EPAPER

Kodandaram : ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే.. మేమంతా కొట్లాడి తెలంగాణ తెచ్చాం : కోదండరామ్

Kodandaram | ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేసిన మిలియన్ మార్చ్‌కు కేసీఆర్ చివరి నిమిషంలో వచ్చారని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో “10 ఏళ్ల తెలంగాణ – ప్రజల ఆకాంక్షలు – కర్తవ్యాలు” అనే సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సదస్సులో కోదండరామ్ హాజరయ్యారు.

Kodandaram : ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే.. మేమంతా కొట్లాడి తెలంగాణ తెచ్చాం : కోదండరామ్
Prof Kodandaram Comments

Prof Kodandaram Comments(Today news in telangana):

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేసిన మిలియన్ మార్చ్‌కు కేసీఆర్ చివరి నిమిషంలో వచ్చారని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో “10 ఏళ్ల తెలంగాణ – ప్రజల ఆకాంక్షలు – కర్తవ్యాలు” అనే సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సదస్సులో కోదండరామ్ హాజరయ్యారు.


కోదండరామ్ సదస్సులో మాట్లాడుతూ.. “ఉద్యమంలో భాగంగా పెద్ద స్థాయిలో నిర్వహించిన సకల జనుల సమ్మెలో కేసీఆర్ కనీసం ఒక గంట కూడా మాట్లాడలేదు. మరోసారి సాగరహారం కార్యక్రమ సమయంలో కేసీఆర్ అక్కడ లేడు, ఢిల్లీలో ఉన్నాడు. సాగరహారం ఆపేయాలని కేసీఆర్ నాపై ఎన్నోరకాల ఒత్తిడి తెచ్చాడు. ఆరోజు సాగరహారం ఆపి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు.

కేసీఆర్ ఆ రోజు రాకపోవడమే మంచిదైంది. తెలంగాణను కేవలం కేసీఆర్ తెచ్చారని అబద్ధాలు చెబుతున్నారు. ఆయన చావు నోట్లో తలపెడితేనే తెలంగాణ వచ్చిందని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. మరి అమరుల త్యాగం, నల్గొండలో జేఏసీ టెంట్ వేసి చేసిన ధర్నా, బస్సులు ఆపిన ఆర్టీసీ కార్మికులు, సింగరేణి సమ్మె అన్ని అబద్దమేనా?. మేం కోట్లడితే తెలంగాణ వచ్చింది. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇంట్లో కుర్చుంటే.. మేమంతా కోట్లడి తెలంగాణ తీసుకొచ్చాము. ధరణి పోర్టల్ వల్ల చాలా నష్టపోయారు. ధరణి రాకముందు తెలంగాణలో 30 వేల రెవెన్యూ సమస్యలు ఉంటే.. ధరణి పోర్టల్ వచ్చాక ఆ సంఖ్య 20 లక్షలకు చేరింది. దీనిని బట్టి ధరణి ఎంత గొప్పదో ఆలోచన చేయాలి. ధరణిలో తప్పుడు ఎంట్రీలు చేశారు, వాటిని సరిచేసే అధికారం కలెక్టర్, ఎమ్మార్వోలకు కూడా లేదు, కేవలం హైదరాబాద్‌లోని సీసీఎల్ఏకు మాత్రమే మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రజలకు మేలు జరగాలంటే తెలంగాణలో ప్రభుత్వం మారాలి,” అని అభిప్రాయపడ్డారు.


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×