EPAPER

China Travel Ban | చైనాకు రాకపోకలు నిషేధించాలి : అమెరికన్ సెనెటర్లు

China Travel Ban | చైనా దేశం నుంచి కరోనా తరహాలో మరో మహమ్మారి భయం పొంచి ఉన్నందున అమెరికా నుంచి చైనాకు ప్రయాణం నిషేధం విధించాలని అమెరికన్ సెనెటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌ను కోరారు. ఇటీవల అమెరికాలో(వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌) శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు నానాటికీ పెరుగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళనపడుతున్నాయి.

China Travel Ban | చైనాకు రాకపోకలు నిషేధించాలి : అమెరికన్ సెనెటర్లు

China Travel Ban | చైనా దేశం నుంచి కరోనా తరహాలో మరో మహమ్మారి భయం పొంచి ఉన్నందున అమెరికా నుంచి చైనాకు ప్రయాణం నిషేధం విధించాలని అమెరికన్ సెనెటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌ను కోరారు. ఇటీవల అమెరికాలో(వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌) శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు నానాటికీ పెరుగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళనపడుతున్నాయి.


ఇదే సమయంలో చైనాలోనే బ్యాక్టీరియల్‌ నిమోనియాకు సంబంధించిన ఒక కొత్త రకం ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికన్ సెనెటర్లు ప్రెసిడెంట్ బైడెన్‌కు చైనాకు రాకపోకలను బంద్ చేయాలని లేఖ రాశారు.

”శ్వాసకోశ వ్యాధులు చైనాలో వేగంగా వ్యాపిస్తున్నాయి.. చైనా ప్రభుత్వం అక్కడి ప్రజారోగ్య సంక్షోభంపై ఎటువంటి వివరాలు బయటపెట్టలేదు. ఇదే పరిస్థితి కరోనా సమయంలోనూ ఉన్నది. మరోసారి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘డబ్ల్యూహెచ్‌వో’ చర్యలు తీసుకునేదాకా వేచిచూడకుండా.. అమెరికా ప్రజల ఆరోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు తక్షణమే అమెరికా చైనా మధ్య ప్రయాణ నిషేధం విధించాలి. కొత్తగా వచ్చిన వ్యాధి గురించి పూర్తి సమాచారం వచ్చేదాకా ప్రయాణ ఆంక్షలు కొనసాగాలి” అని సెనెటర్లు ఆ లేఖలో రాశారు.


అమెరికాలో వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌
అమెరికాలో ఇటీవల కొత్త రకం శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అమెరికాలోని అలాబామా, మిస్సిస్సిపీ, న్యూ మెక్సికో, ప్యూర్టోరికో, టెక్సాస్‌, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా సహా 11 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) తెలిపింది. ‘వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌’ గా పిలవబడే ఈ వ్యాధి ప్రధానంగా 3-8 ఏళ్ల వయసు పిల్లలకు సోకుతోంది. వ్యాధి సోకిన వారి ఊపిరితిత్తులకు పరీక్షించగా.. తెల్లరంగు మచ్చల్లాంటివి కనిపిస్తున్నాయి.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంవల్లే పిల్లల్లో ఈ వ్యాధి సోకుతున్నట్లు కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ వైట్ లంగ్ సిండ్రోమ్‌కి చైనాలో పెరిగిన కొత్త రకం న్యూమోనియా వేరియంట్‌కు సంబంధం లేదని అమెరికా అధికారులు తెలిపారు.

చైనా స్పందన
చైనా ప్రభుత్వం తమ దేశంలో పెరుగుతున్న న్యూమోనియో శ్వాసకోశ కేసులపై ఇటీవల స్పందించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మీడియాతో మాట్లాడుతూ.. శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలేనని చెప్పారు. అలాగే ఈ వ్యాధి వ్యాప్తికి నివారించడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని వాంగ్ యీ అన్నారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా ప్రభుత్వం నుంచి ఈ ఇన్షెక్షన్లపై సమాచారం కోరింది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×