EPAPER

AP & TS 10th Class Exams: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. కేంద్రాల వద్ద 144 సెక్షన్

AP & TS 10th Class Exams: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. కేంద్రాల వద్ద 144 సెక్షన్

Tenth Class Exams from Today


Tenth Class Exams in AP and Telangana: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో మార్చి 30 వరకూ, తెలంగాణలో ఏప్రిల్ 2వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు కొనసాగుతాయి. ఏపీలో మొత్తం 7 లక్షల 25 వేల 620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నాయి. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6 లక్షల 23 వేల 092 మంది ఉండగా.. రీ ఎన్ రోల్ అయినవారు 1,02,528 మంది ఉన్నారు. రెగ్యులర్ స్టూడెంట్స్ లో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు.

కాగా.. పదవ తరగతి పరీక్షల నిర్వహణకై విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షల నేపథ్యంలో ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించి ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చని తెలిపింది.


ఇక నేటి నుంచే ఏపీలో ఒంటిపూట బడులు సైతం ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులకు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఒంటిపూటబడులు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారు.

Also Read: ఓటు నమోదుకు మరో అవకాశం.. ఏప్రిల్ 15 వరకు గడువు..

తెలంగాణలో జరిగే పదో తరగతి పరీక్షలకు 5 లక్షల 08 వేల 385 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు కొనసాగుతాయి. మార్చి 26,27 తేదీల్లో జరిగే ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకే నిర్వహిస్తారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు డీఈఓలు, సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది. గతేడాది వరంగల్ లో జరిగిన ఘటన నేపథ్యంలో.. ఈసారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసులు సైతం భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో సమీపంలో ఉన్న జిరాక్స్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×