EPAPER

What’s App : వాట్సప్ లెక్కలు తెలిస్తే.. నోరెళ్ల బెట్టాల్సిందే..!

What’s App : వాట్సప్ లెక్కలు తెలిస్తే.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
What's App

What’s App : ఫోన్ వాడే వారందరికీ పరిచయమైన యాప్.. వాట్సప్. ఉదయం నిద్రలేవగానే.. గుడ్ మార్నింగ్ మెసేజ్ దగ్గర్నుంచి, రోజంతా జరిగే ఏ సమాచార మార్పిడికైనా నేడు ప్రపంచం వాడుతున్న తొలి యాప్ ఇదే. 2009లో కేవలం రూ. 1.17 కోట్ల పెట్టుబడితో ఓ మిత్రబృందం ప్రారంభించిన ఈ యాప్.. ఇంతింతై… వటుడింతై అన్నట్లుగా దశాబ్ద కాలంలో విస్తరించుకుంటూ పోయింది. నేడు.. ఒక్కరోజు వాట్సప్ సేవలు ఆగిపోతే.. కోట్ల వ్యాపారాలు తలకిందులయ్యేంతగా వృద్ధి చెందిన వాట్సప్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర గణాంకాలు మీకోసం..


ప్రపంచవ్యాప్తంగా 270 కోట్లమంది వాట్సప్‌ను వాడుతున్నారు. నెలకు కనీసం 230 కోట్ల సార్లు ఈ యాప్‌ను యూజర్లు ఓపెన్ చేస్తున్నారు.

ఒక రోజుకు కనీసం 17.5 కోట్ల మంది యూజర్లు దీని ద్వారా సమాచారాన్ని పంపుతుండగా, 5 కోట్ల వ్యాపార సంస్థలు దీని సాయంతో పనిని చక్కబెట్టుకుంటున్నాయి.


180 దేశాల్లో, 60 వేర్వేరు భాషల్లో వాట్సప్ తన సేవలను అందిస్తోంది. దీని యూజర్లలో 73% మంది ఆండ్రాయిడ్ ఫోన్లను, 22% మంది ఐఓఎస్ ఫోన్లు వాడుతున్నారు.

గూగుల్ ప్లే స్టో్ర్‌లోని ఉచిత యాప్స్‌లో ఆదరణపరంగా.. ఇది రెండవ స్థానంలో ఉండగా, డౌన్‌లోడ్స్ ప్రకారం 8వ స్థానంలో ఉంది.

వాట్సప్ యూజర్లలో భారతీయులే ముందున్నారు. ఏకంగా 54 కోట్లమంది మనోళ్లు వాట్సప్‌ని వాడుతున్నారు.

ఇంటర్‌నెట్ వాడేవారిలో 69% మంది వాట్సప్‌ను వాడుతుండగా, ఈ యాప్ యూజర్లలో 70% మంది రోజులో ఒక్కసారైనా దీనిని చూస్తున్నారు.

ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే.. వాట్సప్ 100 కోట్ల సందేశాలను డెలివరీ చేసి ప్రపంచాన్ని బిత్తరపోయేలా చేసింది.

2009 అక్టోబర్‌లో వాట్సప్ వ్యవస్థాపకులు.. బ్రియాన్ ఆక్టన్ , జాన్ కౌమ్, వారి మిత్రులు (మాజీ యాహూ మాజీ ఉద్యోగులు) క్రౌడ్ ఫండింగ్ ద్వారా పెట్టిన పెట్టుబడి రూ. 1.17 కోట్లు. అయితే.. 2014లో ఫేస్‌బుక్ రూ.1.23 లక్షల కోట్లకు దీనిని కొనుగోలు చేసింది. ఇందుకోసం ఫేస్‌బుక్ తన 1.4 లక్షల కోట్ల విలువైన షేర్లను వాట్సప్‌కు ఇచ్చింది.

ఫేస్‌బుక్ చేతికొచ్చే నాటికి 40 కోట్లుగా ఉన్న వాట్సప్ యూజర్ల సంఖ్య.. 2017 నాటికి 130 కోట్లకు చేరింది.

చైనా, ఇరాన్, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, క్యూబా, ఉత్తర కొరియా.. ఈ 6 దేశాలు వాట్సప్‌ను నిషేధించాయి.

2021లో వాట్సప్ కొత్త నిబంధనల కారణంగా.. 17% యూజర్లు దానిని తమ ఫోన్ల నుంచి తీసేశారు.

100 కోట్ల యూజర్ల కోసం.. పనిచేసే వాట్సప్ సంస్థలో పనిచేసే ఇంజనీర్ల సంఖ్య కేవలం.. 55 మంది మాత్రమేనంటే నమ్మాల్సిందే.

తాజా లెక్కల ప్రకారం.. వాట్సప్ ఒక్కరోజులో 14 వేల కోట్ల సందేశాలను డెలివరీ చేస్తోంది. అంటే.. గంటకు 583 కోట్లు, నిమిషానికి… 9.7 కోట్లు, సెకనుకు 16 లక్షల సందేశాలన్న మాట.

వాట్సప్ రోజువారీ ఆదాయం.. రూ.197.5 కోట్లు. ఈ లెక్కన దీని వార్షికాదాయం.. రూ. 72,102 కోట్లు.

గూగుల్ ప్లే స్టో్ర్‌ లెక్కల ప్రకారం.. వాట్సప్ యాప్ రేటింగ్ 4.1/5గా ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు నెలకు 19.4 గంటల పాటు వాట్సప్‌ను వాడుతున్నారు. ఈ లెక్కన రోజుకు 38 నిమిషాలైనా వాట్సప్ కోసం వెచ్చిస్తున్నారు.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×