EPAPER

World Cup Updates: విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్

World Cup Updates: విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
Virat Kohli latest news

Virat Kohli latest news(Cricket news today telugu):

వన్డే వరల్డ్ కప్ 2023లో టీమ్ ఇండియా కింగ్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. 11 మ్యాచ్ ల్లో 765 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.ఇంతకుముందు ఈ రికార్డ్ సచిన్ పేరు మీద ఉంది. 2003 వరల్డ్ కప్ లో సచిన్ 673 పరుగులు చేయడం విశేషం.


2023 వరల్డ్ కప్ భారతీయులకు ఒక గొప్ప జ్నాపకంగా మిగులుతుందని అనుకుంటే చేదు జ్నాపకంగా మారిపోయింది.
ఇంతవరకు తడబాటు లేకుండా ఆడి చివరి అడుగు జారింది. ఒక్కసారి పాతాళానికి లాగేసింది. 6 వికెట్ల తేడాతో ఇండియాపై ఆస్ట్రేలియా గెలిచి ఆరోసారి కప్ ని ఎగరేసుకుపోయింది.

అయినా సరే, కొన్ని అద్భుతమైన రికార్డులు టీమ్ ఇండియాకి దక్కాయి. వాటిలో ముఖ్యంగా కోహ్లీ 765 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఒకటి. మెగా టోర్నమెంట్ లో కింగ్ కోహ్లీ ఆస్ట్రేలియాపై 85, అఫ్ఘానిస్థాన్‌పై 55, పాకిస్థాన్‌తో 16,  బంగ్లాదేశ్‌పై 103, న్యూజిలాండ్‌ పై 95,  శ్రీలంకపై 88,  సౌతాఫ్రికా 101, నెదర్లాండ్స్‌తో 51, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో 117, ఇక చివరిగా ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 54 పరుగులు చేశాడు.


మొత్తంగా మెగా టోర్నమెంట్ లో 3 సెంచరీలతో పాటు.. 6 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఓ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఇప్పటివరకు జరిగిన టోర్నీల్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఆటగాళ్లు వీరే…
1992- మార్టిన్ క్రోవ్, 1996- సనత్ జయసూర్య, 1999- లాన్స్ క్లూసనర్
2003- సచిన్ టెండూల్కర్, 2007- గ్లెన్ మెక్ గ్రాత్, 2011- యువరాజ్ సింగ్, 2015- మిచెల్ స్టార్క్, 2019- కేన్ విలియమ్సన్, 2023- విరాట్ కోహ్లీ

మెగా టోర్నమెంట్ లో  అత్యధిక సిక్సర్లు (31) కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు.

అత్యధిక వికెట్ల వీరుడిగా మహమ్మద్ షమీ నిలిచాడు. టోర్నీలో తొలి నాలుగు మ్యాచుల్లో ఆడకపోయినా.. తర్వాత 7 మ్యాచుల్లోనే మహమ్మద్ షమీ 24 వికెట్లు తీశాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో షమీ 7/57 నమోదు చేశాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.

అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ నిలిచాడు. అఫ్ఘానిస్థాన్‌పై 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

నాలుగు సెంచరీలు చేసి, అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా క్వింటన్ డికాక్ నిలిచాడు.

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×