EPAPER
Kirrak Couples Episode 1

KCR Gajwel | గజ్వేల్ ఫలితం అంత ఈజీ కాదు.. ఉత్కంఠ పోరులో కేసీఆర్ గెలుస్తారా?

KCR Gajwel | గజ్వేల్ లో ఎవరికి ఎడ్జ్.. ఎవరికి టఫ్ ఉందన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి, గజ్వేల్ ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆ రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేశారు. కేసీఆర్ పై గజ్వేల్ లో ఈటల, కామారెడ్డిలో రేవంత్ ఢీకొట్టారు. దీంతో ఫలితం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అసలు కేసీఆర్ ను జనం ఆమోదించారా లేదా అన్నది కీలకంగా మారుతోంది.

KCR Gajwel | గజ్వేల్ ఫలితం అంత ఈజీ కాదు.. ఉత్కంఠ పోరులో కేసీఆర్ గెలుస్తారా?

KCR Gajwel | గజ్వేల్ లో ఎవరికి ఎడ్జ్.. ఎవరికి టఫ్ ఉందన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి, గజ్వేల్ ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆ రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేశారు. కేసీఆర్ పై గజ్వేల్ లో ఈటల, కామారెడ్డిలో రేవంత్ ఢీకొట్టారు. దీంతో ఫలితం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అసలు కేసీఆర్ ను జనం ఆమోదించారా లేదా అన్నది కీలకంగా మారుతోంది.


ఎప్పుడూ ఎన్నికలు అంటే చాలా అస్త్రాలు శస్త్రాలు వ్యూహాలు ప్రతివ్యూహాలతో రెడీగా ఉండే కేసీఆర్ ఈసారి ఎందుకో తడబడ్డట్లే కనిపిస్తున్నారు. ఎందుకంటే రెండు చోట్ల పోటీ చేయాలనుకోవడం మొదటి మైనస్ గా చెబుతున్నారు. ఎప్పుడైతే రెండు చోట్ల పోటీ చేస్తానని కేసీఆర్ స్వయంగా ప్రకటించారో.. అప్పటి నుంచే రాష్ట్ర ప్రజల ఆలోచన పూర్తిగా మారిపోయిందంటున్నారు. ఎందుకంటే ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డి వెళ్తున్నారని కాంగ్రెస్ విపరీతంగా ప్రచారం చేసింది. అటు కేసీఆర్ కూడా కామారెడ్డి వెళ్లడం వెనుక ప్రత్యేక కారణాలు చెప్పలేకపోయారు. పైగా గజ్వేల్ ప్రతినిధులతో మీటింగ్ పెట్టినప్పుడు తాను గజ్వేల్ వదిలి ఎక్కడికీ వెళ్లబోనని చెప్పడంతో రెంటికీ చెడ్డ రేవడి మాదిరి అయిందంటున్నారు. రెండు చోట్లా గెలిచే పరిస్థితి లేదన్న టాక్ పెరగడానికి స్వయంకృతాలే కారణమంటున్నారు.

సీఎం కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గ ఫలితం ఎందుకు ఉత్కంఠగా మారిందో చూద్దాం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గడంతో ఫలితం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. 4.4 శాతం పోలింగ్ తగ్గడం సీఎం కేసీఆర్ గెలుపు లేదా మెజార్టీ పై ప్రభావం చూపుతుందా అనే చర్చ ప్రారంభమైంది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన గజ్వేల్​లో సీఎం కేసీఆర్ తో బీజెపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడ్డారు. గజ్వేల్​లో వార్ వన్ సైడ్ అవుతుందని అందరూ భావించినా.. అనూహ్యంగా బీజేపీ తరఫున ఈటల రాజేందర్ బరిలోకి దిగడంతో చివరి వరకు పోటా పోటీగా పోలింగ్ ​సాగింది. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ​తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై 58,290 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ ఈసారి కేసీఆర్ పై గజ్వేల్ జనం గరంగరంమైనట్లు సర్వే రిపోర్టులు తెరపైకి వచ్చాయి. నియోజకవర్గానికి కేసీఆర్ వెళ్లలేకపోయారని, అక్కడి స్థానిక నాయకత్వానికి, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండలేకపోవడం మైనస్ అయ్యాయి. దీంతో వారందరినీ ప్రచార సమయంలో పిలిచి మరీ బుజ్జగింపులు చేశారు కేసీఆర్. మరి అవి ఫలించాయా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.


2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థితో పోటీ పడగా బీజేపీ అభ్యర్థి నామమాత్రానికే పరిమితమయ్యారు. పోలైన ఓట్లలో లక్షకు పైగా కేసీఆర్ సాధించారు. కానీ ఈ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చారంటున్నారు. గురువారం జరిగిన పోలింగ్ లో గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,74,654 ఓటర్లకు గాను 2,31,086 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,15,892 మంది, మహిళలు 1,15,191 మంది ఉండగా 84.14 పోలింగ్ శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో 88.63 శాతం నమోదు కాగా 2023 ఎన్నికల్లో 4.4 శాతం తగ్గింది. ఇది దేనికి సంకేతమన్న చర్చ జరుగుతోంది.

తగ్గిన పోలింగ్ ​శాతం గజ్వేల్ లో సీఎం కేసీఆర్ గెలుపు లేదా మెజార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 4.4 శాతం తగ్గడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత, నిర్వాసితులు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారంటున్నారు. దీంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గ ఓటర్ల వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు సంబంధించి దాదాపు 25 వేల ఓట్లు ఉండగా ఇవి ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్ ల వైపు పడినట్లు అంచనాలున్నాయి. నిర్వాసితుల మద్దతు పొందాలని బీఆర్ఎస్ అనేక ప్రయత్నాలు చేసినా వారు మాత్రం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేశారనే స్థానికంగా టాక్ వినిపిస్తోంది. ముదిరాజ్ లతో పాటు బీసీ ఓటర్లు బీజేపీ అభ్యర్థి ఈటలకు టర్న్ అయ్యాయంటున్నారు.

గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాల్టీల పరిధిలో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. ఈ మున్సిపాల్టీల పరిధిలో మొత్తం 35 పోలింగ్ బూత్​ లు ఉండగా అత్యధికంగా 78.26, అత్యల్పంగా 67.45 శాతం మేర మాత్రమే పోలింగ్ జరిగింది. అదే రూరల్ ఏరియాల్లో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే ఆ రెండు మున్సిపాల్టీల్లో దాదాపు ఆరు నుంచి ఎనిమిది శాతం మేర పోలింగ్ తగ్గడం వల్ల సీఎం కేసీఆర్ మెజార్టీకి గండిపడినట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది. బెట్టింగ్ లు కూడా జోరందుకున్నాయి. మరి గజ్వేల్ లో ఏం జరుగుతుంది? వెయిట్ అండ్ సీ.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×