EPAPER

High Court on Allu Arjun: హైకోర్టులో అల్లుఅర్జున్ కు ఊరట.. అప్పటి వరకు చర్యలు వద్దంటూ ఆదేశం..

High Court on Allu Arjun: హైకోర్టులో అల్లుఅర్జున్ కు ఊరట.. అప్పటి వరకు చర్యలు వద్దంటూ ఆదేశం..

High Court on Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు నంద్యాలలో నమోదైన కేసుకు సంబంధించి ఊరట లభించింది. ఏపీలో ఎన్నికల సందర్భంగా తన స్నేహితుడు శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేసేందుకు, అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అనుమతులు లేకుండా నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటించారని, నిబంధనలు సైతం ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరగగా, కేసుకు సంబంధించి వచ్చే నెల ఆరో తేదీన తదుపరి ఉత్తర్వులు ఇస్తామని, అప్పటివరకు అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.


ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థిగా శిల్పా రవి పోటీ చేశారు. శిల్పా రవి స్నేహితుడైన హీరో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కు మద్దతు ఇచ్చేందుకు నంద్యాలకు వచ్చారు. అల్లు అర్జున్ వస్తున్నట్లు సమాచారం అందుకున్న స్టైలిష్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున నంద్యాలకు వచ్చారు. ఎటు చూసినా అల్లుఅర్జున్ అభిమానుల కోలాహలం కనిపించింది ఆరోజు. అలాగే తన పర్యటనపై అల్లుఅర్జున్ మాట్లాడుతూ.. తాను కేవలం తన స్నేహితుడికి మద్దతు తెలిపేందుకు మాత్రమే వచ్చానని, అది కూడా రవి వద్దంటున్నా తాను వచ్చినట్లు తెలిపారు.

మెగా కుటుంబానికి చెందిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పిఠాపురం నుండి బరిలో దిగిన సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఆ సమయంలో మెగా కుటుంబంలో విభేదాలంటూ వార్తలు బాగా హల్చల్ చేశాయి. అయితే బన్నీ నంద్యాల పర్యటన ముగించుకొని రాగానే, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలను అతిక్రమించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై తాజాగా బన్నీ, హైకోర్టును ఆశ్రయించారు.


Also Read: Ratan Tata: రతన్ టాటా వీలునామాలో ఏముందంటే..? కుక్కకు కూడా..

హైకోర్టులో విచారణ పూర్తయిన అనంతరం, వచ్చే నెల ఆరవ తేదీ వరకు బన్నీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీనితో హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందోనన్న మీమాంసలో అల్లు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఆరవతేదీన న్యాయస్థానం ఏ ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి.

Related News

TDP on Sharadapeetam: శారదాపీఠం.. పేరుకే పీఠమే కానీ వివాదాల పుట్ట.. ప్రభుత్వ నిర్ణయం భేష్ అంటున్న కూటమి నేతలు

Kurnool District News: గంటల వ్యవధిలో పెళ్లి.. వరుడు రెడీ కానీ.. ప్రియుడు ఎంటర్.. ఆ తర్వాత జరిగింది ఇదే!

Weather Update: తప్పిన తుఫాను గండం

Tirumala Breaking News: తిరుమలకు కాలినడకన వస్తున్నారా.. అయితే సదుపాయాలు మీకోసమే.. టీటీడీ కీలక ప్రకటన

Prakasam Politics: ప్రకాశంలో సైలెంట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్న ఆ నేత.. నేరుగా పవన్ నుండి పిలుపు.. వాట్ నెక్స్ట్?

YS Sharmila: సీఎం అయ్యాడు.. విడిపోదామన్నాడు.. దారుణంగా అవమానించాడు.. జగన్ గుట్టు రట్టు చేసిన షర్మిళ

Big Stories

×