EPAPER

Cash for Vote | చాప కింద నీరులా డబ్బు పంపిణీ.. ఎంత కట్టడి చేసినా చేరుతున్న నగదు!

Cash for Vote | మీకు ఓటు.. మాకు నోటు.. తెలంగాణలో ఎవర్ని కదిలించినా ఇదే తతంగం.. ఉపఎన్నికలతో ముదిరిన నోట్ల పంపిణీ సంస్కృతి ఈసారి పీక్స్‌కు చేరింది. పోలింగ్‌కు మరికొన్ని గంటలే ఉండగా ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభ పెడుతున్నారు. మందు, విందు అంటూ మైమరచిపోయేలా చేస్తున్నారు.

Cash for Vote | చాప కింద నీరులా డబ్బు పంపిణీ.. ఎంత కట్టడి చేసినా చేరుతున్న నగదు!

Cash for Vote | మీకు ఓటు.. మాకు నోటు.. తెలంగాణలో ఎవర్ని కదిలించినా ఇదే తతంగం.. ఉపఎన్నికలతో ముదిరిన నోట్ల పంపిణీ సంస్కృతి ఈసారి పీక్స్‌కు చేరింది. పోలింగ్‌కు మరికొన్ని గంటలే ఉండగా ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభ పెడుతున్నారు. మందు, విందు అంటూ మైమరచిపోయేలా చేస్తున్నారు. ఓటుకు 2 వేల నుంచి 5 వేల వరకు పంచుతున్నారు. కొన్నిచోట్ల ఏకంగా 10 వేల వరకు ఇస్తున్నారు. ఇంత డబ్బు నియోజకవర్గాలు.. ఊర్లకు ఎలా చేరిందనేది ఆందోళన కరంగా మారింది. ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి భారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఏం సాధించారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వైన్స్‌ మూతబడినా జనం మూతలు విప్పుతుండటం ఎంత మందు చూపు ఉందనేది క్లియర్‌గా తెలిసిపోతోంది. మరి ప్రలోభాల పర్వం ఎన్నికల ఫలితాలపై ఏ మేరకు ప్రభావం చూపనుందనేది హాట్‌ టాపిక్‌గా మారింది.


ఓటు వేయమని అడిగితే నోటు సంగతేంటనే అడిగే సంస్కృతి పెరిగిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. వార్డుల వారీగా టీమ్‌ మెంబర్లను ఏర్పాటు చేసుకొని మరీ పంపిణీ చేస్తున్నారు. 2 వేల నోట్లు రద్దైతే ఓట్ల కొనుగోళ్లకు కొంత బ్రేక్‌ పడుతుందని భావించారు. ఐతే 5 వందల రూపాయల నోట్లు కూడా పెద్దమొత్తంలో కట్టలు తెంచుకుంటున్నాయి. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా నగదు చేరాల్సిన చోటుకు ఎప్పుడో చేరిపోయింది. కొందరు పోలీస్‌ అధికారులు కూడా డబ్బులు పంచుతూ దొరికిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల సపోర్ట్‌తోనే అధికార పార్టీ డబ్బులు పంచుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో మాజీ ఐఏఎస్‌ ఏకే గోయెల్‌ నివాసంలో జరిగిన ఘటన కూడా సంచలనం సృష్టించింది. అతని నివాసం నుంచి వెయ్యికోట్ల రూపాయలు అంబులెన్స్‌లలో పంపించారని కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగడం.. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సోదాలు నిర్వహించడం పరిస్థితికి అద్ధం పట్టింది. తాజాగా ఎక్సైజ్ సీఐ అంజిత్‌రావు డబ్బులతో దొరికిపోవడం ప్రకంపనలు రేపింది. మేడిపల్లి సమీపంలోని చెంగిచెర్ల చౌరస్తాలో డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయాడు. అంజిత్‌రావుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సస్పెన్షన్ వేటు వేశారు.

ఇక పల్లెల్లో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు పెత్తఎత్తున తెరలేపారు. డబ్బులు ఇస్తూనే దేవుడిపై ప్రమాణాలు చేయించుకుంటున్నారు. డబ్బులు తీసుకున్న వారి పేర్లను కూడా బుక్‌లో నమోదు చేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లాలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరిగిన ఈ సీన్ సంచలనంగా మారింది. స్థానిక ఎంపీటీసీ ఇదిగో ఇలా దగ్గరుండి మరీ డబ్బులు పంచారు. అయినప్పటికీ ఇటు పోలీసుల నుంచి గానీ.. అటు ఈసీ నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు.


