EPAPER

 Sound Party Movie Review : సాలిడ్ ఫన్ రైడ్.. మోత మోగిస్తున్న సౌండ్ పార్టీ..

 Sound Party Movie Review : సాలిడ్ ఫన్ రైడ్.. మోత మోగిస్తున్న సౌండ్ పార్టీ..
Sound Party Movie Review

Sound Party Movie Review : సౌండ్ పార్టీ.. ప్రమోషన్స్ తో బాగా సౌండ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం కామెడీ యాంగిల్ లో ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్లకు ఈరోజు వచ్చేసింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందోతెలుసుకుందాం.


మూవీ: సౌండ్ పార్టీ

నటీనటులు: వీజే సన్నీ, శివన్నారాయణ, ఆలీ, సప్తగిరి, చలాకీ చంటీ, 30 Years పృథ్వీ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, రేఖ పర్వతాల 


రచన, డైరెక్టర్: సంజయ్ శేరి

నిర్మాతలు: రవి పోలిశెట్టి , మహేంద్ర గజేందర్, శ్రీ శ్యామ్ గజేంద్ర

సమర్పణ : పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్

మ్యూజిక్: మోహిత్ రెహమానిక్

సినిమాటోగ్రఫి: శ్రీనివాస్ రెడ్డి

రిలీజ్ డేట్: 24-11-2023

స్టోరీ:

తాతలు ముత్తాతలు బాగా సంపాదించి పెడితే ఎటువంటి కష్టం లేకుండా సాలిడ్ గా సౌండ్ పార్టీగా బతికేయొచ్చు అని కలలు కనే డాలర్ కుమార్ (వీజే సన్నీ) .కలలు కంటారే తప్ప కూర్చున్న చోట నుంచి కదలకుండా డబ్బులు రావాలి అని ఆలోచిస్తూ కాలం గడుపుతారు. అయితే జనరేషన్ తర్వాత జనరేషన్ ఇదే ఆలోచనతో గడిపేస్తూ వస్తుంటారు కానీ డబ్బు మాత్రం సంపాదించలేక పోతారు. ఈ నేపథ్యంలో డాలర్ కుమార్..తండ్రి తో కలిసి డబ్బు సంపాదించాలి అని గట్టిగా ఆలోచించి 30 లక్షలు అప్పు చేసి మరి గోరుముద్ద అనే హోటల్ ని స్టార్ట్ చేస్తాడు.

ప్రారంభంలో అది బాగానే ఉన్నా.. డాలర్ కుమార్ ప్రేమించిన సిరి(హృతిక శ్రీనివాస్‌) నాన్న కారణంగా హోటల్ మూత పడిపోతుంది. దీంతో రోడ్డున పడ్డ ఆ ఇద్దరు తండ్రీ కొడుకులు పీకల్లోకి అప్పులో కూరుకుపోతారు.. డబ్బు తిరిగి ఇవ్వమని సేటు నాగభూషణం (నాగిరెడ్డి)తెగ ఒత్తిడి చేస్తాడు. మరోపక్క ఎమ్మెల్యే వరప్రసాద్ (పృథ్వీ) కొడుకు భువన్‌ ఒక అమ్మాయి రేపు కేసులో ఇరుక్కుంటాడు. కొడుకుని ఎలాగైనా తప్పించాలి అనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యే ఈ తండ్రి కొడుకులకు రెండు నెలలు జైలుకు వెళ్తే రెండు కోట్లు ఇస్తానని చెప్పి అసలు కేసు గురించి చెప్పకుండా వాళ్ళని అందులో ఇరికిస్తాడు. ఇంతకీ ఈ తండ్రి కొడుకులు ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? కోటీశ్వరులు కావాలి అన్న వాళ్ళ కోరిక లాస్ట్ కైనా తీరిందా? తెలుసుకోవాలి అంటే స్టోరీ చూడాల్సిందే.

విశ్లేషణ:

శివ నారాయణమూర్తి లాంటి సీనియర్ యాక్టర్ తో కలిసినా బిగ్ బాస్ వీజే సన్నీ స్క్రీన్ మీద మంచి కామెడీ పండించాడు. పర్ఫెక్ట్ టైమింగ్ తో వీళ్ళ హ్యూమర్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కామెడీతో పాటుగా ఈ మూవీలో మంచి రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి.

డబ్బు సంపాదించాలి అనే ఆశతో.. మిడిమిడి జ్ఞానంతో హీరో..హీరో తండ్రి చేసే కొన్ని సీన్స్ కామెడీగా ఉంటాయి. కానీ బాగా గమనిస్తే సౌండ్ పార్టీతో డైరెక్టర్ డబ్బు అడ్డదారుల్లో సంపాదిస్తే ఎప్పటికైనా ప్రమాదమే అనే సౌండ్ స్లోగన్ ను బాగా గట్టిగా వినిపించాడు అని అర్థం అవుతుంది.

చివరి మాట:

 లాజిక్ పక్కన పెట్టి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ మూవీ మంచి కామెడీ ఓరియంటెడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కష్టపడకుండానే డబ్బు వచ్చి ఒళ్లో పడిపోవాలి అనుకునే ఓ ఫ్యామిలీ స్టొరీ ఇది.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×