Food Cravings : కొంతమందికి డిన్నర్ చేశాక కూడా ఆకలిగా అనిపిస్తుంటుంది. నైట్ డ్యూటీ వల్లనో, నిద్ర పట్టకపోవడం వల్లనో.. కారణం ఏదైనా కావచ్చు. లేట్నైట్లో ఏది పడితే అది కాకుండా కొన్ని పదార్థాలు తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రాత్రిళ్లు వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారికి పాప్కార్న్ మంచి స్నాక్. కరకరలాడుతూ.. సాల్టీగా ఉంటుంది.
రాత్రిళ్లు ఆకలేస్తే.. కొన్ని బిస్కెట్లు తినవచ్చు. అయితే, సాల్ట్ బిస్కెట్ల జోలికి మాత్రం వెళ్లకూడదు.
తక్కువ క్యాలరీలు, అధిక ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అందాలంటే.. వేయించిన పుట్నాలు తినండి. దీంతో పొట్ట కూడా హాయిగా ఉంటుంది.
ఒక పీనట్ బటర్ శాండ్విచ్ తిన్నారంటే.. ఆకలి తీరడంతో పాటు మంచి నిద్రలోకి జారుకుంటారు.
కుకీస్కు బదులుగా నువ్వుల ‘చక్కీలు’ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. లేదా ఒక అరటి పండు, కొన్ని బాదం పలుకులు తీసుకోవచ్చు.