EPAPER

IPL 2023 | ఐపీఎల్‌లో రకరకాల ట్విస్టులు.. హార్దిక్ ను వదులుకోని గుజరాత్ టైటాన్స్

IPL 2023 | ఇంకేం ఉంది…హార్దిక్ ముంబయికి వెళ్లిపోతున్నాడు. ఇంకేం లేదు. రూ.15 కోట్ల డీల్ అయిపోయింది. శుభ్ మన్ గిల్ కెప్టెన్ అని, అదీ ఇదని తెగ వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. అదంతా శుద్ధ అబద్ధమని తేలిపోయింది. పాండ్యానే కొనసాగిస్తున్నట్టు గుజరాత్ టైటాన్స్ పేర్కొంది. అలాగే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, వృద్ధిమాన్ సాహాను తన దగ్గరే ఉంచుకుంది. కానీ తెలుగు వికెట్ కీపర్ కేఎస్ భరత్ ను మాత్రం రిలీజ్ చేసింది.

IPL 2023 | ఐపీఎల్‌లో రకరకాల ట్విస్టులు.. హార్దిక్ ను వదులుకోని గుజరాత్ టైటాన్స్

IPL 2023 | ఇంకేం ఉంది…హార్దిక్ ముంబయికి వెళ్లిపోతున్నాడు. ఇంకేం లేదు. రూ.15 కోట్ల డీల్ అయిపోయింది. శుభ్ మన్ గిల్ కెప్టెన్ అని, అదీ ఇదని తెగ వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. అదంతా శుద్ధ అబద్ధమని తేలిపోయింది. పాండ్యానే కొనసాగిస్తున్నట్టు గుజరాత్ టైటాన్స్ పేర్కొంది. అలాగే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, వృద్ధిమాన్ సాహాను తన దగ్గరే ఉంచుకుంది. కానీ తెలుగు వికెట్ కీపర్ కేఎస్ భరత్ ను మాత్రం రిలీజ్ చేసింది.


గుజరాత్ టైటాన్స్ మార్పులు చేర్పులు
తెలుగు వికెట్ కీపర్ కేఎష్ భరత్‌తోపాటు.. యశ్ దయాల్, యువ పేసర్ శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సాంగ్వాన్, ఓడియన్ స్మిత్, అల్జరీ జోసెఫ్, దసున్ షనక‌‌ను గుజరాత్ టైటాన్స్ విడుదల చేసింది.

ఆరుగురు ప్లేయర్లను వదిలేసిన సన్ రైజర్స్ హైదరాబాద్..


అత్యధికంగా ధర 13.25కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌తో పాటుగా కార్తీక్ త్యాగి, సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ శర్మ, అకేల్ హోస్సేన్, అదిల్ హోస్సేన్ లను ఎస్ఆర్‌హెచ్ రిలీజ్ చేసింది.

కోల్ కతా నైట్ రైడర్స్: గంభీర్ వెళ్లాడు..12 మందిని లేపేశాడు.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఏకంగా 11 మంది ఆటగాళ్లను ఆ ఫ్రాంచైజీ వేలానికి వదిలేసింది. రిలీ రూసో, మనీష్ పాండే, ఫిల్ సాల్ట్ తదితర ఆటగాళ్లను ఢిల్లీ రిలీజ్ చేసింది.

9మందిని విడుదల చేసిన రాజస్థాన్ రాయల్స్
జో రూట్, జేసన్ హోల్డర్ సహా 9 మంది ఆటగాళ్లను రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసింది. పంజాబ్ కింగ్స్ షారుక్ ఖాన్‌ను రిలీజ్ చేసింది

పంజాబ్ కింగ్స్ నుంచి పాంచ్ పటాకా

5 గురిని వదిలేశారు. మోహత్ రాథీ, అగద్ బవా, బాల్తేజ్ ధందా, షారూఖ్ ఖాన్, భానుక రాజపక్సే

చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని: 8 మందిని వదిలేశారు…

వచ్చే సీజన్లో కూడా మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. అంబటి రాయుడు (రిటైర్మెంట్) స్టోక్స్ సహా 8 మంది ఆటగాళ్లను సీఎస్కే విడుదల చేసింది. ప్రిటోరియస్, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, సిసింద మగల, జేమీసన్, సేనాపతి, ఆకాశ్ సింగ్

లఖ్ నవూ సూపర్ జెయింట్స్ 8మంది అవుట్
డేనియల్ సామ్స్, జయదేవ్ ఉనద్కత్, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, అర్పిత్ గులేరియా, మనన్ వోహ్రా, సూర్యాన్ష్ షేడ్జే, కరుణ్ నాయర్

గుజరాత్ టైటాన్స్ నుంచి 8 మంది వెనక్కి…

శివమ్ మాన్వి, ఉర్విల్ పటేల్, పరదీప్ సంగ్వాన్, ఓడియన్ స్మిత్,  డాసున్ శనక, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, కేఎస్ భరత్ (తెలుగు కుర్రాడు),

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మందిని పంపించారు

కేదార్ జాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, సోనూ యాదవ్,
డేవిడ్ విల్లే, వేన్ పార్నల్, ఫిన్ ఆలెన్, హర్షల్ పటేల్, జోష్ హేజిల్ వుడ్, వనిందు హసరంగ, మైఖేల్ బ్రేస్ వెల్

ముంబయి ఇండియన్స్ నుంచి 11 మంది బయటకి..

సందీప్ వారియర్, రిలే మెరిడత్, క్రిస్ జోర్ధాన్, జాన్ సెన్, రిచర్డ్ సన్, జోఫ్రా అర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, హృతిక్ షోకీస్, రాఘవ్ గోయల్ , మహ్మద్ అర్షద్ ఖాన్, రమణ్ దీప్ సింగ్

ఇలా వీరందరూ మళ్లీ వేలంలోకి వెళతారు. డిసెంబర్ 19న వేలం జరగనుంది. అప్పుడు ఎవరు, ఎవరిని తీసుకుంటారనేది తేలిపోతుంది.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×