EPAPER

PM Modi : డ్రెస్సింగ్ రూమ్ లో ప్రధాని..ఆటగాళ్ల భావోద్వేగం

PM Modi : డ్రెస్సింగ్ రూమ్ లో ప్రధాని..ఆటగాళ్ల భావోద్వేగం
PM Modi in Indian dressings room

PM Modi : టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. మ్యాచ్ ఆసాంతం చూసిన తర్వాత ఫైనల్ లో గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకి ట్రోఫీ అందజేశారు. తర్వాత తిరిగి వెళ్లిపోకుండా ఒక బాధ్యత గల ప్రధానిగా భారత క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. ఒక్కసారి ఆయన్ని చూడగానే క్రికెటర్లు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. మహ్మద్ షమీ అయితే ప్రధానిని పట్టుకుని ఏడ్చాడు. సిరాజ్ కూడా భావోద్వేగాన్ని ఆపుకోలేక పోయాడు.


మోదీ వారిని ఓదార్చారు. గెలుపు ఓటములు ఆటలో సహజమని అన్నారు. ఇంతవరకు మీరు ఆడిన ఆట తీరుతో 140 కోట్ల మంది భారతీయుల మనసులను గెలుచుకున్నారని అన్నారు. అది చాలు అని అన్నారు. అలాంటి సమయంలో ఒక దేశ ప్రధాని క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లడం గ్రేట్ అయితే, నిరాశ, నిస్ప్రహల మధ్య కూరుకుపోయిన ప్లేయర్లకు మనో ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం మరింత గొప్ప విషయమని మోదీని కొనియాడుతున్నారు. మోదీ వెళ్లిన తర్వాత ఆటగాళ్లు ముఖం మీద చిరునవ్వు వచ్చింది. మనోధైర్యం పెరిగింది.

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వద్దకు మోదీ వచ్చిన విషయాన్ని భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ తమ ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఫోటోలు పోస్ట్ చేసిన ఇద్దరు క్రికెటర్లు.. డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వచ్చి ప్రోత్సాహం అందించినట్లు ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు.


2019లో చారిత్రాత్మక చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైందని అంతరిక్ష సంస్థ ప్రకటించింది. అది చూడటానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ విషయం తెలిసిన తర్వాత కంటతడి పెట్టుకుంటున్న ఇస్రో చీఫ్ కె శివన్‌ను ఓదార్చారు.ఆ స్ఫూర్తితో ఇస్రో సైంటిస్టులు రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్ 3 ప్రయోగించి సక్సెస్ అయ్యారు.

ఇప్పుడందరూ అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వచ్చే వరల్డ్ కప్ 2027 మనదేనని ఢంకా భజాయించి చెబుతున్నారు.

.

.

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×