కర్నూల్, పలమనేరు స్థానాల్లో టీడీపీ ఘనవిజయం
  • అనంతపురం జిల్లా టి.కొత్తపల్లిలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. ఆరుగురికి తీవ్రగాయాలు
  • మదనపల్లెలో టీడీపీ ఘన విజయం. 4,119 ఓట్లతో షాజహాన్ గెలుపు
  • శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ రెడ్డి 3,07,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
  • తంబళ్లపల్లెలో వైసీపీ గెలిచింది. టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిపై వైసీపీ అభ్యర్థి ద్వారకానాథరెడ్డి విజయం సాధించారు.
  • దర్శి కౌంటింగ్ సెంటర్లో ఉద్రిక్తత. టీడీపీ – వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
  • చీపురుపల్లిలో బొత్సా ఓటమి. కిమిడి కళా వెంకట్రావు 11,527 ఓట్ల తేడాతో గెలుపు
  • చంద్రబాబు, పవన్ కు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి. ఏపీని నంబర్ వన్ గా మారుస్తారని ఆశిస్తున్నానంటూ X వేదికగా ట్వీట్
  • 85 స్థానాల్లో టీడీపీ, 17 స్థానాల్లో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ విజయం
  • తెనాలిలో నాదెండ్ల మనోహర్ వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పై 48112 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
  • శృంగవరపుకోటలో టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి, నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి, విజయనగరంలో పూసపాటి అదితిగజపతి రాజు, చీపురుపల్లిలో కిమిడి కళా వెంకట్రావు, గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాస్, బొబ్బిలిలో బేబి నాయన, కురుపాంలో తొయక జగదీశ్వరి విజయకేతనం ఎగురవేశారు.
  • మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వై.బాలనాగిరెడ్డి టీడీపీ అభ్యర్థిపై 12843 ఓట్ల మెజార్టీతో గెలుపు.
  • కమలాపురంలో టీడీపీ అభ్యర్థి పుట్టా చైతన్య విజయం
  • అమలాపురంలో టీడీపీ అభ్యర్థి ఆనందరావు గెలుపు.
  • కొత్తపేటలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు 57,580 ఓట్ల మెజార్టీతో విజయం.
  • సింగనమలలో టీడీపీ అభ్యర్థి శ్రావణి వైసీపీ అభ్యర్థిపై 8,159 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • రంపచోడవరంలో టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీష నాగులపల్లి ధనలక్ష్మిపై 10,154 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
  • సంతనూతలపాడులో వైసీపీ అభ్యర్థి మేరుగు నాగార్జునపై బీఎన్ విజయ్ కుమార్ 30,385 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
  • సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఓటమి. టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 25 వేల ఓట్లతో విజయం.
  • విజయవాడ ఈస్ట్ లో గద్దె రామ్మోహన్ గెలుపు
  • పాయకారావుపేటలో వంగలపూడి అనిత వైసీపీ కంబల జోగులుపై 43061 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
  • ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాస్ పై విజయం
  • బద్వేల్ లో గెలిచిన వైసీపీ. 20 వేల ఓట్ల మెజార్టీతో సుధమ్మ విజయం
  • పలాసలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష విజయం
  • ఇచ్ఛాపురంలో బెందాళం అశోక్ గెలుపు
  • గూడూరులో టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ 19,015 ఓట్ల మెజార్టీతో విజయకేతనం
  • నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఫరూఖ్ 12 వేల ఓట్లతో ఘనవిజయం
  • తాడికొండలో టీడీపీ అభ్యర్థి శ్రావణ్ విజయం. మాజీ మంత్రి మేకతోటి సుచరితపై 40 వేల ఓట్లతో గెలుపు.
  • చంద్రబాబు నివాసంలో విజయోత్సవాలు. కేక్ కట్ చేసిన చంద్రబాబు
  • మడకశిరలో స్వల్ప మెజార్టీతో టీడీపీ అభ్యర్థి విజయం. వైసీపీ అభ్యర్థి ఇరలక్కప్పపై ఎంఎస్ రాజు 25 ఓట్ల తేడాతో గెలుపు.
