EPAPER

World Cup : ఆసీస్ సిక్సర్.. ఫైనల్ లో టీమిండియా ఓటమి..

World Cup : ఆసీస్ సిక్సర్.. ఫైనల్ లో టీమిండియా ఓటమి..

World Cup : 140 కోట్ల భారతీయుల ఆశలు ఫలించలేదు. టీమిండియా వరల్డ్ కప్ సాధించలేదు. వరుసగా 10 మ్యాచ్ ల్లో గెలిచిన రోహిత్ సేన ఫైనల్ లో తడబడింది.ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్ కప్ ను ముద్దాడాలన్న టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఆసీస్ ఆరోసారి వరల్డ్ కప్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.


241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి ఓవర్ నుంచే దూకుడిగా ఆడే ప్రయత్నం చేసింది. అయితే బుమ్రా , షమీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో డేవిడ్ వార్నర్ (7), మిచెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4) వెంటవెంటనే అవుట్ అయ్యారు. దీంతో ఆసీస్ జట్టు కష్టాల్లో పడింది. ఒక దశలో 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

అయితే ఆ తర్వాత సీన్ మారింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ గోడలా నిలబడ్డాడు. సెంచరీతో కదం తొక్కాడు. అతడికి మార్నస్ లబుషేన్ అండగా నిలిచాడు. 4వ వికెట్ తీసేందుకు టీమిండియా బౌలర్లు శతవిధాలా ప్రయత్నించారు. నాలుగో వికెట్ కు ట్రావిస్ హెడ్ (137, 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సులు), లబుషేన్ (58 నాటౌట్, 110 బంతుల్లో 4 ఫోర్లు) )192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసీస్ విజయానికి బాటలు వేశారు.


చివరికి విజయానికి 2 పరుగుల దూరంలో హెడ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికే మాక్స్ వెల్ (2 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. 43 ఓవర్లలోనే టార్గెట్ ను చేధించింది. భారత్ బౌలర్లలో బుమ్రా రెండు, షమీ, సిరాజ్ తలో వికెట్ తీశారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లీ ( 54), కేఎల్ రాహుల్ (66) రాణించారు. కానీ భారత్ బ్యాటర్లు నెమ్మెదిగా ఆడటంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచలేకపోయారు. టాస్ ఓడిపోవడమే భారత్ కొంపముంచింది.

ఆస్ట్రేలియా లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. టీమిండియాపై తొలి మ్యాచ్ లో , ఆ తర్వాత రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికాపై పరాజయం పాలైంది. అవే జట్లను నాకౌట్ మ్యాచ్ ల్లో ఓడించి ట్రోఫీని ముద్దాడింది. సెమీస్ లో సఫారీలపై అతికష్టంమీద గెలిచిన ఆస్ట్రేలియా.. ఫైనల్ మాత్రం భారత్ ను సునాయాసంగా ఓడించింది.

మొత్తంమీద ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్ సాధించింది. గతంలో 1987, 1999, 2003, 2007, 2015 లోనూ ఆసీస్ విశ్వవిజేతగా నిలిచింది. భారత్ వేదికగానే తొలిసారి 1987 వరల్డ్ కప్ సాధించిన ఆ జట్టు.. ఇప్పుడు మరోసారి టైటిల్ సాధించింది. భారత్ వేదికగా జరిగిన నాలుగు వరల్డ్ కప్ ల్లో రెండు ఆసీస్ సాధించింది. 1996లో శ్రీలంక, 2011లో టీమిండియా టైటిల్ కైవసం చేసుకున్నాయి. మొత్తంగా 13 ప్రపంచ కప్ లు జరగగా అందులో ఆస్ట్రేలియానే 6 సార్లు విజేతగా నిలవడం విశేషం. వెస్టిండీస్, భారత్ రెండేసిసార్లు, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ ఒక్కొక్కసారి విజేతగా నిలిచాయి.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×