EPAPER

professor : ఖర్జూరం.. ఎకరానికి రూ.6 లక్షల లాభం

professor : ఖర్జూరం.. ఎకరానికి రూ.6 లక్షల లాభం
professor

professor : వ్యవసాయం లాభసాటి కాదనేది ఓ తండ్రి మాట. అవేవీ పట్టించుకోని ఆయన కొడుకు సాగు.. బహు బాగు అనేలా చేశాడు. సేంద్రియ పద్ధతుల్లో ఖర్జూర సాగు చేసి ఎకరానికి రూ.6 లక్షలు చొప్పున ఆదాయం సముపార్జించాడు. ఫార్మర్‌గా మారిన ప్రొఫెసర్ దివాకర్ చెన్నప్ప ఇప్పుడు ఎందరికో ఆదర్శం.


ఇస్రోలో ప్రాజెక్టు సైంటిస్ట్ ఉద్యోగాన్నీ కాలదన్ని.. నేలతల్లిని నమ్ముకొనేలా దివాకర్‌ ఆలోచనలను మార్చింది ఓ పుస్తకం అంటే నమ్మగలరా? జపాన్ రైతు, తత్తవేత్త మసనోబు ఫుకువోకా రాసిన ‘వన్ స్ట్రా రివల్యూషన్’ నుంచి ఎంతో స్ఫూర్తిని పొందానని, అదే తనను వ్యవసాయం వైపు మళ్లేలా చేసిందని దివాకర్ చెప్పారు.

2008లో ఇస్రో కొలువుకు గుడ్‌బై చెప్పేశారు. ఆ మరుసటి ఏడాదే గౌరిబిదనౌర్ తాలూకాలోని సగనహళ్లి గ్రామంలో 7.5 ఎకరాల్లో ఖర్జూర సాగు చేపట్టారు. అంతకు ముందు వరకు దివాకర్ తండ్రి ఆ పొలంలోనే రాగులు, మొక్కజొన్న, కందులు పండించారు. అయితే ఎరువులు, పెస్టిసైడ్స్‌ వాడకం విపరీతంగా ఉండేది. అందుకే దివాకర్ తండ్రి ఎంత శ్రమించినా.. ఫలితం దక్కేది కాదు.


ఈ కారణంగానే దివాకర్‌ను వ్యవసాయానికి దూరంగా ఉంచారు. అంత లాభదాయకం కాదని.. సాగు చేపట్టడం కన్నా ఉద్యోగం చేయడం మేలని తన తండ్రి భావించేవారని దివాకర్ చెప్పారు. బంగారం లాంటి ఉద్యోగానికి రాజీనామా చేసేటప్పుడు కూడా తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా దివాకర్ తన మనసు మాత్రం మార్చుకోలేదు. తల్లి ఎంత వద్దని మొత్తుకుంటున్నా కొలువును వీడి 2009లో వ్యవసాయక్షేత్రంలోకి అడుగుపెట్టారాయన.

తొలి ప్రయత్నంగా రాగులు, కందులు పండించారు. అప్పటి వరకు తండ్రి అనుసరించిన విధంగానే ఎరువులు, పెస్టిసైడ్లు వాడారు. 5 నెలల సమయం,రూ.25 వేల ఖర్చు అయిన అనంతరం చూసుకుంటే వచ్చిన ఆదాయం రూ.33 వేలు. దివాకర్‌ను చూసి తెలిసినవారు గేలి చేయడం ఆరంభించారు. ఇదేనా సంపాదన? అంటూ దుయ్యబట్టారు. దీంతో దివాకర్‌ పునరాలోచనలో పడ్డారు.

తమిళనాడులో ఖర్జూరాల సాగు చేస్తున్నరైతు గురించి దివాకర్ గతంలో విన్నాడు. ఎడారి చెట్లను ఇక్కడ పెంచడమేమిటంటూ అప్పట్లో నవ్వుకున్నాడు కూడా. ప్రస్తుతం ఆ రైతు బాటనే ఆయన అనుసరించాడు.ఆ రైతు ఖర్జూరసాగు చేసిన తమిళనాడులోని ధర్మపురి, గౌరిబిదనౌర్ వాతావరణం ఒకేలా ఉంటుంది. ఈ కారణంగానే ఖర్జూర చెట్లను పెంచాలని నిర్ణయానికి వచ్చారు దివాకర్.

ఖర్జూర చెట్లకు ఎండ విరగకాయాలి. స్వల్పపాటి వర్షాలు ఉంటే చాలు. సరిగా ఇలాంటి వాతావరణమే తమ గ్రామంలోనూ ఉండటంతో ధైర్యంగా అడుగేశారు. 2009లో రూ.3 వేలు చొప్పున వెచ్చించి 150 ఖర్జూర మొక్కలను నాటారు. అయితే ఈ సారి సేంద్రియ పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమయ్యారు.

రూ.4.5 లక్షలతో కొన్న ఖర్జూర మొక్కలను 2.5 ఎకరాల్లో నాటారు. నీమ్ కేక్, కేస్టర్ కేక్, జీవామృతాన్ని ఎరువుగా వాడారు. 2013లో తొలి పంట చేతికి వచ్చింది. 650 కిలోల ఖర్జూరాల దిగుబడి రాగా.. కిలో రూ.375 చొప్పున విక్రయించారు. ఈ ఏడాది ఆగస్టు సీజన్‌లో దివాకర్‌కు 4.2 టన్నుల ఖర్జూరం పండింది.

ప్రస్తుతం 102 చెట్ల ఫలసాయాన్ని అందిస్తున్నాయని దివాకర్ తెలిపారు. ఒక్కో చెట్టు నుంచి 45 నుంచి 50 కిలోలు డేట్స్ అందుతాయన్నారు. వీటిని కిలో రూ.310 కి విక్రయించగా.. బెంగళూరులో హోం డెలివరీలను రూ.350 చొప్పున అందజేశారు. ఎకరానికి 60 చెట్ల నుంచి 2700 కిలోల దిగుబడి వస్తుందని, కిలో రూ.300 చొప్పున మొత్తం రూ8.1 లక్షల ఆదాయం లభిస్తుందని ఆయన వివరించారు. లేబర్, పెట్టుబడుల ఖర్చులన్నీ తీసేసినా ఎకరానికి నికరంగా రూ.6 లక్షల ఆదాయం వస్తుందని దివాకర్ వివరించారు.

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×