EPAPER

Naga Sarpas : పురాణాల ప్రకారం పాములు ఎన్ని రకాలంటే..!

Naga Sarpas : పురాణాల ప్రకారం పాములు ఎన్ని రకాలంటే..!
naga sarpas

Naga Sarpas : మనదేశంలో పాములను నాగదేవతలుగా పూజిస్తారు. మన పురాణాల్లోనూ పాములకు ప్రత్యేక స్థానం ఉంది. మన పురాణాలు, శాస్త్రాల ప్రకారం కూడా నాగులు, సర్పాలు ఒకటి కావు. ఈ రెండింటికీ వేర్వేరు స్వరూపాలు, స్వభావాలు ఉన్నాయి.


భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ‘నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. సర్పాలలో వాసుకిని, నాగులలో అనంతుడిని’ అని తన గురించి చెప్పుకోవటం కనిపిస్తుంది. మరోవైపు.. వాసుకి.. శివుడి మెడలో అలంకారంగా నిలిచింది. ఈ వాసుకినే త్రాడుగా చేసుకుని దేవదానవులు సాగర మథనం చేశారు. వాసుకి, అనంతుడు(ఆదిశేషుడు), వాసుకి ఇద్దరూ అన్నదమ్ములు. వీరి తల్లిపేరు కద్రువ. అనంతుడి బలాన్ని చూసిన బ్రహ్మదేవుడు భూభారాన్ని మోసే పనిని అప్పగిస్తాడు.

సర్పాలంటే విషపూరితాలు అని, నాగులు అంటే విషరహిత పాములు అని పెద్దలు చెబుతారు. పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా వీరి మధ్య తేడా ఉంది. నాగులు కామరూపధారులు. అంటే.. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంతో సహా ఏ రూపంలోనైనా కనిపించగలవు. కానీ.. సర్పాలు మాత్రం.. నేలకే పరిమితమవుతాయి. నాగులు గాలిని ఆహారంగా స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలు మాత్రం.. కప్పలు మొదలైన జీవరాశులను ఆహారంగా తీసుకుంటాయి.


అటు.. సర్పాల్లో కూడా రకాలున్నాయి. వీటిలో దేవతా సర్పాలు మనుషులు తిరిగే చోట తిరగవు. ఇవి ఉన్నచోట మల్లెపూల వాసన వస్తుంది. కొన్ని క్షేత్రాల్లో ఇవి పూజలందుకుంటాయి. తమను పూజించిన వారికి ఆరోగ్యాన్ని, సంతానాన్ని ఇవి అనుగ్రహిస్తాయి.

సర్పజాతుల్లో దివ్యములు, భౌమములు అనే రెండు రకాలున్నాయి. దివ్యములనే దేవతా సర్పములు అంటారు. వీటికే నాగులు అనే పేరు కూడా ఉంది. ఇక.. భౌమములు అంటే.. భూమి నందు ఉండేవి.

దివ్య సర్పముల్లో.. అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖపాలుడు, కులికుడు అనే వారు ప్రముఖులు. ఈ 8 రకాల దేవతా సర్పాలకు ముసలితనం, మరణం అనేవి ఉండవు. వీటి విషం అత్యంత తీవ్రమైనది. ప్రపంచంలో ఏ శక్తీ ఈ విషాన్ని నిరోధించలేదు. కొన్ని సార్లు ఇవి అదృశ్య రూపంలో కూడా ఉంటాయి.

వీరిలో అనంతుడుకి పడగ మీద తెల్లటి పద్మాకారం గల తెల్లని చుక్కలుంటాయి. కులికునికి శిరము నందు శంఖము వంటి గుర్తు ఉంటుంది. వాసుకి వీపు భాగంలో నల్ల కలువ గుర్తు ఉండును. కర్కోటకునికి మూడు నేత్రములు పోలిన గుర్తు, తక్షకునికి పడగ యందు స్వస్తిక్ వంటి గుర్తు, శంఖుపాలునికి వీపు నందు అర్ధచంద్ర త్రిశూలాకారపు గుర్తు, మహాపద్మునికి చిన్నచిన్న మణుల వంటి చుక్కలు, పద్మునికి వీపు నందు ఎర్రని వర్ణం గల 5 బిందువులుంటాయి.

ఇక..భూమ్మీద తిరిగే భౌమములోనూ నాలుగు రకాలున్నాయి. అవి.. దర్వీకరములు. అనగా తాచు పాములు. వీటి పడగ గరిటెలా ఉంటుంది. ఇవి 14 రకాలు. రెండవ రకం.. మండలీ సర్పాలు. వీటినే పింజరలు అంటారు. ఇవి 21 రకాలు. వీటి ఒళ్లంతా రత్నాల కంబళి వలే లేదా చిత్ర విచిత్రమైన పొడలుగా ఉంటుంది. మూడవది.. రాజీమంతములు. ఇవి క్షుద్ర జాతి సర్పములు. ఇవి 36 రకాలు. వీటి పడగ మీది గీతలు పైకి సాగి, కిందికి వచ్చి కనిపిస్తాయి. ఇవిగాక.. చిన్న చిన్న ఉపజాతి సర్పాలున్నాయి

Related News

Navratri 2024: నవరాత్రుల్లో 9 రోజులు ఇలా చేస్తే భవాని మాత అన్ని సమస్యలను తొలగిస్తుంది

Pitru Paksha 2024: పితృపక్షంలో ఈ పరిహారాలు చేస్తే మీ పూర్వికులు సంతోషిస్తారు.

Trigrahi yog September 2024 Rashifal: ఒక్క వారంలో ఈ 6 రాశుల జీవితాలు మారబోతున్నాయి..

Auspicious Dream: కలలో ఈ పువ్వు కనపిస్తే ధనవంతులు అవవుతారట.. మీకు కనిపించిందా మరి

Sun Transit 2024: సూర్యుడి సంచారం.. వీరికి ఆకస్మిక ధనలాభం

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకంత ప్రత్యేకం? 70 ఏళ్ల కిందట.. ఒక్క ‘అడుగు’తో మొదలైన సాంప్రదాయం

Sun Transit 2024: సూర్యుని సంచారంతో ఈ నెలలో ఏ రాశి వారికి లాభమో, ఎవరికి నష్టమో తెలుసా ?

Big Stories

×