EPAPER

KCR : ఏమయ్యా.. ఏ పేపర్ నీది? ఏ ఛానల్ నీది? జర్నలిస్టులంటే కేసీఆర్‌కు చులకనా?

KCR : ఏమయ్యా.. ఏ పేపర్ నీది? ఏ ఛానల్ నీది? జర్నలిస్టులంటే కేసీఆర్‌కు చులకనా?
journalists

KCR : 2014 సెప్టెంబరు, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎవరైనా పరిమితులు దాటితే “మిమ్మల్ని (జర్నలిస్టులను) 10 కి.మీ భూమికింద పాతిపెడతా. మీ మెడలు విరిచి పక్కన పడేస్తాను. అని వార్నింగ్ ఇచ్చారు.


కోవిడ్ సమయంలో మెడికల్ కిట్లు లేవు, ప్రజలు చనిపోతున్నారని జర్నలిస్టులు అడిగిన పాపానికి.. కేసీఆర్ సమాధానం ఏమిటంటే.. ‘మావద్ద సరిపోయినన్నికిట్లు లేవన్న సంగతి మీకు తెలుసా? మీరొచ్చి చూశారా? అరే.. మేం మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతుంటే.. మీరు వైద్యుల్లో, సిబ్బందిలో భయాన్ని రేకెత్తిస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. అని ప్రముఖ దినపత్రిక విలేకరిని హెచ్చరించారు.

ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ వివాదంపై అడిగిన ప్రశ్నకు ఆ విలేకరిపై ఎదురుదాడికి దిగారు. నువ్వు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నావ్.. ‘కేసీఆర్ ను ఎదుర్కోలేవు జాగ్రత్త’ అని హెచ్చరించారు.


దీనిపై రాష్ట్ర జర్నలిస్టుల సంఘం నిరసన తెలిపింది. ఇలా  సీఎం స్థాయి వ్యక్తి విలేకరులను బెదిరించడం సరికాదని ఒక ప్రకటనలో తెలిపింది. లేదంటే విలేకరుల సమావేశాల్లో ప్రశ్నలు వినడానికి ఇష్టపడకపోతే, నో కామెంట్ అని చెప్పొచ్చు అని ఒక సలహా ఇచ్చింది.

తెలంగాణలో ఇలా చెప్పుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చట్లు చాలానే ఉంటాయి. మొదట్లో విలేకరుల సమావేశాల్లో సీరియస్ అయ్యేవారు. తర్వాత బెదిరించేవారు. ఇక లాభం లేదని పదిమందిలో బద్ నామ్ చేయడం మొదలు పెట్టారు. నలుగురిలోనే వారిని అవమానించడం, వారిపై జోక్స్ వేయడం చేసేవారు.

జర్నలిస్టుల విలువను తగ్గించి మాట్లాడటంలో కేసీఆర్ ను మించినోళ్లు లేరని కూడా అంటారు. ఒక సీఎం స్థాయిలో నాయకుడే అలా మాట్లాడితే ఇంక జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు? ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అనేది సామెత. వాళ్లు ఇంకా నాలుగడుగులు ముందుకేసి..
‘ఏం రాస్కుంటారో రాస్కోండ్రి.. మాకేమైనా భయమా’ అనే స్థితికి వెళ్లిన సందర్భాలున్నాయని అంటారు.

సరే, ఇంతకీ సమావేశాల్లో విలేకరులతో కేసీఆర్ మాట్లాడే తీరు ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం..

విలేకరి: సర్! అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి మాట్లాడారు?
కేసీఆర్: ఏంవయ్యా.. మనం ఇప్పుడు దేని గురించి మాటాడుకోడానికి వచ్చినం.. నేను చెప్పేది పూర్తిగా వింటవా.. లేదా?
విలేకరి: అదేసార్.. ఆరోజు..
కేసీఆర్: మళ్లీ అదేంటావ్.. అరే.. నే జేప్పేది పూర్తిగా ఇనవయ్యా సామీ..
విలేకరి: అది కాద్సార్..
కేసీఆర్: మళ్లీ అదే మాట.. అసలు నేనేం జెప్పిన, రాజ్యాంగం మార్చాలని  జెప్పినానా? లేక అంబేద్కర్ గురించి చెప్పినానా?.. లేకపోతే నేను రాస్తానని చెప్పినానా?
పోనీ నువ్వు రాయ్.. నువ్వు వార్తలవీ రాస్తావు కదా.. రాయ్!
ఏం రాస్తావో చూద్దం.. ఏం తమాషగా ఉందా?
అరే నేను సీఎం.. నాకెన్నో పనులుంటాయ్.. నేనేదో రాష్ట్ర డెవల్మప్ మెంట్ కి సంబంధించి ప్రజలకి ఒక మంచి మాట చెబుదామని పిలిచినా.. నాకు పనీ పాటా లేవనుకున్నారా.. మీతో ముచ్చట్లు పెట్టడానికి.. అక్కడెక్కడో అంబేద్కర్ గురించి చెబితే ఇక్కడ అడుగుతాడు. అచ్చా ఆరోజు నువ్వు రాలే..
విలేకరి: వచ్చాన్సార్
కేసీఆర్: నేనేం మాట్లాడినా.. వినలే…మళ్లీ రికార్డింగ్ ఉంటాది కదా.. విను.. అంటూ పక్కవాళ్లని చూసి.. అవుంటే ఆయనకివ్వండి
 అచ్చా.. ఏం పేపర్ వయ్యా నీది..
విలేకరి: పేపర్ కాద్సార్..
కేసీఆర్: మరి ఛానలా? అచ్చా.. ఏం టీవీ ఛానల్ అది? (నవ్వు)

ఇదీ వరస.. ఇలా విలేకరుల సమావేశంలో జర్నలిస్టులను జోకర్లను చేస్తూ, వారిమీద జోక్స్ వేస్తూ, నీ పేపర్ ఏంది? నీ ఛానల్ ఏంది? ఇలాంటి డైలాగులు వేస్తూ ఉద్యోగాలు చేసుకునే జర్నలిస్టులను భయపెడుతూ ఇన్నాళ్లూ నడిపించారనే విమర్శలైతే తీవ్రంగా ఉన్నాయి.

దీనికితోడు కేసీఆర్ పక్కన నిత్యం పదిమంది భజన బ్యాచ్ ఉంటారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆయన ఎదుటివారిని చులకన చేసి మాట్లాడగానే, ఈ బ్యాచ్ నవ్వాలి అన్నమాట. మళ్లీ వాళ్లవైపు చూస్తారు. అప్పుడు వారితో..‘‘ అవునా? కాదా? నే జెప్పింది’’ అంటారు. దీంతో వాళ్లకి అర్థమై వెంటనే నవ్వుతారు. ఇదండీ సంగతి..

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×