EPAPER
Kirrak Couples Episode 1

Yuvraj Singh : ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అతనే: యూవీ

Yuvraj Singh :  ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అతనే: యూవీ
Yuvraj Singh

Yuvraj Singh : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి అందరూ మెంటల్ గా సిద్ధమైపోయారు. అంతేకాదు అవార్డుల విషయంలో రకరకాల చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు ఎవరికిస్తారనే దానిపై నెట్టింట పెద్ద డిబేటే జరుగుతోంది. ముఖ్యంగా మూడు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో మొదటిది విరాట్ కొహ్లీ, రెండు రోహిత్ శర్మ, మూడు మహ్మద్ షమీ.. మీ ఓటు ఎవరికి అంటూ ఒకటే హంగామా చేస్తున్నారు.


కొందరు ఇండియా గెలుస్తుందా? ఆస్ట్రేలియా గెలుస్తుందా? అని అడుగుతున్నారు. ప్రతీ చోటా ఇండియా 95 పర్సంట్ అని చూపిస్తోంది. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఎవరికనే అంశంపై నెటిజన్లు జుత్తు పీక్కుంటున్నారు.

కొహ్లీదే కీలకమా..


ముఖ్యంగా విరాట్ కొహ్లీ ఒక్కడూ నిలబడి, మిగిలిన యువతరాన్నంతా దగ్గరుండి నడిపిస్తున్నాడు. వాళ్లు స్లో అయితే, తను స్పీడు గా ఆడుతున్నాడు. అదే వాళ్లు స్పీడుగా ఉంటే, తను ఆటోమేటిక్ గా స్లో అయిపోతున్నాడు. ఒకేసారి రెండు వికెట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంటే అవతల అయ్యర్ ముందుకెళ్లి బాదేస్తుంటే, ఇవతల తను కూడా కొట్టేయాలని అనుకోవడం లేదు. ఎవరో ఒకరే హిట్టింగ్ చేస్తున్నారు.

ఓపెనర్లలో కూడా రోహిత్ ఆడుతుంటే గిల్ సంయమనం పాటిస్తున్నాడు. ఈ ప్లాన్ మొదటి మ్యాచ్ నుంచి అమలు చేస్తున్నారు. అందులో కొహ్లీ సూపర్బ్ గా చేసి 711 రన్స్ చేసి నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నాడు.  ఇందులో మూడు సెంచరీలు, 5 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.
అందుకే న్యాయంగా, ధర్మంగా తనకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ రావాలని పలువురు కోరుతున్నారు.

రోహిత్ కెప్టెన్సీ వల్లే..ఇంత దూరం వచ్చాం..

వన్డే వరల్డ్ కప్ 2023 కి ముందు రోహిత్ కెప్టెన్సీకి, ఇప్పుడు చూస్తున్న కెప్టెన్సీకి అసలు పొంతనే లేదు. ఎంతలో ఎంత మార్పు వచ్చింది..ఫీల్డ్ లో ఎంత చక్కగా ఫీల్డర్లను మోహరిస్తున్నాడు. బౌలర్లను ఎంత తెలివిగా మార్చుతున్నాడు. అవసరమైతే తనతో కలిసి 10మందిని దగ్గరికి తీసుకుని టీమ్ స్పిరిట్ ని పెంపొదిస్తున్నాడు. ఇక రోహిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. అలాగే ఓపెనర్ గా వచ్చి అదిరిపోయే ఆరంభాలు ఇస్తున్నాడు.  మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి తగ్గిస్తున్నాడు. ఇప్పటికి 556 పరుగులు చేశాడు. అందుకే తనకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు రావాలని అంటున్నారు.

బౌలింగ్ పులి.. షమీ

వరల్డ్ కప్ కి ముందు షమీ వేరు..వరల్డ్ కప్ తర్వాత షమీ వేరన్నట్టుగా తన పెర్ ఫార్మెన్స్ మారిపోయింది. మామూలుగా కాదు.. షమీ బౌలింగ్ కి వస్తే ప్రత్యర్థి బ్యాటర్లు గడగడమని వణికేస్తున్నారు. ఈ ఆరు బాల్స్ డిఫెన్స్ ఆడుకుంటే చాలురా..అనుకుంటున్నారు.
మొదట నాలుగు మ్యాచ్ లు ఆడలేదు. అయినా సరే, తర్వాత 6 మ్యాచ్ ల్లో 23 వికెట్లు తీసి వరల్డ్ కప్ లో నెంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు. సెమీస్ లో కివీస్ పై నిప్పులు కురిపించాడు. 7 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
నిజంగా వరల్డ్ కప్ కానీ కొడితే అందులో సగ భాగం షమీకే చెందుతుందని చాలాభాగం అంటున్నారు. అందుకని న్యాయంగా, ధర్మంగా షమీకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ రావాలని అంటున్నారు.

ఈ విషయంలో యవరాజ్ సింగ్ స్పందించాడు. అందరి సస్పెన్స్ కు తెరదించాడు. తనేగానీ అక్కడ ఎంపిక చేసే స్థానంలో ఉంటే కొహ్లీ, రోహిత్ కాదు, మహ్మద్ షమీకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు ఇస్తానని తెలిపాడు. అతనకివ్వడమే న్యాయమని అన్నాడు. చూశారు కదండీ..మరి యూవీతో అందరూ ఏకీభవించినట్టే కదా..

Related News

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Onion prices: ఆకాశన్నంటిన ఉల్లి ధరలు.. మరింత పెరగనున్నట్లు అంచనా!

Arunachal Pradesh: దారుణం.. 21 మంది స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి.. హాస్టల్ వార్డెన్‌కు ఉరిశిక్ష

YS Jagan: టెన్షన్ టెన్షన్.. తిరుమలకు జగన్.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30!

Horoscope 27 September 2024: ఈ రాశి వారికి ఊహించని ధన లాభం.. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం!

Big Stories

×