  • నూజివీడులో టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి విజయం
  • రాజంపేట వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి సుబ్రహ్మణ్యంపై ఘనవిజయం
  • శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓటమి.. టీడీపీ అభ్యర్థి గోండు శంకర్ చేతిలో పరాభవం
  • ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం పై టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ విజయం
  • పులివెందులలో వైఎస్ జగన్ గెలుపు. 61,176 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి బీటెక్ రవిపై విజయం సాధించారు.
  • పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్పపై దవులూరి దొరబాబు విజయం
  • విశాఖ ఎంపీగా 2 లక్షల 84 వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ విజయం.
  • తునిలో మంత్రి దాడిశెట్టిరాజా పై యనమల కుమార్తె దివ్య విజయం
  • సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి విజయం. సమీప అభ్యర్థి మంత్రి కాకాణి గోవర్థన్ పై 15,994 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • తూర్పు గోదావరిలో జెండా పాతిన టీడీపీ
  • 51 స్థానాల్లో టీడీపీ విజయం, 86 స్థానాల్లో ఆధిక్యం
  • కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళంలో టీడీపీ క్లీన్ స్వీప్
  • మచిలీపట్నంలో పేర్ని కిట్టు ఓటమి. భారీ మెజార్టీతో గెలిచిన కొల్లు రవీంద్ర
  • బాలయ్య హ్యాట్రిక్. హిందూపురంలో 31,602 ఓట్ల మెజార్టీతో విజయం
  • సాలూరు(ఎస్టీ)లో వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొరపై 13,071 ఓట్ల మెజార్టీతో గుమ్మిడి సంధ్యారాణి విజయం
  • కల్యాణదుర్గంలో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యపై టీడీపీ భ్యర్థి అమిలినేని సురేంద్రబాబు 37,011 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • కురుపాం, పార్వతీపురం, సాలూరులో టీడీపీ విజయకేతనం
  • ఏలూరు దొరసానిపాడులో ఉద్రిక్తత. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
  • చంద్రబాబుకు బీజేపీ బంపరాఫరం. ఎన్డీయే కన్వీనర్ పదవి తీసుకోవాలని కోరిన నేతలు. 48 గంటల్లో చెబుతానన్న చంద్రన్న
  • రాప్తాడులో టీడీపీ విజయం. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై 22,196 ఓట్లతో పరిటాల సునీత విజయం
  • గంగాధర నెల్లూరులో టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ విజయం
  • డోన్ లో టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థి బుగ్గనపై 6 వేల పైచిలుకు మెజార్టీతో ఘన విజయం
  • బాపట్లలో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతిపై టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్ర కుమార్ జయకేతనం
  • గుంటూరు ఈస్ట్ లో టీడీపీ అభ్యర్థి మహ్మద్ నజీర్ విజయం.
  • ఉరవకొండలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఘన విజయం
  • ఏలూరులో వైసీపీ అభ్యర్థి ఆళ్లనానిపై టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ 61,261 ఓట్ల మెజార్టీతో విజయం
  • పిఠాపురంలో పవన్ కల్యాణ్ వంగా గీతపై 70,354 ఓట్ల మెజార్టీతో భారీ విజయం
  • నరసాపురంలో వైసీపీ అభ్యర్థి నాగరాజ వరప్రసాదరాజుపై 49,096 ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గెలుపు
  • టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై 26,527 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో టీడీపీ విజయం
  • తాడికొండలో టీడీపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ విజయం
  • మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘురాం రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20,937 ఓట్లతో గెలుపు
  • వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుట్టా చైతన్య రెడ్డి ఘన విజయం
  • వైఎస్సార్ జిల్లా కమలాపురంలో సీఎం జగన్ మేనమామ ఓటమి
  • జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి విజయం
  • మచిలీపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి 97 వేల పై చిలుకు ఓట్లతో ముందంజ
  • 56,777 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించిన రఘురామకృష్ణరాజు, 13 వేల ఓట్లు చీల్చిన శివరామరాజు
  • ఉండిలో భారీ మెజార్టీతో గెలిచిన రఘురామకృష్ణరాజు
  • ఆచంటలో పితాని సత్యనారాయణ 26,076 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విజయం సాధించారు.
  • చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్.. ఏపీలో కూటమి గెలుపుపై శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని
  • పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో పవన్ కల్యాణ్ గెలుపు
  • మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై విజయం.
  • రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాపై ఘన విజయం
  • ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం
  • ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి విజయం
  • భీమవరంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులు విజయం
  • వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై 28 వేల ఓట్ల పై చిలుకు ఓట్లతో ముప్పిడి ఘనవిజయం
  • మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆధిక్యం
  • దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ ఆధిక్యం
  • అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఆధిక్యం
  • మైదుకూరు అసెంబ్లీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యం
  • చింతలపూడిలో టీడీపీ అభ్యర్థి రోషన్ కుమార్ ఘన విజయం
  • పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ లీడ్
  • మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య వెనుకంజ
  • కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం
  • దెందులూరులో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి వెనుకంజ
  • ఏలూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ ఆధిక్యం
  • పి. గన్నవరం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి వేణుగోపాల్ వెనుకంజ
  • ఏపీలో బోణీ కొట్టిన బీజేపీ. అనపర్తిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణరెడ్డిపై 20,567 ఓట్ల మెజార్టీతో గెలిచారు
  • వైసీపీ అభ్యర్థి గూడల శ్రీహరి గోపాలరావుపై 63,463 వేల ఓట్ల మెజార్టీతో నిమ్మల రామానాయుడు గెలుపు.
  • పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్ విజయం.
  • కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్న వైసీపీ శ్రేణులు, సంబరాల్లో టీడీపీ నేతలు
  • నాలుగోసారి సీఎంగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడు
  • విశాఖ ప్యాలెస్ పై టీడీపీ జెండా. ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం
  • తణుకులో మంత్రి కారుమూరి శ్రీనివాస్ కు ఘోర పరాజయం. 43 వేల ఓట్ల మెజార్టీతో అరుమిల్లి రాధాకృష్ణ గెలుపు
  • 58 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో మార్గాని భరత్ పై ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయం
  • రాజమండ్రి అర్బన్ లోనూ టీడీపీదే విజయం. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసు భారీ మెజార్టీతో గెలిచారు
  • వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 63,056 ఓట్ల భారీ మెజార్టీతో బుచ్చయ్య విజయం
  • టీడీపీ తొలివిజయం.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపు
  • గుంటూరు జిల్లా 17 స్థానాలకు 16 స్థానాల్లో కూటమి లీడ్
  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు గాను 13 స్థానాల్లో కూటమి అభ్యర్థుల హవా
  • సంతనూతలపాడులో 11,296 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ
  • మంగళగిరిలో 15,114 ఓట్ల ఆధిక్యంలో నారా లోకేశ్
  • బొబ్బిలి, ఆళ్లగడ్డ, మంగళగిరి, జగ్గంపేట, మాచర్ల, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కర్నూల్, పాణ్యం, పీలేరు నియోజకవర్గాల్లో టీడీపీ ఆధిక్యం
  • 20 ఏళ్లలో గెలవని నియోజకవర్గాల్లోనూ టీడీపీ హవా
  • ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు గాను 11 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది.
