ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల వార్ రసవత్తరంగా మారింది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కు ఓటమి భయం పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. వరంగల్ తూర్పులో కొండా సురేఖ తన విజయంపై ధీమాగా ఉన్నారు. వరంగల్ వెస్ట్ లో దాస్యం వినయ్ భాస్కర్ గ్రాఫ్ పడిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ స్థానిక నాయకత్వం సహరిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావు వైపు సానుభూతి పవనాలు వీస్తున్నాయని అంటున్నారు. ములుగు సీతక్క విజయం నల్లేరుపై నడకే అనే అంచనాలున్నాయి. పరకాల, నర్సంపేటలో పోటీగా హోరాహోరీగా ఉందని తెలుస్తోంది.
1.జనగాం– పల్లా రాజేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్) కొమ్మూరి ప్రతాప్ రెడ్డి (కాంగ్రెస్) ఆరుట్ల దశమంత్ రెడ్డి (బీజేపీ) 2.స్టేషన్‌ఘన్‌పూర్– కడియం శ్రీహరి (బీఆర్ఎస్) సింగాపురం ఇందిర (కాంగ్రెస్) గుండె విజయ రామారావు (బీజేపీ)
పాలకుర్తి– ఎర్రబెల్లి దయాకర్ (బీఆర్ఎస్) యశస్విని రెడ్డి (కాంగ్రెస్) లేగా రాంమోహన్ రెడ్డి (బీజేపీ)
డోర్నకల్– రెడ్యా నాయక్ (బీఆర్ఎస్)- రాంచంద్రు నాయక్ (కాంగ్రెస్)- భూక్య సంగీత (బీజేపీ)