EPAPER

Qatar Death Sentence : మరణ శిక్ష పొందిన భారత నేవీ అధికారులకు.. ఖతర్ కోర్టులో ఊరట!

Qatar Death Sentence : ఖతర్ దేశంలోని ట్రయల్ కోర్టులో మరణ శిక్ష పొందిన 8 మంది భారత నేవీ అధికారులకు భారీ ఊరట లభించింది. ట్రయల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చేసిన అప్పీలును పైకోర్టు(ఖతర్ హైకోర్టు) స్వీకరించింది. భారత మాజీ నేవీ అధికారులు 8 మందిని గూఢాచర్యంలో కేసులో ఖతర్ కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే.

Qatar Death Sentence : మరణ శిక్ష పొందిన భారత నేవీ అధికారులకు.. ఖతర్ కోర్టులో ఊరట!

Qatar Death Sentence : ఖతర్ దేశంలోని ట్రయల్ కోర్టులో మరణ శిక్ష పొందిన 8 మంది భారత నేవీ అధికారులకు భారీ ఊరట లభించింది. ట్రయల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చేసిన అప్పీలును పైకోర్టు(ఖతర్ హైకోర్టు) స్వీకరించింది. భారత మాజీ నేవీ అధికారులు 8 మందిని గూఢాచర్యంలో కేసులో ఖతర్ కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే.


ఈ కేసులో ఖతర్ కోర్టు పూర్తి వివరాలు బహిర్గతం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే భారత నేవీ అధికారుల మరణ శిక్షని వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వం ఖతర్ పైకోర్టులో ఈ అప్పీలు చేసింది. నవంబర్ 23న పైకోర్టు ఈ అప్పీలును స్వీకరించి త్వరలోనే విచారణ ప్రారంభం చేయనుందని సమాచారం.

భారత మాజీ నేవీ అధికారులకు మరణ శిక్ష ఎందుకు?
ఖతర్ దేశ ప్రభుత్వం కొనేళ్ల క్రితం తన నేవీ సైనిక విభాగాన్ని బలపరుచుకునేందుకు దహరా గ్లోబల్ టెక్నాలజీ అండ్ కనసల్టెన్సీ అనే కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చింది. అయితే దహరా కంపెనీలో భారత దేశానికి చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులు ఉద్యోగం చేస్తున్నారు. వీరంతా భారత నేవీలో ఉన్నత పదవులలో ఉద్యోగం చేసినవారు. ఈ అధికారులు ఖతర్ నేవీకి సంబంధించి సైనికులకు శిక్షణ ఇవ్వడం. ఖతర్ దేశం కొనుగోలు చేసే నేవీ పరికరాలను పరీక్షించడం వంటి పనులు చేస్తారు.


ఈ నేపథ్యంలో ఖతర్ దేశం ఒక అత్యాధునిక టెక్నాలజీ కలిగిన సబ్ మెరైన్(జలాంతర్గామి- నీటి లోపల ఉండే యుద్ధ పడవ)ని కొనుగోలు చేసేందుకు ఇటలీ దేశంతో రహస్య చర్చలు జరిపింది. ఆ టెక్నాలజీ వల్ల సబ్ మెరైన్‌ని శత్రు దేశాలు కనిపెట్టలేవు. ఇంత రహస్య టెక్నాలజీ వివరాలు ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో ఒక వార్తా సంస్థ ఫొటోలతో సహా ప్రచురించింది. ఆ ఫొటోలు రహస్య చర్చల సమయంలో తీసినవిగా సమాచారం. దీంతో ఖతర్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

వెంటనే ఇదంతా ఎవరు చేశారని చేసిన విచారణలో ఆ చర్చల సమయంలో భారత నేవీ అధికారులు కూడా ఉండడంతో వారిని 2022 ఆగస్టున అరెస్టు చేసింది. దహరా కంపెనీతో లావాదేవీలను రద్దు చేసింది. దహరా కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన ఖతర్ ఉన్నతాధికారిని కూడా పదవి నుంచి తొలగించింది. దహరా కంపెనీ యజమానిని కూడా అరెస్టు చేసింది. ఆ తరువాత భారత అధికారులపై లోతుగా విచారణ చేసి నేరం రుజువు కావడంతో వారికి అక్టోబర్ 26, 2023న మరణ శిక్ష విధించింది. ఈ సమాచారం భారత దేశంలో కలకలం రేపింది.

భారత విదేశాంగ శాఖ ఖతర్ దేశ అధికారులతో చర్చలు జరిపి.. వారి మరణ శిక్షకు వ్యతిరేకంగా పైకోర్టులో అప్పీలు చేసింది. ఇంతకాలంపాటు ఆ అధికారులకు మరణ శిక్ష తప్పదనే వాదనులు వినిపించాయి. అయితే ఇప్పుడు ఖతర్ పై కోర్టు అప్పీలు స్వీకరించి త్వరలోనే విచారణ చేపడతామని చెప్పడంతో మరణ శిక్ష పడిన భారత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఖతర్ దేశ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. హత్య నేరం రుజువైతే మరణ శిక్ష.. దొంగతనం చేసిన వారికి కాళ్లు.. చేతులు నరికివేయడం, దేశానికి వ్యతిరేకంగా గూఢాచర్యం చేస్తే మరణ శిక్ష తప్పనిసరి.. కానీ గూఢాచర్యం కేసులో కోర్టుల్లో మరణ శిక్ష రద్దుకాకపోతే.. భారతదేశంతో ఉన్న మంచి సంబంధాల చూపుతూ.. మన ప్రభుత్వం చర్చలు జరిపి చివరి అవకాశంగా ఖతర్ రాజు వారికి క్షమాభిక్ష పెట్టే అవకాశాలున్నాయి.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×