Big Stories

Amaravati: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు.. సుప్రీం ఏమందంటే..

Jagan-amaravathi

Amaravati: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు. ఆర్ 5 జోన్‌లో కేటాయింపులు. ప్రభుత్వం పంతం పట్టింది. రైతులు పట్టు బట్టారు. సర్కారు నిర్ణయానికి కోర్టులు అనుమతి ఇచ్చినా.. రాజధాని రైతులు మాత్రం మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడా ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. కాకపోతే ఓ షరతు విధించింది.

- Advertisement -

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇద్దరు న్యాయమూర్తులు ధర్మాసనం విచారించింది. ఆర్‌5 జోన్‌లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. మాస్టర్ ప్లాన్‌లో ఎలాంటి మార్పులు లేవని.. 34వేల ఎకరాలలో 900 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించామని ప్రభుత్వం తెలిపింది. ఎలక్ట్రిక్ సిటీకి ఎలాంటి ఇబ్బంది కలగదని కోర్టుకు వివరించింది.

- Advertisement -

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఆర్‌5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని తీర్పు ఇచ్చింది. చట్టం ప్రకారమే 5 శాతం EWSకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించింది. అయితే, హైకోర్టు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పట్టాదారులకు థర్డ్‌ పార్టీ హక్కు ఉండబోదని తేల్చి చెప్పింది.

సుప్రీం గ్రీన్ సిగ్నల్‌తో రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై చర్యలు ముమ్మరం చేస్తోంది సర్కారు. ఈ నెల 26నే లబ్దిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు. సీఎం జగన్ స్వయంగా ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేయనున్నారు. దాదాపు 50వేల మంది పేదలకు ప్రయోజనం చేకూరనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News