EPAPER

KCR Oppositon leader: కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తారా? లేక..

KCR Oppositon leader | అంతా ఆయన చెప్పినట్టే జరుగుతోంది. ఏదో మాట వరసకు చెప్పారో లేక ముందే ఓటమిని ఊహించారో తెలియదు కానీ ప్రచార సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ నోట ప్రతి సభలో ఒక మాట వచ్చేసింది. ఇంతకీ ఆ మాటేంటి? అసలిప్పుడు బీఆర్‌ఎస్‌ భవిష్యత్తేంటి? గులాబీ బాస్‌ అసెంబ్లీకి వస్తారా? రారా?

KCR Oppositon leader: కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తారా? లేక..
CM KCR latest updates

CM KCR latest updates(Breaking news updates in telangana):

అంతా ఆయన చెప్పినట్టే జరుగుతోంది. ఏదో మాట వరసకు చెప్పారో లేక ముందే ఓటమిని ఊహించారో తెలియదు కానీ ప్రచార సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ నోట ప్రతి సభలో ఒక మాట వచ్చేసింది. ఇంతకీ ఆ మాటేంటి? అసలిప్పుడు బీఆర్‌ఎస్‌ భవిష్యత్తేంటి? గులాబీ బాస్‌ అసెంబ్లీకి వస్తారా? రారా?


ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్‌ రెస్ట్ తీసుకుంటున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు క్యూ కట్టారు.. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరగాల్సిన భేటీ.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు షిఫ్ట్ అయ్యింది. ఎందుకు అలా జరిగింది? తెలంగాణ భవన్ పై కేసీఆర్ మొఖం చాటేశారా? టైమ్‌ను కాస్త రివైండ్ చేద్దాం.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయన ఓడిపోతే వెళ్లి హాయిగా రెస్ట్ తీసుకుంటాను అని పదే పదే అన్నారు.

అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు కొన్ని కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌ ఇక ప్రత్యక్ష రాజకీయాలకు రాం.. రాం.. చెప్పేశారా? మాములుగానే ప్రజలకు అందనంత దూరంగా ఉండే గులాబీ బాస్‌.. ఇక పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితం కానున్నారా? ఇక పార్టీ బాధ్యతలన్ని అయితే కేటీఆర్‌ లేదంటే హరీష్‌ రావే చూసుకోనున్నారా? ప్రస్తుతానికి ఇవన్నీ ప్రశ్నలే… సమాధానాలు లేవు. కానీ పరిస్థితులు చూస్తుంటే వీటన్నింటికి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.


అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ కోట కూలింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది. బీఆర్‌ఎస్‌ కూడా 39 సీట్లు గెలుచుకుంది. అయితే పార్టీ ఓటమిపై ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడింది కేటీఆర్‌. ఇక గెలిచిన ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవనలో భేటీ అయ్యారు. అధికారం పోయినందుకు వారందరిని ఓదార్చింది.. మళ్లీ కేటీఆరే. కేసీఆర్‌ జాడ ఇక్కడ కూడా కనిపించలేదు. కారణం అప్పటికే ఆయన తన ఫామ్‌హౌస్‌కు చేరుకోవడమే. మొత్తంగా చూస్తే కేసీఆర్‌ ఫామ్ హౌస్ గురించి అస్సలు మజాక్‌ చేయలేదని క్లారిటీ వచ్చేసింది. చెప్పినట్టుగానే ఇలా ఓడిపోగానే తన దూతతో గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపి.. కారులో ఫామ్‌హౌస్‌కు చేరిపోయారు.

ఇప్పుడు గెలిచిన వారంతా ఫామ్‌హౌస్‌కు చేరుకొని తమ అధినేతను కలుసుకోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఇకపై ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితం కానున్నారా? అనే చర్చ తెలంగాణ పొలిటికల్‌ సర్కిళ్లలో మొదలైంది. అంతేకాదు.. అసలు కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తారా? లేదా? అన్నది కొత్త ప్రశ్న. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విపక్షమే లేకుండా చేయాలని చూసిన వారు.. ఇప్పుడు విపక్షంలో ఎలా కూర్చుంటారన్నది ఓ బిగ్ క్వశ్చన్. అందుకే ఆయన అసెంబ్లీకి వస్తారా? రారా? అన్న చర్చ జరుగుతోంది.

ఒకవేళ కేసీఆర్ విపక్షనేతగా బాధ్యతలు తీసుకోకపోతే… ఆ స్థానాన్ని పార్టీ నేతల్లో ఎవరికి అప్పగిస్తారనేది మరో హాట్‌ టాపిక్‌గా మారింది. అదే గనుక జరిగితే పార్టీకి దూరంగా కేసీఆర్‌ జరిగినట్టే అనుకొవచ్చేమో.

అయితే అతి త్వరలో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు బిగ్‌ సవాల్‌ అనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీగా కాంగ్రెస్‌ దూకుడు ప్రదర్శించడం ఖాయం. ఈ ఎన్నికల్లో గనుక బీఆర్‌ఎస్‌ గెలిచి నిలవకపోతే.. నేతలను అటుంచి.. అసలు పార్టీ మనుగడపైనే నీలి నీడలు కమ్ముకోవడం ఖాయమనే చెప్పాలి.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×