  • ఉమ్మడి విశాఖలోనూ కూటమి అభ్యర్థులదే హవా.. 15 స్థానాలకు గాను 13 స్థానాల్లో ఆధిక్యం
  • ఘోర పరాజయం దిశగా వైసీపీ, ఇప్పటి వరకు 18 సీట్లకే పరిమితం
  • తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి 4649 ఓట్ల ఆధిక్యం
  • 22 లోక్ సభ స్థానాల్లోనూ కూటమిదే పైచేయి
  • విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ
  • పెనుగొండలో మంత్రి ఉషశ్రీ 4 వేల ఓట్ల వెనుకంజ
  • మాచర్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి 13600 లీడ్
  • ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం వెనుకంజ, 6563 ఓట్ల ఆధిక్యంతో కూన రవికుమార్
  • కుప్పంలో చంద్రబాబు 1938 ఓట్ల ఆధిక్యం
  • గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ (9180) ఆధిక్యం
  • 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన, 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు
  • టీడీపీ ఆధిక్యంతో సంబరాలు చేసుకుంటోన్న ప్రవాసాంధ్రులు
  • రాజమండ్రి పార్లమెంట్ లో 79 వేల లీడ్ లో పురందేశ్వరి
  • అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ ఆధిక్యం
  • పొన్నూరులో 7 వేల ఓట్ల ఆధిక్యంలో ధూళిపాళ్ల నరేంద్ర
  • విశాఖ వెస్ట్ లో టీడీపీ, సౌత్ లో జనసేన అభ్యర్థుల ఆధిక్యం
  • నూజివీడులో టీడీపీ అభ్యర్థి పార్థసారథి (859) లీడ్
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19 స్థానాల్లో క్లీన్ స్వీప్ దిశగా కూటమి అభ్యర్థులు
  • నరసాపురంలో 8045 ఓట్ల లీడింగ్ లో టీడీపీ అభ్యర్థి
  • మచిలీపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి లీడింగ్
  • కల్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు లీడ్
  • హిందూపురంలో 7 వేల ఓట్ల మెజార్టీతో ఉన్న నందమూరి బాలకృష్ణ
  • తాడిపత్రిలో మూడోరౌండ్ పూర్తయ్యేసరికి 321 ఓట్ల లీడ్ లో అస్మిత్ రెడ్డి
  • చంద్రబాబు నాయుడి ఇంటివద్ద గెలుపు కోలాహలం, బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు
  • మచిలీపట్నంలో 12 వేల ఓట్ల ఆధిక్యంలో కొల్లు రవీంద్ర
  • గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఆధిక్యం, కిలారి వెంకట రోశయ్యపై 50 వేల ఓట్ల లీడ్
  • రాజమండ్రి రూరల్ లో 32 వేల ఓట్ల ఆధిక్యంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి
  • పిఠాపురంలో 22 వేల ఓట్ల ఆధిక్యంలో పవన్ కల్యాణ్
  • సర్వేపల్లిలో 107 ఓట్ల ఆధిక్యంలో సోమిరెడ్డి
  • కడప ఎంపీ స్థానంలో 22,674 ఓట్ల లీడింగ్ లో అవినాష్ రెడ్డి, షర్మిలకు 14,532 ఓట్లు. టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డికి 81,553 ఓట్లు
  • రాయలసీమలో పడిపోయిన వైసీపీ, 47 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్
  • మాచర్లలో టీడీపీ ఆధిక్యత.. వెనుకంజలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
  • 15 లోక్ సభ స్థానాల్లో టీడీపీ ఆధిక్యం, 4 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో జనసేన ముందంజ
  • ధర్మవరంలో వైసీపీ లీడ్, పిఠాపురంలో 10 వేల ఓట్లకు పైగా లీడింగ్ లో పవన్ కల్యాణ్
  • చీపురుపల్లిలో మారుతున్న ఆధిక్యం, 370 ఓట్ల లీడ్ లో మంత్రి బొత్స
  • ఓటమి దిశగా వైసీపీ అభ్యర్థులు, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వల్లభనేని వంశీ
  • సర్వేపల్లిలో 1033 ఓట్లతో మంత్రి కాకాణి లీడ్
  • విజయవాడ సెంట్రల్ లో వెల్లంపల్లి, మచిలీపట్నంలో పేర్నికిట్టు, ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని వెనుకంజ
  • గుడివాడలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని
  • కావలిలో 4000, పలాసలో 4300 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థులు
  • హిందూపురంలో నందమూరి బాలకృష్ణ వెనుకంజ
  • కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగిన రాజమండ్రి అభ్యర్థి మార్గాని భరత్
  • అమలాపురంలో వెనుకబడిన మంత్రి పినిపె విశ్వరూప్
  • పిఠాపురంలో 8500 ఓట్ల ఆధిక్యంలో పవన్ కల్యాణ్
  • కుప్పంలో 5562 ఓట్లతో చంద్రబాబునాయుడు లీడ్
