EPAPER

T20 Team India | తిలక్ వర్మను తప్పిస్తారా? అయ్యర్ కోసం త్యాగం చేయాలా?

T20 Team India | ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ లు నెగ్గిన టీమ్ ఇండియా కుర్రాళ్లు మంచి దూకుడు మీద ఉన్నారు. ఇంకో మ్యాచ్ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా ప్లాన్ చేస్తోంది. అయితే ఎలాగైనా గెలిచి, సిరీస్ పోకుండా చూడాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. దీంతో మంగళవారం గౌహతిలో జరిగే మ్యాచ్ టగ్ ఆఫ్ వార్ గానే నడిచేలా ఉంది.

ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంంటే తెలుగు కుర్రాడు తిలక్ వర్మకి వచ్చిన అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడని అంటున్నారు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రెండో వన్డే మాత్రం లెక్క వేయకూడదు. ఎందుకంటే తను రుత్ రాజ్ గైక్వాడ్ అయిపోయిన తర్వాత 19.2 ఓవర్ లో వచ్చాడు.

అప్పటికి 4 బాల్స్ మాత్రమే ఉన్నాయి. తను రెండు బంతులు ఆడి 7 పరుగులు చేశాడు. అందులో ఒక సిక్సర్ ఉంది. విశాఖలో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో మాత్రం 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మాత్రం దానికే తిలక్ వర్మను పక్కన పెట్టాలనుకోవడం కరెక్టు కాదని అప్పుడే నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ విషయం ఏమిటంటే ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు మ్యాచ్ లకు శ్రేయాస్ అయ్యర్ జట్టులో చేరనున్నాడు. అతనికి ఎవరో ఒకరు ప్లేస్ ఇవ్వాలి. అందరి చూపు తిలక్ వర్మ వైపే కనిపిస్తోంది. ఎందుకంటే రింకూ సింగ్ మంచి ఫినిషర్ గా మారాడు. ఇషాన్ కిషన్, గైక్వాడ్, యశస్వి జైస్వాల్ అందరూ హాఫ్ సెంచరీలు చేశారు. అందుకని తిలక్ వర్మ త్యాగం చేయక తప్పదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మూడో టీ 20లో మెరుపులు మెరిపించాలని తిలక్ వర్మ గట్టి పట్టుదలగా ఉన్నాడు. దీంతో ఐదో స్థానం కోసం తిలక్ వర్మ, అయ్యర్ మధ్య పోటీ నడుస్తోంది. మరోవైపు ఇదే ఊపులో సిరీస్ నెగ్గాలని ఇండియా భావిస్తోంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×