EPAPER

Stock Market: కమలవికాసం.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్.. 5 లక్షల కోట్ల లాభం

Stock Market: కమలవికాసం.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్.. 5 లక్షల కోట్ల లాభం

Stock Market: ఆదివారం వెల్లడైన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపొందడంతో స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల బాటలో పయనిస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవడంతో.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్న అంచనాలు సూచీలను లాభాలవైపు తిప్పాయి. సోమవారం ఒక్కరోజే మదుపరుల సంపద ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది.


సోమవారం ఉదయమే లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అదే జోరును కొనసాగించాయి. ప్రధాన సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ 1 శాతానికి పైగా లాభాలను అందుకుని సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఎన్నికల ఫలితాలు, భారీగా జీఎస్టీ వసూళ్లు, సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బలమైన జీడీపీ వృద్ధిరేటు, నవంబర్ లో గణనీయంగా జరిగిన వాహనాల విక్రయాలు వంటి అంశాలు లాభాల బాట పట్టించాయి.

సెన్సెక్స్ ఒక దశలో 1100 పాయింట్లకు పైగా పెరిగి 68,634 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేయగా.. నిఫ్టీ 20,619.70 వద్ద రికార్డు స్థాయికి చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని వివిధ సంస్థ మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.343 లక్షల కోట్లకు చేరింది. గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో వీటి విలువ రూ.14 లక్షల కోట్లకు పైగా పెరగడం విశేషం.


Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×