  • విజయవాడవెస్ట్ లో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆధిక్యం
  • సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ ముందంజ
  • గజపతినగరంలో టీడీపీ అభ్యర్థి కె. శ్రీనివాసరావు లీడ్
  • కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి 10 ఓట్ల ఆధిక్యం
  • విజయనగరం జిల్లాలో 7 చోట్ల టీడీపీ, 1 స్థానంలో జనసేన, 1 స్థానంలో వైసీపీ లీడ్
  • అరకు పార్లమెంట్ స్థానంలో వైసీపీ లీడ్
  • మాచర్లలో నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి 4 వేల ఓట్ల ఆధిక్యం
  • మ్యాజిక్ ఫిగర్ దాటి లీడింగ్ లో ఉన్న కూటమి అభ్యర్థులు
  • కోనసీమలో అనపర్తి మినహా క్లీన్ స్వీప్ దిశగా ఎన్డీయే కూటమి
  • మంత్రులు దాడిశెట్టి రాజా, పెద్దిరెడ్డి, అంబటి రాంబాబు, బుగ్గన వెనుకంజ
  • ఓటమి బాటలో ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు.. వెలవెలబోయిన వైసీపీ కార్యాలయం
  • పి. గన్నవరంలో జనసేన అభ్యర్థి సత్యనారాయణ ఆధిక్యం
  • రాజమండ్రి టౌన్ లో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లీడ్
  • పెనుగొండలో టీడీపీ అభ్యర్థి సబితమ్మ ఆధిక్యం
  • గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ వెనుకంజ, ఆధిక్యంలో పల్లా శ్రీనివాస్
  • టెక్కలిలో టీడీపీ అభ్యర్ధి కింజరాపు అచ్చెన్నాయుడు ముందంజ
  • చంద్రగిరిలో కూటమి అభ్యర్ది పులివర్తి నాని 2వేల ఓట్ల ఆధిక్యం
  • 25 ఎంపీ స్థానాలకు 10 స్థానాల్లో టీడీపీ లీడింగ్, 4 స్థానాల్లో వైసీపీ ముందంజ
  • అనకాపల్లిలో కొణతాల రామకృష్ణారెడ్డి లీడింగ్
  • సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనుకంజ
  • తాడిపత్రిలో కూటమి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి
  • 12వేల ఓట్ల ఆధిక్యంలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు
  • చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు 1900 ఓట్ల లీడ్
  • ఆళ్లగడ్డలో కూటమి అభ్యర్థి భూమా అఖిలప్రియ 325 ఓట్ల ఆధిక్యం
  • గుడివాడలో కేశినేని నానిపై 13,085 ఓట్ల ఆధిక్యంలో ఉన్న వెనిగండ్ల రాము
  • మచిలీపట్నంలో పేర్ని కిట్టుపై లీడింగ్ లో ఉన్న కొల్లు రవీంద్ర
  • తిరుపతిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ఆధిక్యం
  • నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ముందంజ
  • నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందంజ
  • అనంతపురంలో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ లీడ్
  • ఉండిలో రఘురామకృష్ణరాజు లీడింగ్
  • 2020 ఓట్ల ఆధిక్యంలో పొన్నూరు కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర
  • రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ముందంజ
  • రాప్తాడులో 1182 ఓట్ల ఆధిక్యంలో పరిటాల సునీత
  • నెల్లూరు ఎంపీ స్థానంలో రెండో రౌండ్ లోనూ విజయసాయిరెడ్డి వెనుకంజ
  • పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు ముందంజ
  • జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి లీడింగ్
  • మంగళగిరిలో 2400 ఓట్ల ఆధిక్యంలో నారా లోకేశ్
  • పాణ్యం, డోన్, నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో టీడీపీ ముందంజ
  • డోన్ లో బుగ్గన రాజేంద్రనాథ్ వెనుకంజ
  • గురజాలలో 4472 ఓట్ల ఆధిక్యంలో గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు
  • 5692 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి
  • రెండో రౌండ్ పూర్తయ్యేసరికి పిఠాపురంలో 8500 ఓట్లతో పవన్ కల్యాణ్ ముందంజ
  • కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ 3400 ఓట్లతో ఆధిక్యం
  • దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ లీడింగ్
  • నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఫారూఖ్ ఆధిక్యం
  • బద్వేల్ లో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ముందంజ
  • రాజమండ్రి రూరల్ లో నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి 8788 ఓట్లతో లీడింగ్ లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి
