EPAPER

Angkor Wat : 8వ వింత.. ఆ విష్ణు ఆలయం

Angkor Wat  : 8వ వింత.. ఆ విష్ణు ఆలయం
Angkor Wat Temple

Angkor Wat : ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, విశాలమైనది ఆంగ్‌కార్ వాట్ ఆలయం. కంబోడియాలోని ఈ హిందూ ఆలయం ఇప్పుడు ప్రపంచంలో ఎనిమిదో వింతగా నిలిచింది. 8వ వింత అనేది అనధికారికంగా ఇచ్చే టైటిల్. కొత్త భవనాలు, కట్టడాలు, ప్రాజెక్టులు, వ్యక్తులు ఎవరికైనా ఈ హోదా ఇవ్వొచ్చు. ప్రపంచంలోని ఏడు వింతలతో
పోల్చిచూసేందుకు ఈ టైటిల్ ఇస్తుంటారు. ఇటలీ పాంపీ నగరాన్ని పక్కకునెట్టి తాజాగా ఈ టైటిల్‌ను ఆంగ్‌కార్ వాట్ ఆలయం దక్కించుకుంది.


కంబోడియా నడిబొడ్డున ఉన్న ఆంగ్‌కార్ వాట్ వద్ద నిర్మితమైన ఈ ఆలయానికి 600 ఏళ్లు. ఇదో అతి పెద్ద ఆలయ కాంప్లెక్స్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా ఇప్పటికే గుర్తింపు ఉంది. శతాబ్దాల నాటి సంస్కృతికి ఈ గుడి వారసత్వంగా నిలుస్తోంది. అందుకే ఈ గుడికి తమ దేశ పతాకంలోనూ స్థానం కల్పించింది కంబోడియా ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి ఏడాది పొడవునా పోటెత్తుతూనే ఉంటారు. వాస్తవానికి ఇది విష్ణు ఆలయం. కాలక్రమంలో బౌద్ధవులకూ ఆలయమైంది. ఎనిమిది చేతులతో ఇక్కడున్న విష్ణువు విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

రెండో సూర్యవర్మన్ రాజు కాలంలో.. అంటే 12వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమైంది. గుడికి నాలుగు వైపులా దాదాపు 400 అడుగుల వెడల్పుతో కందకం లాంటిది ఏర్పాటు చేశారు. నిత్యం నీళ్లుండే దీనిని దాటేందుకు బ్రిడ్జిని నిర్మించారు. ఆలయానికి వెయ్యి అడుగుల వెడల్పైన ద్వారం ఉంది.


ఆంగ్‌కార్ వాట్ ఆలయం 8వ వింతగా నిలవడానికి ప్రధాన కారణం దాని నిర్మాణ శైలే. 500 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాలను నిర్మించారు. టెంపుల్ కాంప్లెక్స్ మధ్య భాగంలో కలువల ఆకారంలో ఐదు భారీ టవర్లు మేరుపర్వతానికి ప్రతీకలా కనిపిస్తాయి. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా గోడలపై పురాణేతిహాసాలకు సంబంధించిన ఎన్నో శిల్పాలను చెక్కారు. మహాభారతం, బలిచక్రవర్తి, సముద్రమథనం, స్వర్గ నరకాలు, దేవదానవుల యుద్దం వంటి ఘట్టాలు వీటిలో కొన్ని.

ఆంగ్‌కార్ వాట్ ఆలయం వద్ద సూర్యోదయాన్ని.. నాలుగు భారీ టవర్ల మధ్య నుంచి చూడటం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని కలగజేస్తుంది. తూరుపువెలుగులు ప్రసరిస్తుండగా.. ఆలయం పింక్, ఆరెంజ్, గోల్డ్ వర్ణాల్లో మెరిసిపోతుంటుంది.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×