రెండు రోజుల క్రితం ఎల్బీనగర్‌లోనూ పర్సులో 2 వేలు పెట్టి పంపిణీ చేశారు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఇదే సీన్ నడుస్తోంది. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకోవాలని సీఈసీ బృందం మొదట్లోనే హెచ్చరించింది. అయినా సరే ప్రలోభాల పర్వం ఎక్కడా ఆగడం లేదు. స్థానిక నాయకులు, చోటామోట లీడర్లు.. ఇదే అదనుగా రంగంలోకి దిగారు. కులం, మతం, కాలనీ సంఘాల పేరిట బేరమాడుతున్నారు. 2 వేల నుంచి 5 వేల దాకా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్ని సెగ్మెంట్‌లలో చాప కింద నీరులా డబ్బు పంపిణీ జరిగిపోతోంది. నియోజకవర్గంలో బలమున్న? బలం లేని ప్రాంతాలుగా విభజించి మరీ పంపకాలు చేపడుతున్నారు. సగం మంది ఓటర్లకు నగదు చేరేలా అధికార పార్టీ పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు డబ్బు పంపిణీ చేయకుండా గట్టి నిఘా పెడుతున్నాయి. మనుషులు తిరుగుతున్న వారిని బట్టి నిఘా పెట్టి ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఫలితంగా అధికార, విపక్షాల మధ్య చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చెంగిచెర్ల క్రాస్ రోడ్డు వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తరలిస్తున్న కారును కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టుకున్నారు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ డబ్బులను పోలీసు అధికారి పంచుతున్నారని ఐడీ కార్డ్ కూడా చూపించారు. అదీ పరిస్థితి. ఇంత జరిగాక… ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని 5 లక్షలు స్వాధీనం చేసుకుంది.

కేంద్ర ఎన్నికల సంఘం ఊహించినట్లుగానే.. తెలంగాణలో ప్రలోభాల పర్వం విచ్చలవిడిగా నడిచింది. మొదట్లో కోడ్ పేరుతో పోలీసులు తనిఖీలు చేశారు. ఇందులోనూ సామాన్యులే ఎక్కువ ఇబ్బందులు పడ్డారు. పెళ్లి డబ్బులు, నగలు తీసుకెళ్తున్న వారికే సమస్యలు వచ్చాయి. వందల కోట్ల అంబులెన్స్‌లలో తరలిపోయాయనే ఆరోపణలు వచ్చినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. మద్యం కూడా ముందుగానే డంప్ చేసుకుని పంచాల్సిన చోట పంచేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి 100 కోట్ల దాకా ఖర్చు చేశారన్న లెక్కలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో 10 మంది వరకు అభ్యర్థులకు వంద కోట్లు ఖర్చు చేసే కెపాసిటీ ఉంది. ఒకే నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి 100 నుంచి 150 కోట్ల దాకా ఖర్చు చేసే నియోజకవర్గాలు దాదాపు 25 ఉన్నాయంటే నోరెళ్ల బెట్టాల్సింది. అలాగే తమకు కొరకరాని కొయ్యగా మారతారని భావించిన ప్రత్యర్థి అభ్యర్థులపై అధికార పక్షం ఈసారి గట్టిగా ఫోకస్‌ చేసింది. అలాంటి చోట్ల ఏకంగా 200 కోట్ల వరకు సర్దుబాటు చేశారనే ప్రచారం జరిగింది.

ఒక్కో నియోజకవర్గంలో కనీసం లక్షన్నర నుంచి 2 లక్షల మంది ఓటర్లకు డబ్బు పంపిణీ చేయాలని అభ్యర్థులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ 100 కోట్ల నుంచి 200 కోట్ల మధ్యలో ఉందన్న లెక్కలు కలవర పరుస్తున్నాయి. మనీతో పాటే లిక్కర్ కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. కేవలం 40 లక్షలే ఖర్చు చేయాలని ఈసీ రూల్స్ ఉన్నాయి. కానీ వీటిని పట్టించుకునేదెవరు. ఎన్నికల వ్యయ పరిశీలకులు నిఘా పెట్టి ఖర్చులను రాస్తున్నా తెరవెనుక జరిగే వాటి సంగతేంటి? ఇవన్నీ చాపకింద నీరులా జరిగిపోతున్నాయి. ప్రలోభాలతో పాటే బెట్టింగ్‌ల దందా కూడా జోరుగా జరుగుతోంది. వందల కోట్లలో బెట్టింగ్‌లు సైతం వేస్తున్నారు. ఈసారి మొత్తం బెట్టింగులు వెయ్యి కోట్ల వరకూ ఉంటాయని అంచనా వేస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఎన్నికల పందాలు సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా ఈ దందా జోరుగా సాగుతోంది.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×