EPAPER
Kirrak Couples Episode 1

Ambati Rambabu | అంబటికి సత్తెనపల్లిలో తీవ్ర వ్యతిరేకత.. టికెట్ స్థానికులకు ప్రకటించాలని డిమాండ్!

Ambati Rambabu | సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆయనకు ఈ సారి టికెట్ ఇస్తే ఓడిస్తామని నియోజకవర్గ అసమ్మతి నేతలు అల్టిమేటం ఇస్తున్నారు. నాన్ లోకల్ అయిన అంబటిని పంపిచేయాలని .. సత్తెనపల్లి టికెట్ స్థానికులకే ఇవ్వాలన్న డిమాండ్ వైసీపీలో బలంగా వినిపిస్తోంది.

Ambati Rambabu | అంబటికి సత్తెనపల్లిలో తీవ్ర వ్యతిరేకత.. టికెట్ స్థానికులకు ప్రకటించాలని డిమాండ్!
Ambati Rambabu Latest News

Ambati Rambabu Latest News(Andhra politics news):

సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆయనకు ఈ సారి టికెట్ ఇస్తే ఓడిస్తామని నియోజకవర్గ అసమ్మతి నేతలు అల్టిమేటం ఇస్తున్నారు. నాన్ లోకల్ అయిన అంబటిని పంపిచేయాలని .. సత్తెనపల్లి టికెట్ స్థానికులకే ఇవ్వాలన్న డిమాండ్ వైసీపీలో బలంగా వినిపిస్తోంది. తాజాగా సంక్రాంతి సంబరాల్లో అమాత్యుడు చిందులు వేసిన సందర్భంగా పార్టీ వర్గాల అసంత‌‌ృప్తి మరోసారి బహిర్గతమైంది.


మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో అసమ్మతి వర్గం సమావేశాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు. యర్రం మద్దతు కోరారు. అధిష్ఠానం అదేశిస్తే పోటికి సిద్ధమని యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటును స్థానికులకు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం రేపల్లెలో ఒక సారి గెలిచిన అంబటిని తెచ్చి తమ తలమీద రుద్దారని.. ఇకపై సత్తెనపల్లిలో అంబటి పేరు వినపడకూడదని .. అంబటికి సీటు ఇస్తే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో అంబటి పోటిచేస్తే ఓడిస్తామని స్పష్టం చేశారు.

వైసీపీ పార్టీ కోసం కష్టపడ్డ అందరినీ అంబటి రాంబాబు ఇబ్బంది పెట్టారని అసమ్మతి నేతలు వాపోతున్నారు. అంబటి వద్దు, జగన్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. సంక్రాంతి సంబరాల్లో స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు.. సంబరాల రాంబాబుగా మారిపోయారని, అలాంటి మంత్రి తమకు వద్దు అని ప్రత్యర్థి వర్గం డిమాండ్ చేస్తుండటం గమనార్హం . ఇక పెదమక్కెన ఎంపీటీసీ యంపాటి విజయలక్ష్మి అయితే.. సంబరాల రాంబాబు నీకు ఇవే చివరి సంబరాలంటూ ఎద్దేవా చేశారు. తమ ఉసురు కొట్టుకొని నాశనం అవుతావని శాపనార్ధాలు పెట్టారు.


Related News

Pawan Kalyan: వైసీపీ పాలనలో 219 ఆలయాలు అపవిత్రం.. పవన్ ఆగ్రహం

Rangaraya Medical College Issue: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Kadambari Jethwani Case: జెత్వానీ కేసులో నెక్స్ట్ కటకటాల పాలయ్యేది ఎవరంటే?

Road Accident: ఏపీలో నెత్తురోడిన రహదారులు..ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు స్పాట్ డెడ్

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Big Stories

×