EPAPER
Kirrak Couples Episode 1

BRS Party MLAs : ప్రజలను బూతులు తిడుతున్నారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అసహనం అందుకేనా..?

BRS Party MLAs : ప్రజలను బూతులు తిడుతున్నారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అసహనం అందుకేనా..?

BRS Party MLAs : తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. మరో ఐదురోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహనం కోల్పోతున్నారు. ప్రజలు హామీల గురించి ప్రశ్నిస్తుంటే,  వారిని పట్టుకుని ప్రజల మధ్యే పచ్చి బూతులు తిడుతున్నారు. ‘మేము ఇచ్చే పింఛన్ పైసలతో బతుకుతూ.. మమ్మల్ని నిలదీస్తారా.. మీకు ఎంతిచ్చినా విశ్వాసం లేదని ప్రజలపై మండిపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి.


చేతిలో మైకు ఉంది, అది అందరికీ వినిపిస్తుందనే స్పృహ కూడా లేకుండా మైక్ పట్టుకునే ప్రచార సభల్లో తిట్టిపోస్తున్నారు. అది మామూలు తిట్లయితే పర్వాలేదు. పచ్చి బూతులు తిడుతున్నారు. నాయకులనైతే పర్వాలేదు. ఒకరినొకరు ఎన్ని బూతులు తిట్టుకున్నా పర్వాలేదు. అదెవరకి ఫరక్ లేదు. కానీ ఓట్లు వేసే ప్రజలనే తిడుతున్నారు. వాళ్లు ఓట్లేస్తేనే కదా.. రేపు అధికారంలో ఉండేది.. కనీసం ఆ ఇంగిత జ్నానం కూడా మరిచిపోతున్నారు. వీళ్లిలా నోటికొచ్చినట్టు తిడుతుండేసరికి ప్రజలు కూడా రెచ్చిపోతున్నారు. మీకు మూడిందిలే అని హెచ్చరిస్తున్నారు.

ఇంత ఘనంగా తిడుతున్న వారెవరంటే…
అచ్చంపేట అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల గంగరాజు ప్రచార సభలో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి వెనుక నుంచి మాట్లాడుతూ ముందిచ్చిన హామీలు ఏమయ్యాయి? అని అడిగాడు. ఆ మాటలు విన్న గువ్వల గంగరాజుకి బీపీ నషాలానికి అంటింది.
 ‘ఇక్కడ్నుంచి ఫో. చల్ హట్. నడుబే.. వాడ్ని పంపియ్యండి. యూజ్ లెస్ ఫెల్లో’ అంటూ సదరు వ్యక్తిపై అనుచిత పదజాలాన్ని ఉపయోగించి దూషించారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఎమ్మెల్యేగా ఉండి సౌమ్యంగా సమాధానం చెప్పాల్సింది పోయి.. ఇలా దూషించడం సరికాదని అంటున్నారు. ఇటీవల గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే.


రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు తీవ్ర అవమానం జరిగింది. సీసీరోడ్లు అన్నావ్, మంచినీళ్లన్నావ్, అంతన్నావ్, ఇంతన్నావ్, చివరి గుండు సున్నా చేశావ్.. చేసింది చూలు, నిన్ను చూసింది చాలు.. వెంటనే నువ్విక్కడ నుంచి వెళ్లకపోతే చెప్పుతో కొడతాం అనేసరికి ఆయనకి ఎక్కడో కాలింది.

వెంటనే పదిమందిలోనే యువకులను నోటికొచ్చినట్టు తిట్టేశారు. అది కూడా మధ్యమధ్యలో బూతులతో కలిపి తిట్టేసరికి మసాలా ఎక్కువైపోయింది. దాంతో రషీద్ గూడ గ్రామస్తులు ఎమ్మెల్యేపై పీకల వరకు కోపంతో ఉన్నారు. ఇది ఎన్నికల్లో ఆయనకి పెద్ద మైనస్ అయ్యేలా ఉంది.

ఇటీవల నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఏకంగా మహిళా తహసీల్దార్ పై బూతు పురాణం పెద్ద వివాదాస్పదమైంది. మహిళని కూడా చూడకుండా ఆయన వ్యవహరించిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలు హామీల గురించి అడుగుతుంటే మీరంతా ఏంచేస్తున్నారని అందరిలో ఆమెను తిట్టిపోశారు. తన తప్పేమీ లేదు, అంతా అధికారులదేనని బిల్డప్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయమని అధికారులు అంటున్నారు. పైనుంచి రాకపోతే మేమేం చేస్తామని అంటున్నారు.

మంత్రి మల్లారెడ్డిని కూడా పలుచోట్ల రానివ్వడం లేదు. దాంతో ఆయన తనతో ఉన్న అత్యుత్సాహంతో ఎదురుదాడికి దిగుతున్నారు. పోలీసులు ఆగండి బాబూ.. అంటూ పట్టుకుని వెనక్కి తీసుకువెళుతున్నారు. ఇక దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి కూడా బతుకమ్మ చీరల పంపిణీ దగ్గర సహనం కోల్పోయి ఒక మహిళా ప్రజాప్రతినిధిపై నోరు పారేసుకున్నారు. ఈ ఘటనను చిత్రీకరించిన మీడియాపై కూడా చిందులు తొక్కారు.

రోజురోజుకు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను అధికార పార్టీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు.  పాలమూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక నియోజకవర్గంలో చూసి ఒకచోట ప్రజలు రివర్స్ అవుతున్నారు. ఇది ఒక మాస్ హిస్టీరియాగా మారేలా ఉందని బీఆర్ఎస్ పార్టీ ఆందోళనగా ఉంది.

అటు కాంగ్రెస్ కి కర్ణాటక గాలి, ఇటు అధికారపార్టీపై వ్యతిరేకత నుంచి వచ్చే గాలి తోడైతే కాంగ్రెస్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తుందని అంటున్నారు.

Related News

Key Alert: హైదరాబాద్ వాసులకు కీలక అలర్ట్.. ఏ క్షణంలోనైనా నగరంలో..

Kakatiya University: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌‌ సస్పెండ్!

KTR: దోచుకోవడానికి తప్ప ఈ ప్రాజెక్ట్ ఎందుకు? : కేటీఆర్

Kishan Reddy: అప్పుడు ఆయన బెదిరించాడు.. ఇప్పుడు ఈయన బెదిరిస్తున్నాడు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

TPCC Chief: కేటీఆర్.. నువ్వు సోయి ఉండి మాట్లాడుతున్నావా? : మహేష్ కుమార్ గౌడ్

Alleti Maheshwar Reddy: మంత్రుల సొంత ఊళ్లలోనే రైతులకు అన్యాయం: ఏలేటి

Seethakka: కేటీఆర్.. నువ్వు మగాడివైతే.. రెచ్చిపోయిన సీతక్క

Big Stories

×