EPAPER
Kirrak Couples Episode 1

Tollywood Heroines : విభిన్న పాత్రల్లో గ్లామరస్ బ్యూటీలు

Tollywood Heroines : విభిన్న పాత్రల్లో గ్లామరస్ బ్యూటీలు
Tollywood Heroines

Tollywood Heroines : హీరోయిన్స్‌ అంటే.. మనకు ముందుగా గుర్తొచ్చేది గ్లామర్ రోల్స్ మాత్రమే. అయితే, కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్​ చిత్రాలు పెరుగుతూ వస్తున్నాయి. ఎలాగైనా ప్రేక్షకుల ఆదరణ పొందాలని పవర్‌ఫుల్ పాత్రలతో పాటు నెగిటివ్ రోల్స్ చేయడానికైనా సై అంటున్నారు. అలా సినిమాల్లో పొలిటీషియన్లుగా నటించిన తారలెవరో చూద్దాం.


కస్టడీ
నాగచైతన్య మొదటి ద్విబాషా (తెలుగు, తమిళ) చిత్రమైన ‘కస్టడీ’లో ప్రియమణి ఒక బలమైన లేడీ సీఎంగా నెగిటివ్ రోల్‌‌ చేసింది. అప్పటి వరకు జర్నలిస్ట్ వంటి పాత్రలు చేస్తూ వస్తున్న ప్రియమణికి కస్టడీ సినిమాతో తాను ఏ పాత్రలో అయినా ఒదిగిపోగలను అని నిరూపించింది.

ధర్మయోగి
హీరో ధనుష్ నటించిన కోడి(తమిల్) సినిమా 2016లో ‘ధర్మయోగి’ పేరుతో తెలుగులో విడుదలైంది. ఇందులో త్రిష ఒక పొలిటీషియన్‌గా నెగిటివ్ షేడ్స్‌లో నటించింది. అప్పటి వరకు గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న త్రిష.. పూర్తిగా నెగిటివ్ రోల్‌లో మెప్పించింది.


సరైనోడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మాస్ అండ్ క్లాస్ మూవీ ‘సరైనోడు’. 2016లో విడుదలైన ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన కేథరిన్.. లేడీ ఎమ్మెల్యే పాత్రలో హీరోకు సపోర్టింగ్ పాత్రలో నటించి అదరగొట్టేసింది.

రిపబ్లిక్
సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్, డ్రామా చిత్రం ‘రిపబ్లిక్’. 2021లో విడుదలైన ఈ మూవీలో రమ్య కృష్ణ సీఎం పాత్రలో నటించింది. కేవలం అమ్మ పాత్రలే కాకుండా అప్పుడప్పుడు విరుచుకుపడే విలన్‌గా కూడా రమ్యకృష్ణ ప్రేక్షకులను మెప్పించింది.

Related News

Sathya Dev: సైడ్ అయ్యాడా? లేక వదిలేశారా..?

Jagapathi Babu: నీకు నాకు కొవ్వు ఎక్కువ.. మంచు వారసురాలిని పట్టుకొని అంత మాట అనేశాడు ఏంటి.. ?

Puri Jagannadh: ఇంటికొచ్చిన ఫ్యాన్స్ తో ముంబాయి నుంచి వీడియో కాల్ మాట్లాడిన పూరి జగన్నాథ్

Game Changer: బాబోయ్ రామ్ చరణ్ శంకర్ సాంగ్ ఇలా ఉంది ఏంటి ?

Nandamuri Balakrishna: నందమూరి వారసులు వారే.. తేల్చి చెప్పిన బాలయ్య

Balakrishna: అందరికీ లిమిట్స్ ఉంటాయి.. ఐఫా వేడుకల్లో మీడియాపై బాలకృష్ణ ఫైర్

Ajith : సినిమాలకు అజిత్ గుడ్ బై..? ఆ ఒక్కటే కారణమా?

Big Stories

×