  • పులివెందులలో సీఎం జగన్ తొలిరౌండ్ లో 1888 ఓట్లతో ఆధిక్యం
  • కడప పార్లమెంట్ బరిలో షర్మల ముందంజ
  • తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధిక్యం
  • శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 2643 ఓట్లతో ముందంజ
  • శృంగవరపుకోటలో టీడీపీ అభ్యర్థి లీడింగ్
  • చంద్రగిరిలో పులివర్తి నాని (టీడీపీ) ముందంజ
  • గజపతినగరంలో టీడీపీ అభ్యర్థి కె.శ్రీనివాస్ లీడ్
  • ఏపీ లోక్ సభ స్థానాలైన విజయవాడ, రాజమండ్రి, నరసరావుపేట, తిరుపతి స్థానాల్లో ముందంజలో ఉన్న కూటమి అభ్యర్థులు
  • హిందూపురం, అనకాపల్లి, గుంటూరు, శ్రీకాకుళంలలో కూటమి అభ్యర్థులు ఆధిక్యత
  • తిరుపతిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ముందంజ
  • వైసీపీ కంచుకోట పూతలపట్టులో టీడీపీ లీడింగ్
  • భీమవరం అసెంబ్లీ స్థానంలోనూ జనసేన అభ్యర్థి అంజిబాబు ఆధిక్యత
  • కాకినాడ రూరల్ నియోజకవర్గంలో లీడింగ్ లో ఉన్న జనసేన అభ్యర్థి పంతం నానాజీ
  • అనకాపల్లి లోక్ సభ అభ్యర్థి సీఎం రమేష్ ముందంజ
  • విజయవాడ వెస్ట్ లో కేశినేని చిన్ని, ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబు లీడింగ్
  • జీడీ నెల్లూరులో టీడీపీ అభ్యర్థి థామస్, తిరువూరులో టీడీపీ అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాస్ ముందంజ
  • పిఠాపురంలో 4300 ఓట్లతో లీడింగ్ లో జనసేనాని పవన్ కల్యాణ్
  • గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యం, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ 3550 ఓట్లతో లీడింగ్
  • మైదుకూరులో లీడింగ్ లో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్
  • నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా వెనుకంజ
  • కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యం
  • మంగళగిరిలో నారా లోకేశ్ ముందంజ
  • నెల్లూరులో విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం
  • 1973 ఓట్లతో పురందేశ్వరి లీడింగ్
  • రాజమండ్రిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, నరసరావుపేటలో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు లీడింగ్
  • ఏపీలో 28 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో జనసేన అభ్యర్థులు లీడింగ్
  • కుప్పంలో 1600 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు నాయుడు
  • పిఠాపురంలో తొలిరౌండ్ లో పవన్ కల్యాణ్ ఆధిక్యం
  • నంద్యాలలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిపై 113 ఓట్లతో లీడింగ్
  • చెల్లుబోయిన వేణు పై బుచ్చయ్య చౌదరికి 2870 ఓట్లు ఆధిక్యం
  • ఈవీఎం రెండో రౌండ్ లోనూ గోరంట్ల ఆధిక్యం
  • 17 స్థానాల్లో టీడీపీ, 4 స్థానాల్లో జనసేన లీడింగ్
  • నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యం
  • మండపేటలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఆధిక్యం
  • పిఠాపురం పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువగా చెల్లని ఓట్లు
  • ఈవీఎం ఫస్ట్ రౌండ్ లో బుచ్చయ్య చౌదరికి 5795 ఓట్లు, చెల్లుబోయిన వేణుగోపాల్ కు 4885 ఓట్లు
  • కుప్పంలో చంద్రబాబు 1549 ఓట్లతో ఆధిక్యం
  • నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యం
  • మొదటి రౌండ్ లో రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 910 ఓట్లతో లీడింగ్
  • పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఒకస్థానంలో టీడీపీ ఆధిక్యం
  • రెడ్ జోన్లుగా కౌంటింగ్ కేంద్రాలు, 144 సెక్షన్ అమలు
  • ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత
  • 8.30 గంటల తర్వాత ప్రారంభం కానున్న ఈవీఎంల ఓట్ల లెక్కింపు
  • పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొదట వెల్లడి కానున్న రాజమండ్రి, నరసాపురం ఎంపీ ఫలితాలు
  • అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలుత కొవ్వూరు, నరసాపురం ఫలితాలు


Tags

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×