EPAPER

IND vs SA : వారిద్దరికి.. కాసేపు విరామం.. రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి!

IND vs SA : వారిద్దరికి.. కాసేపు విరామం.. రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి!
Ind vs SA t20 squad 2023

Ind vs SA t20 squad 2023(Latest cricket news India):

అంతా అనుకున్నట్టే అయ్యింది. సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో టీ 20, వన్డేల నుంచి రోహిత్, కొహ్లీలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. సౌతాఫ్రికాతో ఆడే రెండు టెస్ట్ లకు మాత్రం వీళ్లిద్దరూ వెళ్లి ఆడాల్సి ఉంటుంది. మొదటి టెస్ట్ డిసెంబర్ 26-30 వరకు, రెండో టెస్ట్ జనవరి 3-7 వరకు జరగనుంది.


నవంబరు 19, 2023న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి డిసెంబరు 26 వరకు లెక్కవేస్తే, ఇక వీళ్లు ఇండియా నుంచి బయలుదేరడం అన్నీ చూసుకుంటే ఒక నెలరోజులు ఇద్దరికి సెలవు ఇచ్చినట్టయ్యింది. ఇప్పటికే ఆసిస్ తో జరిగే టీ 20 సిరీస్ కి వరల్డ్ కప్ ఆడిన ముగ్గురు తప్ప సీనియర్లందరూ దూరమమ్యారు. ఇప్పుడు సౌతాఫ్రికా పర్యటనకు అందరూ జమయ్యారు. కాకపోతే…ఒకొక్క ఫార్మాట్ కు ఒకొక్కరిని కెప్టెన్ గా ఎంపిక చేశారు.

టీ 20లకు సూర్యకుమార్ యాదవ్ ఎప్పటిలాగే కొనసాగుతాడు. వన్డేలకు వచ్చి కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉంటాడు. టెస్ట్ మ్యాచ్ ల దగ్గరికి వచ్చేసరికి ఎప్పటిలా రోహిత్ శర్మ ఉంటాడు. ఒకొక్క ఫార్మాట్ కి ఒకొక్క కెప్టెన్ ని ఎంపిక చేసినట్టే, ఒకొక్క ఫార్మాట్ కి ఒకొక్క జట్టుని ఎంపిక చేశారు. ఆయా ఫార్మాట్ల వారీగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూద్దాం..


టీ20 మ్యాచ్ లకు టీమ్ ఇండియా:
యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, దీపక్ చాహర్

వన్డే మ్యాచ్ లకు టీమ్ ఇండియా:
 రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్

టెస్టులకు టీమ్ ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, మహమ్మద్ షమీ (ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×