EPAPER

Nirmala Sitharaman : కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్‌ అవినీతిపై విచారణ తప్పనిసరి

Nirmala Sitharaman : మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల ఊబిలో లాగేశారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఆమె మంగళవారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Nirmala Sitharaman : కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్‌ అవినీతిపై విచారణ తప్పనిసరి

Nirmala Sitharaman : మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల ఊబిలో లాగేశారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఆమె మంగళవారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.


ప్రచారంలో భాగంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… “జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చదువుకున్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణలో చాలా ముఖ్యమైనవి. ప్రజలు ఈ ఎన్నికల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ సర్కార్‌ అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. బీజేపీ గెలిస్తే బీసీ నేతను సీఎం చేసి తీరుతాం. ప్రధానమంత్రి మోదీ ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలపై ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. హైదరాబాద్ లాంటి నగరంలో నైపుణ్యం ఉన్న‌ యువతను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించడంలో విఫలమైంది. రాబోయే తరాలకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు భారంగా మారుతాయి. బీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు. అసలు డిప్యూటీ సీఎం రాజయ్యను 6 నెలలకే తొలగించారు. అక్షరాస్యతలో తెలంగాణ.. నేషనల్ యావరేజ్ కంటే వెనుకబడి ఉంది. ఎన్మికల‌ సమయంలో కేసీఆర్ ఇచ్చిన 3,116/- నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ? బీఆర్ఎస్ హయాంలో 6వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రధానమంత్రి మోదీని బూతులు తిట్టే ప్రభుత్వం తెలంగాణలో అవసరమా? జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభిస్తాం” అని ఆమె చెప్పారు.


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×