Hyderabad – Rangareddy Politics : ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తెలంగాణ ఎన్నికలల్లో కీలకంగా మారాయి. మొత్తం 29 నియాజకవర్గాల్లో ఇక్కడ ఉన్నాయి. దాదాపు 25 శాతం అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందుకే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలపై అన్నీ పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. తెలంగాణలోని ఇతర జిల్లాలు ఓటర్ల నాడి సులువుగా తెలుసుకోవచ్చు కానీ.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓటర్ పల్స్ ఎలా ఉందో చెప్పడం చాలా కష్టం. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఓటర్లుగా ఉన్నారు. అలాగే ఏపీ సెటిలర్ల ఓట్లు ఎక్కుగా ఉన్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి సెటిల్ అయిన వారి ఓట్లు కీలకమే. అలాగే హైదరాబాద్ లో బీజేపీ ప్రభావం కొంత ఉంది. ఓల్డ్ సిటీలో ఎంఐఎం ప్రభావం పూర్తిగా ఉంటుంది. మిగతా సిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంది. అలాగే కొన్ని స్థానాల్లో బీజేపీ ప్రభావం చూపించే అవకాశం ఉంది.
మేడ్చల్– మల్లారెడ్డి తోటకూర(బీఆర్ఎస్) -వజ్రేష్ కుమార్(కాంగ్రెస్)- ఏనుగు సుదర్శన్ రెడ్డి(బీజేపీ)